సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : సైంధవ్
- నటీనటులు : వెంకటేష్ దగ్గుబాటి, శ్రద్ధ శ్రీనాథ్, బేబీ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య.
- నిర్మాత : వెంకట్ బోయినపల్లి
- దర్శకత్వం : శైలేష్ కొలను
- సంగీత దర్శకత్వం : సంతోష్ నారాయణన్
- విడుదల తేదీ : జవనరి 13, 2024

స్టోరీ :
సైంధవ్ కొలను (వెంకటేష్) తన కూతురితో కలిసి ఉంటాడు. సైంధవ్ కి గతం ఉంటుంది. దానికి దూరంగా ప్రస్తుతం అసలు దానికి సంబంధమే లేకుండా బతుకుతాడు. ఒక సమయంలో తన కూతురు గాయత్రి పాప (బేబీ సారా) కి ఆరోగ్యం పాడవుతుంది. ఆ అమ్మాయి కోసం 17 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ కావాల్సి ఉంటుంది. అప్పుడు సైంధవ్ ఏం చేశాడు? అసలు సైంధవ్ గతం ఏంటి? తన కూతురిని ఎలా కాపాడుకున్నాడు? అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ:
అటు కమర్షియల్ సినిమాలని, ఇటు ఎక్స్పరిమెంటల్ సినిమాలని సమానంగా బ్యాలెన్స్ చేస్తున్న నటుల్లో వెంకటేష్ ఒకరు. కమర్షియల్ సినిమాల్లో అయినా కూడా తన వయసుకు తగ్గ పాత్రలే చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఒక యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా కోసం దర్శకుడు శైలేష్ ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. ఆ ఇంజక్షన్ విలువ నిజంగానే 17 కోట్లు ఉంటుంది. దాన్ని తీసుకురావడానికి తన కూతురిని కాపాడుకోవడానికి ఒక తండ్రి పడే తపన ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించారు.

ఎప్పుడో ఘర్షణ సినిమాలో వెంకటేష్ ని ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూసాం. ఇప్పుడు మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఒక సీరియస్ పాత్రలో చూస్తున్నాం. వెంకటేష్ ఈ పాత్రకి చాలా బాగా సూట్ అయ్యారు. డైలాగ్ డెలివరీ నుండి మేనరిజమ్స్ వరకు అన్ని బాగున్నాయి. స్టోరీ పాయింట్ ఎంత బాగున్నా కూడా టేకింగ్ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా వెళుతుంది. స్టోరీలోకి వెళ్లడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా స్టోరీ నడుస్తూ ఉంటుంది కానీ ఎక్కడ గ్రిప్పింగ్ గా అనిపించదు.

అసలు సైంధవ్ అనే వ్యక్తికి అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏముంది అని చూపించాలి అనుకున్నారు. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. నిజంగానే అతని గతం ఏంటి అని ప్రేక్షకులు కూడా ఊహించుకుంటారు. ఆ అంచనాలని అందుకోవడంలో అక్కడక్కడ విఫలం అయ్యారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ ఎంతో అనుభవం ఉన్న నటుడు. ఆయన పోషించని పాత్ర లేదు.

ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించారు. పాత్రలో నటనకి పెద్దగా ఆస్కారం లేకపోయినా కూడా ఎమోషనల్ సీన్స్ లో మాత్రం వెంకటేష్ నటన చూస్తుంటే ఆయనకు నిజంగా ఎంత అనుభవం ఉంది అనేది తెలిసిపోతుంది. ఎమోషన్స్ తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యారు. మనోజ్ఞ పాత్రలో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ తన పాత్ర పరిధి మేరకు బానే నటించారు. మరొక ముఖ్య పాత్రలో నటించిన రుహానీ శర్మ, కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఆండ్రియా కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు.

గాయత్రి పాపగా నటించిన బేబీ సారా మొదటి సినిమా అయినా కూడా చాలా బాగా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా ఇంత బాగా నటించడం అనేది అభినందించాల్సిన విషయం. బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు తెలుగులో మొదటి సినిమా చేశారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తెలుగులో డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నారు. నవజుద్దీన్ కూడా బాగా నటించారు. ఇంకొక పాత్రలో జయప్రకాష్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ముఖేష్ రిషి తెలుగు సినిమాల్లో రెగ్యులర్ గా పోషించే విలన్ పాత్రలోనే కనిపించారు. జిష్షు సేన్‌గుప్తా పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

తనకి ఉన్న లిమిటెడ్ టైంలో బానే నటించారు. మరొక ముఖ్య పాత్రలో హీరో ఆర్య నటించారు. పాత్ర కనిపించేది కొంచెం సేపు అయినా కూడా ఆయన నటన కూడా బాగానే ఉంది. నటులు అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కాబట్టి బాగా నటించలేదు అన్నమాట రాదు. కాకపోతే వారి పాత్రలు మాత్రం కొందరికి ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే, కొంత మంది మాత్రం కొంచెం సేపు కనిపిస్తారు అంతే. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. చాలా స్టైలిష్ గా అనిపించింది.

