కరోనా లాక్ డౌన్ కారణం గా ఇంటిపట్టునే ఉండాల్సిన అవసరం ఎక్కువైంది. దీనితో మన ఫుడ్ హాబిట్స్ లో కూడా మార్పులు వచ్చాయి. బోరు కొట్టినప్పుడల్లా తినేస్తూ ఉండడం, ఎక్కువ ఆహరం తీసుకోవడం వలన శరీరం లో అవసరం లేని కొవ్వు పెరిగిపోతోంది. ఈ క్రమం లో ఫిట్ గా ఉండడం కోసం కొన్ని అలవాట్లను మార్చుకోక తప్పదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- మీరు తీసుకునే ఆహరం లో ప్రోటీన్స్ కంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ గా ఉంటున్నాయా..? అయితే వెంటనే ఈ అలవాటు మార్చుకోండి. కార్బోహైడ్రేట్స్ ప్లేస్ లో ప్రోటీన్ ఫుడ్ ను చేర్చుకోండి.
- ఆర్టిఫిషల్ స్వీట్ నర్స్ కలిపిన పదార్ధాలను ఎక్కువ గా తీసుకుంటున్నారా..? ఇది అస్సలు మంచిది కాదు. ఈ అలవాటు మానుకోవాలి.
- చాలా ఫాస్ట్ గా మీ భోజనాన్ని ముగిస్తున్నారా? దీనివలన ఆహరం సరిగ్గా తిన్నట్లు అనిపించదు. మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. అదే నిదానం గా నెమ్మది గా నములుతూ తినడం వలన పదే పదే ఆకలి వేయదు.
- తృణధాన్యాలు కాకుండా శుధ్ధి చేయబడ్డ ధాన్యాలను తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఇవి శరీరం లో కొవ్వుని పెంచుతాయి.
- కొంతమంది చాలా తక్కువ గా మంచినీటిని తాగుతుంటారు. ఇది కూడా మంచి పధ్ధతి కాదు. శరీరం సక్రమం గా పనిచేయలన్నా.. అనవసర వ్యర్ధ పదార్ధాలు శరీరం నుంచి బయటకు పోవాలన్నా సరిపడా నీటిని తాగాలి.