పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దుమ్ము రేపుతుంది ప్రియమణి. తన వలపు వయ్యారాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. వయసు పెరిగిన ఈ భామలో జోరు ఏమాత్రం తగ్గలేదు. వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ.
ప్రస్తుతం ఈమె చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి వాటితో పాటు వెబ్ సిరీస్ లు టీవీ షోలు చేస్తూ, ఫోటోషూట్లతో సొగసులన్నీ వడ్డించేస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది. 2003లో ఎవరే అతగాడు సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది ప్రియమణి.

తరువాత మంచి మంచి సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక హీరో నాగార్జున కూడా వయసు పెరిగిందన్న మాటే కానీ అందంలోనూ, యాక్టివ్ నెస్ లోనూ ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నాడు. అంతేకాకుండా బిగ్ బాస్ షో చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులకు అవుతున్నాడు. మొన్ననే నా స్వామి రంగా సినిమాతో హిట్ అందుకున్నాడు నాగార్జున. అయితే ఇప్పుడు ఇద్దరి బయోగ్రఫీ ఎందుకు అంటే అసలు కధేమిటో చూద్దాం రండి.

వీరిద్దరూ కలిసి 2010లో రగడ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో ప్రియమణితో పాటు అనుష్క కూడా నటించింది. అయితే ఈ సినిమా ఆశించినంత హిట్ సాధించలేకపోయింది కానీ తమిళ హిందీ భాషలలో ఈ సినిమాని డబ్ చేశారు. ఆ తరువాత వీరిద్దరూ కలిసి నటించలేదు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరూ ఒక సినిమా కోసం కలిసి నటించబోతున్నారు.

ఒక అద్భుతమైన స్టోరీ కోసం వీరు కలిసి పని చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం. కొత్త డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో కోర్టు డ్రామాగా సాగే ఒక స్పెషల్ స్టోరీలో వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారు. అయితే ఇంతకుమించి ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ బయటికి రాలేదు. ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

పూజా హెగ్డే గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు పొందుతూ, తక్కువ కాలంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్ల లిస్ట్ లో చేరింది. పూజా హెగ్డే దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. కోలీవుడ్ లో విజయ్ దళపతి బీస్ట్ సినిమాలో నటించింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్. హృతిక్ రోషన్ వంటి హీరోలతో నటించింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరుకారం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే, అచ్చం పూజా హెగ్డేల కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పూజా హెగ్డేలా కనిపిస్తున్న ఆ అమ్మయి పేరు సవియా గోన్సాల్వేస్. ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. సవియా గోన్సాల్వేస్ ట్రావెల్, టూరిజం మారియు ఏవియేషన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 80 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సవియా గోన్సాల్వేస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది.

























