“సలార్” మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఈ విషయాలు తెలుసా.? పేరు ఎందుకు మార్చుకున్నారంటే.?

“సలార్” మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఈ విషయాలు తెలుసా.? పేరు ఎందుకు మార్చుకున్నారంటే.?

by kavitha

Ads

కేజీఎఫ్‌ రిలీజ్ తరువాత రవి బస్రూర్ పేరు పాన్‌ ఇండియా వైడ్ గా  పాపులర్ అయ్యింది. ఎవరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ అని భారతీయ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ‘సలార్’ చిత్రంతో మరోసారి ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది.

Video Advertisement

ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ మూవీ రిలీజ్ అయ్యి, 18 రోజులు అవుతున్న బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకి రవి బస్రూర్‌ అందించిన మ్యూజిక్ ప్లస్. సాంగ్స్, అద్భుతమైన బీజీఎమ్ అందించారు. ప్రస్తుతం రవి బస్రూర్ బీజీఎమ్ కోసం బాలీవుడ్ స్టార్లు సైతం తహతహలాడుతున్నారు. అయితే రవి బస్రూర్ అసలు పేరు కాదు. తన పేరు మార్చుకున్నారో ఇప్పుడు చూద్దాం..
రవి బస్రూర్ తన అసలు పేరు కాదని, తన గతాన్ని, ఎక్కడి నుండి వచ్చాడో ఇంతకు ముందు పలు ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాజాగా కన్నడ సరిగమప షోలో పాల్గొన్న రవి బస్రూర్, తన గతాన్ని, పేరు ఎందుకు మార్చుకున్నారో వివరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో తినడానికి కూడా ఏం దొరికేది కాదని, అప్పుడు తన జేబులో ఒక చిట్టీ మాత్రం ఉండేదని, ఏ రోజు, ఏ గుళ్లో ప్రసాదం ఏం పెడతారో అందులో రాసి పెట్టుకునేవారట.
ఆ చిట్టి ప్రకారం ఆ దేవాలయానికి వెళ్లి ప్రసాదం తింటూ తన కడుపు నింపుకునేవారట. అలాంటి సమయంలో కామత్ అనే పెద్దాయన ఆయనను బెంగళూరులోని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడట. ఇత్తడి, బంగారు వస్తువుల తయారీ వంటి పనులు చేస్తాడని చెప్పాడట. అయితే ఇతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఆ పని చేస్తుంటాడాని చెప్పి,  పనిలోకి తీసకోమని చెప్పాడంట, అయిత పని ఇచ్చిన వ్యక్తి గిటార్ కొనుక్కోవడానికి రూ. 35 వేలు ఇచ్చాడట. అది చూసి ఇద్దరు షాక్ అయ్యారట. పరిచయమే కూడా లేని వ్యక్తి అంత డబ్బు ఇవ్వడమేంటని షాక్ అయ్యారట.
అంతేకాకుండా ఫ్యూచర్ లో మంచి సంగీత దర్శకుడు అవుతాడని చెప్పాడు. ఇక ఇతన్ని కలవాలంటే ఐదు నెలలు అపాయింట్ మెంట్ తీసుకుంటారని అన్నాడట. అయితే అలాంటివాటిని తాను నమ్మనని రవి బస్రూర్ అన్నాడట. కానీ ఆ తరువాత ఆ వ్యక్తి చెప్పిందే జరిగింది. తనకు సాయం చేసిన ఆ వ్యక్తికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఆయన పేరు రవి. గౌరవం ఆయనకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి పేరుని, తన గ్రామం పేరుతో కలిపి పెట్టుకున్నారట. అలా కిరణ్ నుండి రవి బస్రూర్ గా మారానని వెల్లడించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also Read: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.? 54 ఏళ్ళు వచ్చినా ఇంకా సింగిల్ గా ఎందుకు ఉన్నారంటే.?

 

 

 


End of Article

You may also like