ఈ మధ్యకాలంలో డయాబెటిస్ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
డయాబెటిస్ పేషెంట్లు ముఖ్యమైన విషయాలు తెలుసుకుని ఫాలో అయితే ఇబ్బందులు రావు. కనుక వాటి కోసం తెలుసుకోవాలి. గ్లూకోజ్ స్థాయి 70 mg/dL కంటే తక్కువగా ఉన్నట్టయితే రక్తంలో చక్కెర స్థాయి తగ్గువుంటుందిట. ఎక్కువ ఇన్సులిన్ కనుక తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

అసలు షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి..?
- ఎవరైనా ఎక్కువ ఇన్సులిన్ కనుక తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
- అలానే ఆహారాన్ని టైం కి తినకపోతే కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
- ఎక్కువ పని చేస్తే కూడా తగ్గుతాయి.
- ఒత్తిడి , నిద్రలేమి వంటి వాటి వలన కూడా తగ్గుతాయి.
- రుతుక్రమం వలన కూడా షుగర్ లెవెల్స్ తగ్గచ్చు.

షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమి చెయ్యాలి..?
#1. చాక్లెట్:
షుగర్ లెవెల్స్ కనుక డ్రాప్ అయితే చాక్లెట్ ని తీసుకోండి. దీనితో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
#2. పండ్లు:
పండ్లు తీసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి నార్మల్ లెవెల్ కి షుగర్ లెవెల్స్ వస్తాయి.

#3. తేనె:
తేనె ని తీసుకుంటే కూడా వెంటనే షుగర్ లెవెల్స్ నార్మల్ లోకి వస్తాయి.
#4. పండ్ల రసాలు:
షుగర్ లెవెల్స్ కనుక డ్రాప్ అయితే.. ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ని తీసుకుంటే కూడా మంచిదే. ఇలా షుగర్ లెవెల్స్ డ్రాప్ అయినప్పుడు వెంటనే మనం వీటి ద్వారా పెంచుకోవచ్చును. దానితో షుగర్ లెవెల్స్ పైకి వస్తాయి. లేదంటే సఫర్ అవ్వాలి. అలానే డయాబెటిస్ తో బాధ పడేవారు రెగ్యులర్ గా షుగర్ ని చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
















పీహెచ్ స్కేలుపై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. 7 కన్నా తక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు.ఈ క్రమంలోనే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా, కాఫీ, టీల పీహెచ్ విలువలు 5, 6లుగా ఉంటాయి. కాబట్టి కాఫీ, టీలు ఆమ్లత్వాన్ని (యాసిడిక్) కలిగి ఉంటాయి.
పీరియడ్స్ అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక భాగం. మోనో పాజ్ ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య. రుతుక్రమం అనేది గతి తప్పుతుంది. అమ్మాయి రజస్వల అయినప్పుడు మొదలైన రుతుక్రమం ఆగిపోతుంది. దీన్ని మెనోపాజ్ అంటారు. అలాగే పన్నెండు నెలల పాటు నెలసరి రావడం నిలిచిపోతే దాన్నే మెనోపాజ్ గా చెబుతారు. ఈ దశ మొదలయ్యే ముందు మహిళలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి కూడా మహిళలందరిలో ఒకేలా ఉండవు.
మెనోపాజ్ ముందు మహిళల్లో వచ్చే లక్షణాలు, ఏమిటంటే, చిన్న విషయాలకే ఎక్కువగా కోపం, చిరాకు, ఇరిటేషన్ లాంటివి వస్తుంటాయి. జుట్టు రాలటం, మతిమరుపు, నిద్రపట్టకపోవటం, తలనొప్పి, ఒంట్లో వేడి ఆవిర్లు రావటం. చర్మంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. చర్మం సాగినట్టుగా అవుతుంది. ముడుతలు కూడా వస్తాయి. స్కిన్ కాంతి తగ్గిపోతుంది. బరువు పెరగుతారు. ఇలా ఆఖరికి రుతు చక్రాలు పూర్తిగా ఆగిపోతాయి.
ఈ సమయంలో తమకి ఎదురయ్యే సమస్యలను మహిళలు పైకి చెప్పలేరు. ఇక వాటిని భరించలేక తమలో తామే సతమతమవుతూ ఉంటారు. హార్మోన్ల ఉత్పత్తిలో వచ్చే మార్పుల వల్ల మెనోపాజ్ స్టేజ్ లో మహిళలు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతుంటారు. ఈ సమయంలో బరువు పెరగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు లాంటివి వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. వివరాల కోసం ఈ వీడియో చూడండి.


