ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉన్నట్టు సినిమా బృందం ప్రకటించింది. అయితే సినిమాకి కొంత మంది పాజిటివ్ టాక్ ఇస్తే, కొంత మందికి మాత్రం అంతగా నచ్చలేదు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత నెల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. 700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ రేంజ్ ను మరోసారి నిరూపించింది.

థియేటర్లలో విడుదల అయ్యి నెల రోజులు కాకముందే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 20అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో సలార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలా ఉంటే సలార్ మూవీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా హిందీలో కూడా విడుదలైంది. షారుక్ ఖాన్ డంకి కి పోటీగా విడుదలయ్యి రికార్డ్ సృష్టించింది సలార్. హిందీలో 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.













రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన ‘ఆ నలుగురు’ సినిమా 2004 లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు. నటి ఆమని, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, హీరో రాజా లాంటి వారు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.
విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటికీ ఈ మూవీ టీవిలో వస్తే చూసే ఆడియెన్స్ ఉన్నారు. అలాంటి సినిమాకి హీరోగా ముందుగా అనుకున్నది రాజేంద్రప్రసాద్ కాదు. సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. చంద్ర సిద్ధార్థ ఈ కథను సూపర్ స్టార్ కృష్ణ చెప్పడంతో ఆయనకు బాగా నచ్చి, నటించాలని అనుకున్నారంట. కానీ ఆయన వయసు రీత్యా ఎక్కువ నిడివి పాత్రలో నటించలేనని అన్నారంట.
అలా రాజేంద్రప్రసాద్ నటించారు. అలాగే సినిమాలో హీరోయిన్ కోసం గౌతమి, లక్ష్మి, సుహాసిని, భానుప్రియ, రోజా వంటి వారిని సంప్రదించారట. వారు రిజెక్ట్ చేయడంతో రాజేంద్ర ప్రసాద్ ఆమనిను సూచించడంతో ఆమెను తీసుకున్నారంట. ఈ మూవీ రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది.
