భుజం పట్టడం, ఆమ్లెట్లు వేయడం… అంతమంచి హీరోయిన్ కి ఇలాంటి రోల్ ఇచ్చారా “గురూజీ”.?

భుజం పట్టడం, ఆమ్లెట్లు వేయడం… అంతమంచి హీరోయిన్ కి ఇలాంటి రోల్ ఇచ్చారా “గురూజీ”.?

by Harika

Ads

ఇండస్ట్రీలో హీరోలకి అభిమానులు ఉంటారు, హీరోయిన్లకూ అభిమానులు ఉంటారు కానీ కొందరు దర్శకులకు కూడా వీరాభిమానులు ఉంటారు. అలాంటి దర్శకులలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన సినిమాలు అంటే ప్రేక్షకులకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తాయి. ఒక సినిమా విడుదల అయితే రిపీట్ మోడ్ లో పెట్టి చూస్తారు. ఈయన సినిమాలకు ఉన్న రేంజ్ అలాంటిది. అయితే రీసెంట్ గా విడుదలైన గుంటూరు కారంలో త్రివిక్రమ్ మార్క్ కనిపించట్లేదు అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు.

Video Advertisement

త్రివిక్రమ్ సినిమాలంటే మామూలుగా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కనిపిస్తారు. చిన్న చిన్న పాత్రలలో ఉన్నా వారిని సరిగ్గా వాడుకుంటారు అనే టాక్ ఉంటుంది. కానీ గత మూడు నాలుగు సినిమాల నుంచి త్రివిక్రమ్ ఒక తప్పు చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. అదేంటంటే సెకండ్ హీరోయిన్ ని సరిగ్గా వాడుకోకపోవడం. ఈ గుంటూరు కారం సినిమాలోనే తీసుకుంటే రాజీ అనే మరదలు క్యారెక్టర్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

కానీ తిప్పి కొడితే మూడు సీన్లు కూడా తనతో తీయించలేదు. అసలు సినిమాలో మీనాక్షి ఎందుకు ఉందో కూడా తెలీదు. కేవలం మహేష్ బాబు కి భుజం పట్టడం, ఆమ్లెట్లు వేయడానికి తప్ప ఆ క్యారెక్టర్ కి ఏ ఉపయోగమూ లేదు. ముందు సినిమా “అలా వైకుంఠపురం” లో కూడా నివేదా పేతురాజ్ ఉన్నదంటే ఉన్నదని తప్ప తనకంటూ ఒక ఇంపార్టెన్స్ కూడా లేదు. అంతకుముందు “అరవింద సమేత” లో ఈషా రెబ్బ కూడా రెండు మూడు సన్నివేశాలలో వచ్చి పోతూ ఉంటుంది.

ఈ మూడు సినిమాలలోని సెకండ్ హీరోయిన్ లకు పెద్దగా గుర్తింపు ఏముండదు. వాళ్లకి కూడా త్రివిక్రమ్ సినిమాలో నటించాము అన్న ఆనందం తప్ప ఏమీ లాభం లేదు. అంత చిన్న పాత్రలకి పేరు ఉన్న హీరోయిన్లను తీసుకోవడం ఎందుకు? ఒక చిన్న గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిలని తీసుకున్నా సరిపోయేది కదా గురూజీ అని చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like