బుల్లితెర నటి సంభావన సేత్ తండ్రిగారు ఇటీవలే కరోనా కారణం గా మరణించారు. ఆమె తండ్రిని డాక్టర్లే చంపేశారు అంటూ ఆరోపణలు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణం గానే తన తండ్రి మరణించాడంటూ నటి సంభావన తీవ్ర ఆరోపణలను చేసారు. ఆక్సిజెన్ లెవెల్స్ తక్కువ గా ఉన్నా కూడా.. తన తండ్రిని వైద్యులు పట్టించుకోలేదని ఆవేదన చెందారు.

వారి నిర్లక్ష్యం కారణం గానే తన తండ్రి మరణించాడని.. ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో ను పంచుకున్నారు. ఈ వీడియో లో నటి సంభావన మాట్లాడుతూ.. “డాక్టర్లు అందరు దేవుళ్ళు కాదు.. వారిలో మనలాంటి వాళ్ళని హత్య చేసే రాక్షసులు కూడా ఉంటారు.. వారే ఇప్పడు నా తండ్రి మరణానికి కారణమయ్యారు. నా తండ్రిని పోగొట్టుకోవడం నా జీవితం లో తీవ్రమైన పరిస్థితి..

కానీ, నేను ధైర్యం గానే ఉంటాను. నేను న్యాయం కోసమే పోరాడుతాను.. నేను గెలవచ్చు..గెలవలేకపోవచ్చు.. కానీ.. కొంతమంది నిజస్వరూపాన్ని మాత్రం కచ్చితం గా బయటపెడతాను. ఇప్పటికే నా తండ్రి మరణానికి కారణమైన జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి కి నోటీసులు కూడా పంపాము. మీరు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొని ఎదిరించలేకపోయి ఉండచ్చు.. మీరంతా నాకు సపోర్ట్ చేయండి..” అంటూ ఆమె వీడియో లో పేర్కొన్నారు. ఆమె వీడియో కు బాగా రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు కూడా అండగా నిలబడతామని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
View this post on Instagram



























































