సముద్రం బ్యాక్ డ్రాప్ తో 5 సినిమాలు…ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ అనుకుంటా.?

సముద్రం బ్యాక్ డ్రాప్ తో 5 సినిమాలు…ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ అనుకుంటా.?

by kavitha

Ads

అప్పట్లో స‌ముద్రం నేప‌థ్యంలో చిత్రాలు వచ్చేవి. అయితే కొన్నేళ్లుగా అంతగా రాలేదు. మూడేళ్ళ నుండి టాలీవుడ్‌ లో సముద్రం నేపథ్యంలో సినిమాలు తెరకెక్కి, హిట్ అయ్యాయి. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలు ‘సముద్రం’ పైనే దృష్టి పెట్టారేమో అనిపిస్తోంది. దాదాపు నాలుగైదు సినిమాలు, అందులోను స్టార్ హీరోల చిత్రాలు ‘సముద్రం’ నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.

Video Advertisement

టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్‌ హీరోలు నటిస్తున్న సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. సముద్రం తెలుగు ఇండస్ట్రీకి సక్సెస్ సెంటిమెంట్‌గా మారిందని అంటున్నారు. మరి సముద్ర నేపథ్యంలో వచ్చిన, రాబోతున్న సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. ఉప్పెన:

2021 లో రిలీజ్ అయిన ఉప్పెన నుండి  సముద్రం నేపథ్యంలో వచ్చే సినిమాల సంఖ్య పెరిగిపోయింది. ఈ మూవీలో హీరో జాలరిగా నటించాడు. ఈ మూవీతో పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ సంచలన విజయం సాధించింది.
2. వాల్తేరు వీరయ్య:

గత ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి జాలరిగా కనిపించారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజ కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
3. దేవర:

యంగ్ టైగర్ ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీ పూర్తిగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం సముద్రాన్ని గ్రాఫిక్స్‌లో ఓ సృష్టిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ లో సముద్రం, సముద్ర తీరాన జరిగిన ఫైట్ హైలెట్ అయిన విషయం తెలిసిందే.
4. తండేల్:

హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ తండేల్ కూడా సముద్రం నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. గుజరాత్‌లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతోంది.ఈ మూవీ నాగ చైతన్య బోట్ డ్రైవర్‌గా నటిస్తున్నారు. హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది.
5. ఓజీ: 

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సుజీత్‌ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ మూవీ ముంబై పోర్టు, సముద్రం నేపథ్యంలోనే  తిరుగుతుందట. దానికి సంబంధించిన సీన్స్  షూట్ ఇప్పటికే కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది.
Also Read: “గుంటూరు కారం” సినిమాకి ఆ మలయాళ సినిమాతో సంబంధం ఉందా.? ఎలాగంటే.?


End of Article

You may also like