సూపర్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు సినిమా బృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మహేష్ బాబు, శ్రీలీల ఇచ్చిన ఇంటర్వ్యూ ఇవాళ బయటికి వచ్చింది.
తర్వాత కూడా సినిమా బృందం మరికొన్ని ఇంటర్వ్యూలు ఇస్తారు అని తెలుస్తోంది. తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సినిమాకి సంబంధించిన చాలా విషయాలని మహేష్ బాబు, శ్రీలీల ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇందులో మహేష్ బాబు తాగింది నిజమైన బీడీ కాదు అని, సినిమాలో వాడిన బీడీని లవంగం ఆకులతో తయారు చేశారు అని మహేష్ బాబు చెప్పారు. అయితే, ఇదిలా ఉండగా సినిమాలు అన్న తర్వాత పొరపాట్లు జరగడం చాలా సహజం. ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక పొరపాటు మీద ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. అదేంటంటే, సినిమాలో హీరో అయిన రమణ సినిమా మొత్తం బీడీ తాగుతూనే ఉంటాడు.

అతను బీడీ తరచుగా కాలుస్తూ ఉంటాడు కాబట్టి అది కచ్చితంగా ఆరోగ్యానికి హానికరం. అయితే, హరిదాసుని కొట్టాక హరిదాసుకి మేకు గుచ్చుకుంటుంది. దాంతో చాలా రక్తం పోతుంది. హరిదాసుకి రక్తం ఇవ్వడానికి ఒక మనిషి కావాలి అని అడుగుతున్నప్పుడు, రమణ తన బ్లడ్ తీసుకోమని చెప్తాడు. ఈ సీన్ మీద కామెంట్స్ వస్తున్నాయి.

“ఒక బీడీ తాగే వ్యక్తి ఆరోగ్యం కచ్చితంగా నిలకడగా ఉండదు. అలాంటి ఒక వ్యక్తి రక్తం ఇంకొక వ్యక్తికి ఎలా ఎక్కిస్తారు? సీన్ రాసేటప్పుడు చూసుకోవాలి కదా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఇది కొత్త ఏమీ కాదు. అంతకుముందు చాలా సినిమాల్లో చాలా సీన్స్ లో లాజిక్ మిస్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. అయితే మరి కొంత మంది మాత్రం, “ఇలాంటి చిన్న చిన్న విషయాలని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది?” అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.







ఆదిత్య హాసన్ తెరకెక్కించిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ అప్పటి తరం పిల్లలు, తల్లి తండ్రులు, 90లలోని పరిస్థితులను, ఎమోషన్స్, ఆకట్టుకునే డైలాగ్స్ తో పాటు మ్యూజిక్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ 120 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. ఐఎండిబిలో 9.6 రేటింగ్ పొందింది. శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి, వసంతిక, రోహన్ రాయ్ నటించారు.
శివాజీ కూతురు దివ్య పాత్రలో వసంతిక మచ్చ నటించింది. ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సిరీస్ కన్నా ముందు ఆమె పలు చిత్రాలలో బాలనటిగా నటించి, మెప్పించింది. 90స్ సిరీస్ తో పాపులర్ అవడంతో వసంతిక నటించిన మూవీకి సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నాని హీరోగా నటించిన ఓ సినిమాలో వసంతిక బాలనటిగా కనిపించింది.
నాని, మెహ్రీన్ పిర్జాద జంటగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ మూవీ 2016 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి డైరెక్టర్ హను రాఘవపుడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వసంతిక బాలనటిగా కనిపించింది. నాని, వసంతిక ఉన్న సీన్ మరియు 90స్ లోని సీన్ కలిపి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ‘ఓరిని ఈ పాప అప్పుడే పెద్దది అయిపోయిందా’ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశారు. నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
























గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ నటించింది. ఆ మూవీ హిట్ అవడంతో ఆమెకు క్రేజ్ వచ్చింది. 2005 లో మళయాళంలో రిలీజ్ అయిన ‘బాయ్ ఫ్రెండ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 2008 లో ఆలయం మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తరువాత వర్షం సాక్షిగా లో నటించినా గుర్తింపు రాలేదు. ఆ తరువాత తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు.
2022 లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ తో ఆమెకు మంచి ఫేమ్ లభించింది. కానీ సినిమా ఆఫర్స్ మాత్రం ఎక్కువగా రాలేదు.సినీ అవకాశాలు ఎలా ఉన్నా, హనీ రోజ్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్. ఇతర ఈవెంట్స్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి హాజరు అయిన హనీ రోజ్ న్యూ లుక్ లో వెరైటీగా కనిపించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూ హెయిర్ స్టైల్, ఆరంజ్ కలర్ డ్రెస్లో అచ్చం హాలీవుడ్ హీరోయిన్ హనీ రోజ్ కనిపించారు. ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించు కుందని కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చారు. హనీ రోజ్ ప్రస్తుతం మళయాళంలో ‘తేరీ మేరీ’ తెలుగులో ‘గాలి బ్రదర్స్’ సినిమాలలో నటిస్తున్నారు.
ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే. చిరంజీవి గారి పెళ్లి టైం కి ఆయన ఇంకా స్టార్ అవ్వలేదు. అల్లు రామలింగయ్య గారు అప్పటికే ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు. అంత పెద్ద నటుడు తన కూతురుకి చిరుని ఇచ్చి ఎలా పెళ్లి చేసారు అని అప్పట్లో అందరు అనుకునే వారు. ఈ ప్రశ్నలకు సీనియర్ హీరోయిన్ జవాబిచ్చింది. చిరంజీవి సురేఖను వివాహం చేసుకోవడానికి సీనియర్ హీరోయిన్ రాజ శ్రీ నే కారణమట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు బయటపెట్టారు.

