సినిమా వాళ్ళని మనం వేరే ప్రపంచం నుండి వచ్చిన వారిలాగా చూస్తూ ఉంటాం. వారు కూడా మనుషులే అన్న విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. వాళ్ళు ఏది చేసినా కూడా కరెక్ట్ గా చేయాలి అనుకుంటాం. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే అది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది.
కానీ సినిమా వాళ్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకి ఎమోషన్స్ ఉంటాయి. ప్రతిరోజు సంతోషంగా ఉండలేరు. ఒకసారి కోపంగా ఉంటారు. ఒక్కొక్కసారి బాధగా ఉంటారు. అలా బాధగా ఉన్నా సరే వాళ్ళ వృత్తి మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని వేరుగా చూస్తూ, వారి వ్యక్తిగతంగా పరిస్థితి ఎలా ఉన్నా కూడా వారి పని వారు చేసుకుంటారు.

అలా మన సినీ నటులు చాలా ఈవెంట్స్ కి హాజరు అవుతుంటారు. ప్రతి ఈవెంట్ లో ఆనందంగా నవ్వుతూ మాట్లాడడం వారికి ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. వారు ఆ స్థానంలో ఉండడానికి అంతగా ఆదరించిన ప్రేక్షకులని వారి కుటుంబం లాగా వాళ్ళు భావిస్తారు కాబట్టి వారి బాధని కూడా ప్రేక్షకులతో పంచుకోవాలి అని అనుకుంటారు. అలా స్టేజ్ మీద కొంత మంది నటులు ఎమోషనల్ అయ్యారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 జూనియర్ ఎన్టీఆర్
అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు మరణించారు. ఆ తర్వాత అరవింద సమేత రిలీజ్ కి ముందు చేసిన ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
#2 షారుఖ్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
#3 రష్మిక మందన్న
హీరోయిన్ రష్మిక మందన్న డియర్ కామ్రేడ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, తను సినిమా చేసే సమయంలో ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారో చెప్పారు. నిజంగా ఒక హీరోయిన్ ఇలా మాట్లాడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.
#4 అల్లు అర్జున్
అల వైకుంఠపురంలో ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, తన తండ్రి తన కోసం ఎంతో చేశారు అని, అల్లు అరవింద్ గారికి థాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
#5 కార్తికేయ గుమ్మకొండ
కార్తికేయ ఒక ఈవెంట్ లో చిరంజీవికి ట్రిబ్యూట్ ఇస్తూ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. అందులో కార్తికేయ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అది చూస్తున్న చిరంజీవి కూడా ఎమోషనల్ అయ్యారు.
#6 అనుష్క శెట్టి
హీరోయిన్ అనుష్క అసలు బయటికి రావడమే చాలా తక్కువ. అలాంటిది అనుష్క నిశ్శబ్దం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ ప్రోగ్రామ్ కి వెళ్లారు. అక్కడ అనుష్క జర్నీని ఒక వీడియో చేసి చూపించారు. అది చూసిన అనుష్క ఎమోషనల్ అయ్యారు.
#7 సాయి పల్లవి
సాయి పల్లవి కూడా శ్యామ్ సింఘ రాయ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, తనని అంతగా ఆదరించినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ఆ ఈవెంట్ లో సాయి పల్లవి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.
#8 సమంత
యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్ లో కూడా సమంత ఎమోషనల్ అయ్యారు.
#9 శివ రాజ్‌కుమార్
కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన వేద సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా తెలుగులో చేసిన ఒక ఈవెంట్ లో తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్ వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు.
#10 మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు తన సోదరుడు రమేష్ బాబు గారు మరణించారు. అందుకే సర్కారు వారి పాట ఈవెంట్ లో మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా ఇటీవల గుంటూరు కారం ఈవెంట్ లో కూడా ఎమోషనల్ అయ్యారు. గత సంవత్సరం మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు మరణించిన కొంతకాలం తర్వాత, తండ్రి కృష్ణ గారు మరణించారు. దాంతో మహేష్ బాబు ప్రేక్షకులను చూసి ఎమోషనల్ అయ్యి తనకి తల్లి తండ్రులు ప్రేక్షకులే అని చెప్పారు.
#11 ఐశ్వర్యా రాయ్
ఐశ్వర్యా రాయ్ సరబ్జిత్ అనే సినిమా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
#12 విజయ్ దేవరకొండ
దొరసాని ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
అలా ఈ నటులు అభిమానుల మధ్యలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలలో నటించిన తమిళ సినిమా జో. ఈ చిత్రానికి హరిహరన్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని విజన్ సినిమా హౌస్ బ్యానర్ పై నిర్మించారు. సిద్ధు కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా 2023 లో నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల ఆదరణ పొందింది. జనవరి 15 నుండి ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, బాగా డబ్బున్న కుటుంబానికి ఏకైక వారసుడు జో (రియో రాజ్), చిన్నతనం నుండి జోకి ఐదుగురు మిత్రులు ఉంటారు. ఎక్కడికి అయినా ఆ ఫ్రెండ్స్ తో వెళ్తుంటాడు. జోకాలేజీలో, తన క్లాస్మేట్ గా కొత్తగా సుచి (మాళవిక మనోజ్) జాయిన్ అవుతుంది. కేరళకు చెందిన సుచి సెన్సిటివ్, మృదుస్వభావి కావడంతో ఆమెను ఇష్టపడతాడు. ఆమెను వేధిస్తున్న సీనియర్ నుండి సేవ్ చేస్తాడు. ఆ క్రమంలో ఇద్దరి ఆమధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీస్తుంది. కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
అయితే సుచి తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. విషయం తెలిసిన సుచి ‘జో’ కి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి, తన తల్లిదండ్రులతో తమ పెళ్లి గురించి మాట్లాడమని చెబుతుంది. దాంతో ‘జో’ సుచి ఇంటికి వెళతాడు. వారి ప్రేమ గురించి తల్లిదండ్రులతో ప్రేమ, పెళ్లి గురించి ప్రయత్నిస్తాడు. కానీ వారి బంధువులు ‘జో’ ను కొడతారు. అది గోడవగా మారుతుంది. ఆ క్రమంలో సుచి తండ్రి క్రింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుచి జో పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక జో చెప్పేది వినకుండా తనను ఇక మీదట కలవవద్దని చెప్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? వారిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించారా? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

