కోలీవుడ్ హీరో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న చిత్రం సైరన్. ఈ చిత్రంలో జయం రవి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇందులో జయం రవి ఒక జైలర్ గా కనిపించగా కీర్తి సురేష్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ జయం రవికి ప్రేయసిగా నటించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లు, టీజర్లు విడుదల చేసిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ప్రేక్షకులకు కూడా ఈ టీజర్ బాగా నచ్చి రిలీజ్ డేట్ ఎప్పుడా అని ఆరాట పడిపోతున్నారు. చిత్ర బృందం కూడా త్వరలోనే ఈ చిత్రం వెండి తెర మీదకు వస్తుంది అని సమాచారం ఇచ్చారు. కానీ ఇప్పుడు జయం రవి ఫాన్స్ కు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రం నేరుగా ఓటీటీ లో విడుదల కాబోతుందట. అది కూడా ఈ జనవరి 26న డైరెక్ట్ గా జి5 లోకి ఈ చిత్రం విడుదల కానుంది అని తెలిసిన వెంటనే ఫాన్స్ అందరూ నిరాశ పడుతున్నారు.
ఎందుకంటే జయం రవి ముందు సినిమా కూడా నేరుగా ఓటీటీ లోకే రావడం విశేషం. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అని అంటున్నారు. కానీ ఇప్పటికీ అఫీషియల్ గా చిత్ర బృందం ఏమీ ప్రకటించలేదు కానీ సామాజిక మాధ్యమాలలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలలో నటిస్తున్న జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లకు కూడా ఈ మధ్య థియేటర్లలో సినిమాలు ఎక్కువ పడలేదు.

ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు వీళ్ళని థియేటర్లో చూద్దామని ఆసక్తి పడుతున్న సమయంలో ఈ సినిమా గురించి తెలిసి అందరూ పండగ చేసుకున్నారు కానీ ఇది కూడా థియేటర్లలో రావట్లేదు అని తెలిసి అందరి ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. దీనికి కారణాలు ఏమో, ఏంటో తెలియదు కానీ అఫీషియల్ న్యూస్ మాత్రం త్వరలోనే రాబోతుంది అని తెలుస్తుంది.

రవి బస్రూర్ తన అసలు పేరు కాదని, తన గతాన్ని, ఎక్కడి నుండి వచ్చాడో ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కన్నడ సరిగమప షోలో పాల్గొన్న రవి బస్రూర్, తన గతాన్ని, పేరు ఎందుకు మార్చుకున్నారో వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో తినడానికి కూడా ఏం దొరికేది కాదని, అప్పుడు తన జేబులో ఒక చిట్టీ మాత్రం ఉండేదని, ఏ రోజు, ఏ గుళ్లో ప్రసాదం ఏం పెడతారో అందులో రాసి పెట్టుకునేవారట.
ఆ చిట్టి ప్రకారం ఆ దేవాలయానికి వెళ్లి ప్రసాదం తింటూ తన కడుపు నింపుకునేవారట. అలాంటి సమయంలో కామత్ అనే పెద్దాయన ఆయనను బెంగళూరులోని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడట. ఇత్తడి, బంగారు వస్తువుల తయారీ వంటి పనులు చేస్తాడని చెప్పాడట. అయితే ఇతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ పని చేస్తుంటాడాని చెప్పి, పనిలోకి తీసకోమని చెప్పాడంట, అయిత పని ఇచ్చిన వ్యక్తి గిటార్ కొనుక్కోవడానికి రూ. 35 వేలు ఇచ్చాడట. అది చూసి ఇద్దరు షాక్ అయ్యారట. పరిచయమే కూడా లేని వ్యక్తి అంత డబ్బు ఇవ్వడమేంటని షాక్ అయ్యారట.
అంతేకాకుండా ఫ్యూచర్ లో మంచి సంగీత దర్శకుడు అవుతాడని చెప్పాడు. ఇక ఇతన్ని కలవాలంటే ఐదు నెలలు అపాయింట్ మెంట్ తీసుకుంటారని అన్నాడట. అయితే అలాంటివాటిని తాను నమ్మనని రవి బస్రూర్ అన్నాడట. కానీ ఆ తరువాత ఆ వ్యక్తి చెప్పిందే జరిగింది. తనకు సాయం చేసిన ఆ వ్యక్తికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఆయన పేరు రవి. గౌరవం ఆయనకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి పేరుని, తన గ్రామం పేరుతో కలిపి పెట్టుకున్నారట. అలా కిరణ్ నుండి రవి బస్రూర్ గా మారానని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.




























తేజ సజ్జా:
వరలక్ష్మీ శరత్ కుమార్:
వినయ్ రాయ్:
వెన్నెల కిశోర్:
హనుమాన్ మూవీలో నటించిన ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ రాజ్ దీపక్ శెట్టి రూ. 85 లక్షలు, గెటప్ శ్రీను 35 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

