“గుంటూరు కారం” సినిమాకి ఆ మలయాళ సినిమాతో సంబంధం ఉందా.? ఎలాగంటే.?

“గుంటూరు కారం” సినిమాకి ఆ మలయాళ సినిమాతో సంబంధం ఉందా.? ఎలాగంటే.?

by kavitha

Ads

ఆదివారం నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విహస్యం తెలిసిందే. మాస్ అవతార్‌లో మహేష్ బాబు స్వాగ్‌, డైలాగ్స్, ఎమోషన్స్‌తో ఆకట్టుకుంది. యూట్యూబ్ లో సలార్ రికార్డులు బ్రేక్ చేసి టాప్ వన్ గా దూసుకెళ్తోంది.

Video Advertisement

చాలా ఏళ్ళ తరువాత మహేష్ మాస్, యాక్షన్ చూసి ఫ్యాన్స్  సంతోషం పడుతున్నారు. అయితే ఈ  ట్రైలర్ చూసిన చాలా మంది నెటిజెన్లు ఈ మూవీని సౌత్ స్టార్ హీరో నటించిన సినిమాతో పోలుస్తున్నారు. ఆ హీరో ఎవరో? ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 12 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు అటు అభిమానుల నుండి ఇటు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ట్రైలర్ చూసిన చాలామంది మరో సినిమాతో పోలుస్తున్నారు. కొందరు కీర్తికిరీటాలు అనే నవలతో పోలుస్తున్నారు.
ట్రైలర్‌ లో చూపించిన దాని ప్రకారంగా, వసుంధర (రమ్యకృష్ణ), ఆమె పెద్ద కుమారుడు రమణ (మహేశ్‌బాబు)ను చిన్నతనంలోనే విడిచిపెడుతుంది. వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోవడంతో రమణ అనాథగా పెరుగుతాడు. కొన్నేళ్ల అనంతరం ఊహించని పరిస్థితులలో తల్లి కొడుకులు కలుస్తారు. ఆమెకు ఎదురైన ప్రాబ్లమ్స్ ని రమణ తీరుస్తాడా? ఇద్దరికీ నిజం తెలిసిందా? అనేది కథ. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే 2005లో మలయాళ మూవీ రిలీజ్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా వచ్చిన మూవీ పేరు ‘రాజమాణిక్యం’. హీరో రాజమాణిక్యాన్ని తండ్రి చనిపోవడంతో చిన్నతనంలోనే, తల్లి ముత్తులక్ష్మి విడిచిపెడుతుంది.
బిజినెస్ మెన్ రాజారత్నం పిళ్లైని వివాహం చేసుకుంటుంది. అయితే తల్లిని వెతుకుతూ రాజమాణిక్యం రాజారత్నం ఇంటికి వెళ్తాడు. కానీ ముత్తు లక్ష్మి అతన్ని కొడుకుగా ఒప్పుకోదు. రాజారత్నంకు ఈ నిజం తెలియడంతో రాజమాణిక్యంను ఆదరస్తాడు. కమర్షియల్‌ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆ సమయంలో బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. 2008 దాకా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. గుంటూరు కారం ట్రైలర్ లో దాదాపు మమ్ముట్టి మూవీ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టోరీనేనా? కాదా అనేది తెలియాలి అంటే జనవరి 12 దాకా వేచి చూడాల్సిందే.

Also Read: చిరంజీవి నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనా..? ప్లాన్ మామూలుగా లేదుగా..?

 


End of Article

You may also like