“జొన్న రొట్ట” చేయడానికి ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ చిన్న టెక్నిక్ తో నిమిషంలో చేయండి.!

“జొన్న రొట్ట” చేయడానికి ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ చిన్న టెక్నిక్ తో నిమిషంలో చేయండి.!

by Anudeep

Ads

తెలంగాణ లో జొన్న రొట్టె కు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పక్కర్లేదు. రోడ్ సైడ్ లో చూస్తే సందుకో జొన్న రొట్టె షాపు కనిపిస్తుంది. అన్ని షాపులు రద్దీ గానే ఉంటాయి. అంటే జొన్న రొట్టె కి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో చూడండి. అయితే.. చాలా మంది ఇవి ఇంట్లో కూడా చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ, చపాతీలు, పుల్కాలు వచ్చినంత ఈజీ గా ఈ జొన్న రొట్టెలు కుదరవు.

Video Advertisement

గట్టి గా అయిపోవడం, రొట్టె చేస్తున్న సమయం లోనే విరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రొట్టె కోసం పిండి కలుపుకునే పద్ధతి, చేతితో అద్దడం లో రహస్యమంతా ఉంది. అది కుదిరిన వారు ఈజీ గానే చేసేసుకుంటారు. కానీ.. అది ఎన్ని సార్లు చేసినా కుదరని వారు, జొన్న రొట్టెను చేయాలనుకునే వారు ఈజీ గా ఓ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఈ మెథడ్ ను ఫామిలీ కౌన్సిలర్ రమా రావి గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసారు.

jonna rotti 2

మనం జొన్న రొట్టె ఇంట్లో చేయాలనుకున్నప్పుడు చపాతీ పిండి కలిపినట్లు కలపకూడదు. ముందు గా ఒక గ్లాస్ పిండి తో రొట్టె కాల్చాలని అనుకుంటే.. ఒక గ్లాస్ పిండి తీసుకుని.. అంతే గ్లాస్ తో వాటర్ తీసుకుని స్టవ్ పై మరిగించాలి. నీళ్లు బాగా మరిగాక.. ఈ నీళ్లలోనే జొన్న పిండిని వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తరువాత గరిటతో కానీ స్పూన్ తో కానీ పిండిని కలుపుకోవాలి.

jonna rotti

చపాతీ పిండి కి ఎలా అయితే కలుపుతామో దీనిని కూడా అలాగే కలుపుకుని వేడి చల్లారే లోపు చిన్న చిన్న పిండి ముద్దను తీసుకుని గట్టిగా నొక్కుకుని చపాతీల కర్ర తో వత్తేసుకోవాలి. దానిని వెంటనే కాల్చేసుకుని కూర తో సహా తింటే చాలా టేస్టీ గా ఉంటాయి. కావాలనుకుంటే పిండి కలిపే ముందు నీళ్ళల్లో చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు. మనం రొట్టె తో పాటు వేసుకునే కూరల్లో ఎలాగూ ఉప్పు ఉంటుంది కాబట్టి రొట్టెల్లో ఉప్పు కలపక పోయినా ఇబ్బంది ఉండదు. కావాలనుకున్న వారు కొంచం కలుపుకోవచ్చు. ఈ విధానాన్ని మీరు ఈ కింద వీడియో లో మరోసారి చూడొచ్చు.

Watch Video:


End of Article

You may also like