సంతోష్ నారాయణన్ అందించడం పాటలు అంత గొప్పగా ఏమీ అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్నిచోట్ల బాగుంది. ఇంకా కొన్ని చోట్ల మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ కొన్ని చోట్ల కరెక్ట్ గా ఉన్నా కూడా కొన్ని చోట్ల మాత్రం ఇంకా కాస్త క్రిస్ప్ గా ఎడిట్ చేస్తే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఆ కాన్సెప్ట్ ని తెరపై చూపించడంలో మాత్రం చాలా కష్టపడాలి. ఇక్కడ సినిమా బృందం కష్టం అంతా తెలుస్తోంది. కానీ కొన్ని సీన్స్ లో మాత్రం టేకింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
ప్లస్ పాయింట్స్ :
- వెంకటేష్
- సినిమాటోగ్రఫీ
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
- కొన్ని యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- కొన్ని పాత్రలని రాసుకున్న విధానం
- కొన్ని చోట్ల డల్ అయిన సీన్స్
- పెద్దగా సూట్ అవ్వని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
రేటింగ్:
3/5
ట్యాగ్ లైన్:
స్టోరీ పాయింట్ బాగున్నా కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, కేవలం వెంకటేష్ కోసం మాత్రమే సినిమా చూద్దాం అని అనుకునే వారికి సైంధవ్ సినిమా ఒక్కసారి చూడగలిగే కమర్షియల్ యాక్షన్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :

తెలుగు సీనియర్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, వాసుకి లీడ్ రోల్స్ లో నటించిన వెబ్ సిరీస్ ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. జనవరి 5 నుండి ఈ సిరీస్ ‘ఈటీవీ విన్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. 90లలో ఉన్న మధ్యతరగతి పిలల్ల జీవితాల్ని ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించారు.
శివాజీ, వాసుకి భార్యభర్తలుగా చక్కగా నటించగా, వారి ముగ్గురు పిల్లలకు మంచి పేరు వచ్చింది. వీరిలో పెద్ద అబ్బాయిగా నటించిన బాలనటుడి పేరు మౌళి తనుజ్ ప్రశాంత్. ఇప్పటికే మౌళి సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీ. అతన్ని 4 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మౌళి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సైతం ఉంది. ఇదివరకే ‘హాస్టల్ డేస్’ సిరీస్ లో నటించాడు.
శివాజీ చిన్న అబ్బాయి ఆదిత్యగా నటించి, పాపులర్ అయిన బాల నటుడి పేరు రోహన్ రాయ్. ఇప్పటికే పలు సీరియల్స్, సినిమాలలో నటించాడు. ఈ సిరీస్ తో మరింత పాపులర్ అయ్యారు. శివాజీ కూతురు దివ్యగా నటించిన వాసంతిక సలార్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఈ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.















సినిమా చూసే ప్రేక్షకుడిని మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాకి ఎంగేజ్ అయ్యేలాగా చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో నటించిన వాళ్లు అందరూ కూడా బాగా నటించారు. హీరో తేజ హనుమంతు అనే పాత్రలో బాగా నటించారు. మిగిలిన పాత్రలు పోషించిన వాళ్ళు అందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టు నటించారు. సత్య, జబర్దస్త్ శ్రీనుకి కూడా మంచి పాత్రలు దొరికాయి. పాటలు పర్వాలేదు. అంత గుర్తుండిపోయే అంత గొప్పగా ఏమీ అనిపించవు.





ఆ ఫోటో ఉన్న హీరో మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర. ఆయన గురించి నేటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఉపేంద్ర ఏం చేసినా అది సంచలనమే. 1995 నుండి అనేక సంచలనాలు క్రియేట్ చేశాడు. ఇండస్ట్రీలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఉపేంద్ర, వరుస విజయాలను అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా ‘నటించిన ఓం’ మూవీ సంచలన విజయం సాధించి, ఎన్నో అవార్డులను అందుకుంది.
ఈ మూవీ గత 28 సంవత్సరాలలో 550 సార్లు రిరిలీజ్ అయ్యి, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఆ తరువాత టనే హీరోగా నటిస్తూ, కూడా సినిమాలు చేసి, బ్లాక్ బాస్టర్స్ అందుకున్నారు. పదిహేను ఏళ్ళ తర్వాత ఒక తాజాగా ‘యూ ఐ’ అనే చిత్రానికి దర్శకత్వం చేస్తూ, ఉపేంద్ర నటిస్తున్నారు. ఈ మూవీని ఎప్పటిలానే తన శైలిలో ఎవరు ఊహించని కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల నిడివి కల ఈ వీడియో మూవీ పై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ మూవీ కోసం ఉపేంద్ర సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. వింతగా ఉన్న మనుషులు, చివర్లో ఉపేంద్ర గుర్రం పై డిఫరెంట్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర డీ గ్లామర్‌గా కనిపిస్తూ ఆడియెన్స్ ను భయపేట్టేలా ఉన్నారు. ఉపేంద్ర ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.