సాయి పల్లవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉనడకపోయినా, ఆమె సోదరి పూజా కన్నన్ మాత్రం ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. పూజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సాయి పల్లవికి, తనకు, సంబంధించిన ఫోటోలను పూజ షేర్ చేస్తుంటుంది. ఆమె తన అక్క దారిలోనే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2021లో విడుదలైన కోలీవుడ్ మూవీ ‘చిత్తిరాయి సెవ్వానం’ అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. సముద్ర ఖని కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా తరువాత పూజాకన్నన్ సినిమాల పై దృష్టి పెట్టలేదు.
సాయి పల్లవి పెళ్లి విషయం గురించి బయటకు రాలేదు. అయితే పూజాకన్నన్ తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అతనితో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ” నా అందమైన లిల్ బటన్ నిస్వార్థంగా ప్రేమించడం, సహనం, ప్రేమలో స్థిరంగా ఉండటం మరియు మనోహరంగా ఉండటం నేర్పించాడు. ఈ వినీత్ నా సూర్య కిరణం. క్రైమ్‌లో నా పార్ట్నర్, ఇప్పుడు, నా లైఫ్ పార్ట్నర్” అంటూ రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే కొందరు నెటిజెన్లు మాత్రం అక్క కన్నా ముందే పెళ్లిచేసుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందులో తప్పు ఏం ఉందని ఆమె పై అలా కామెంట్స్ చేస్తున్నారు. అలా ఎంతోమంది పెళ్లి చేసుకున్నారు. ఈరోజుల్లో ఇలాంటివి సర్వసాధారణం.
ఈటీవీ శ్రీదేవి డ్రామ కంపెనీ షోకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ షోని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక ఈషో ద్వారా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య గాజువాక లేడి కండక్టర్ ఝాన్సీ పల్సర్ బైక్ సాంగ్ కి డ్యాన్స్ వేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి రష్మి గౌతం యాంకర్ గా చేస్తున్నారు. వారం వారం కొత్త కొత్త థీమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చే శ్రీదేవి డ్రామ కంపెనీలో హైపర్ ఆది, ఫైమా, సత్య వంటి పలువురు పాల్గొన్నారు. జనవరి 7 న ప్రసారం అయిన శ్రీదేవి డ్రామ కంపెనీలో ఎప్పటిలానే కొందరు సింగర్స్ పాటలు పాడారు. హైపర్ ఆది స్కిట్ వంటివి ఆడియెన్స్ ని అలరించాయి.
అయితే ఈ షోలో నైటీ థీమ్ డ్యాన్స్ లో సత్య, ఫైమా తదితరులు నైటీలు ధరించి వేసిన డ్యాన్స్ వీడియోకి మాత్రం యూట్యూబ్ లో నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. “కొరియోగ్రాఫర్ కు బుద్దిలేదు అనుకుంటే ఆడేవారికి సిగ్గు ఉండక్కర్లేదా. ఆ ఇంద్రజ కు రష్మీకి వేసి ఆడిస్తే ఇంకా మంచి రేటింగ్ వస్తుంది కదా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.








ఆదిత్య హాసన్ తెరకెక్కించిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అప్పటి తరం పిల్లలు, తల్లి తండ్రులు, 90లలోని పరిస్థితులను, ఎమోషన్స్, ఆకట్టుకునే డైలాగ్స్ తో పాటు మ్యూజిక్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ 120 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఐఎండిబిలో 9.6 రేటింగ్ పొందింది. శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి, వసంతిక, రోహన్ రాయ్ నటించారు.
శివాజీ కూతురు దివ్య పాత్రలో వసంతిక మచ్చ నటించింది. ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సిరీస్ కన్నా ముందు ఆమె పలు చిత్రాలలో బాలనటిగా నటించి, మెప్పించింది. 90స్ సిరీస్ తో పాపులర్ అవడంతో వసంతిక నటించిన మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాని హీరోగా నటించిన ఓ సినిమాలో వసంతిక బాలనటిగా కనిపించింది.
నాని, మెహ్రీన్ పిర్జాద జంటగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ మూవీ 2016 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వసంతిక బాలనటిగా కనిపించింది. నాని, వసంతిక ఉన్న సీన్ మరియు 90స్ లోని సీన్ కలిపి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ‘ఓరిని ఈ పాప అప్పుడే పెద్దది అయిపోయిందా’ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.













