సంక్రాంతి రేసులో ఉన్న చిత్రాల్లో టాప్ ప్లేస్ లో ఉన్న సినిమా గుంటూరు కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు.
రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు సాయంత్రం గుంటూరులో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో శ్రీలీల చీరలో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే ఆ చీర ఖరీదు తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గుంటూరు కారం మూవీ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం నాడు గుంటూరులో జరిగింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు అయ్యారు. ఇక ఈ ఈవెంట్లో మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన చిత్రాలకు రివ్యూ చెప్పే నాన్నగారు ఇప్పుడు లేరని, ఇక అభిమానులే తనకు అమ్మ నాన్న అని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరోయిన్ శ్రీలీల తన మాటలతోనే కాకుండా, ట్రెండీ శారీలో ఆకట్టుకుంది.
శ్రీలీల బాటిల్ కలర్ గడుల శారీలో స్టైలీష్ లుక్‌లో మెరిసింది. ఈ ఈవెంట్ కు చీరలో మెరిసిన శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కట్టుకున్న శారీ కొంచెం డిఫరెంట్ గా, స్టైలీష్ గా కనిపించడంతో నెటిజెన్లు ఆ శారీ ఖరీదు మరియు వివరాల గురించి ఆన్లైన్ లో సెర్చింగ్ మొదలుపెట్టారు.
అయితే ఆ శారీ రేటు చూసినవారు షాక్ అవుతున్నారు. ఎందుకంటే శ్రీలీల కట్టుకున్న శారీ ఖరీదు అక్షరాల 1.59.000 రూపాయలు. బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ పేరుతో ‘సవన్ గాంధీ’ అనే వెబ్ సైట్ లో ఈ శారీ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: పూర్తిగా ముంబైకి షిఫ్ట్ అయిపోయిన మంచక్క.. ఇంద్ర భవనం లాంటి ఇంట్లో కొత్త జీవితం!











1. ఉప్పెన:
2. వాల్తేరు వీరయ్య:
3. దేవర:
4. తండేల్:
5. ఓజీ: 
2000 సంవత్సరంలో మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ మూవీ ‘అరయన్నంగళ్ వీడు’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆ తరువాత పరదేశి సినిమాకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డ్ అందుకున్నారు. మలయాళంలో సాధించిన విజయంతో ఆమెకు కన్నడ సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి.
ఇప్పటివరకు లక్ష్మి దాదాపు 40 మలయాళ చిత్రాల్లో నటించింది. మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి, జయరామ్ వంటి సూపర్ స్టార్లందరితో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సైరా నరసింహ రెడ్డి మూవీలో కూడా నటించారు. ఆ తరువాత ఆమె టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, మలయాళ, తమిళ భాషలలో పలు సీరియల్స్ లో కూడా నటించారు. తెలుగులో 2014 లో ఇటీవీలో ప్రసారం అయిన శ్రీవేంకటేశ్వర కల్యాణం సీరియల్ లో శ్రీదేవిగా నటించారు. ఆమెకు నటనతో పాటు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ గుంటూరు కారం. ఈ మూవీ జనవరి 12 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు అటు అభిమానుల నుండి ఇటు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే ట్రైలర్ చూసిన చాలామంది మరో సినిమాతో పోలుస్తున్నారు. కొందరు కీర్తికిరీటాలు అనే నవలతో పోలుస్తున్నారు.
ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారంగా, వసుంధర (రమ్యకృష్ణ), ఆమె పెద్ద కుమారుడు రమణ (మహేశ్‌బాబు)ను చిన్నతనంలోనే విడిచిపెడుతుంది. వారిద్దరి మధ్య సంబంధాలు తెగిపోవడంతో రమణ అనాథగా పెరుగుతాడు. కొన్నేళ్ల అనంతరం ఊహించని పరిస్థితులలో తల్లి కొడుకులు కలుస్తారు. ఆమెకు ఎదురైన ప్రాబ్లమ్స్ ని రమణ తీరుస్తాడా? ఇద్దరికీ నిజం తెలిసిందా? అనేది కథ. దాదాపు ఇలాంటి కాన్సెప్ట్‌తోనే 2005లో మలయాళ మూవీ రిలీజ్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా వచ్చిన మూవీ పేరు ‘రాజమాణిక్యం’. హీరో రాజమాణిక్యాన్ని తండ్రి చనిపోవడంతో చిన్నతనంలోనే, తల్లి ముత్తులక్ష్మి విడిచిపెడుతుంది.
బిజినెస్ మెన్ రాజారత్నం పిళ్లైని వివాహం చేసుకుంటుంది. అయితే తల్లిని వెతుకుతూ రాజమాణిక్యం రాజారత్నం ఇంటికి వెళ్తాడు. కానీ ముత్తు లక్ష్మి అతన్ని కొడుకుగా ఒప్పుకోదు. రాజారత్నంకు ఈ నిజం తెలియడంతో రాజమాణిక్యంను ఆదరస్తాడు. కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. 2008 దాకా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. గుంటూరు కారం ట్రైలర్ లో దాదాపు మమ్ముట్టి మూవీ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టోరీనేనా? కాదా అనేది తెలియాలి అంటే జనవరి 12 దాకా వేచి చూడాల్సిందే.