ఒక వయసు వచ్చిన తరువాత అమ్మాయిలు అందరు పీరియడ్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయం లో అమ్మాయిలకు బ్లీడింగ్ అవుతుండడం సహజమే. అయితే.. అందుకోసమే వారు సానిటరీ పాడ్స్ ని వినియోగిస్తూ ఉంటారు. అయితే సానిటరీ పాడ్స్ అన్నిసార్లు బ్లీడింగ్ ని లీక్ అవ్వకుండా ఆపలేవు. చాలాసార్లు ఇవి లీకేజి ని ఆపలేకపోవడం వలన దుస్తులు కూడా పాడవుతూ ఉంటాయి.

menstrual cup 2

ఇందుకోసమే.. సానిటరీ పాడ్స్ కి బెస్ట్ ఆల్టర్నేటివ్ గా మెన్స్ట్రువల్ కప్ ని తీసుకొచ్చారు. కానీ, చాలా మంది మహిళలకి వీటి గురించి తెలియదు. ఇవి ఎలా ఎంచుకోవాలో.. ఎలా ఉపయోగించాలో తెలియదు. ఈరోజు ఆర్టికల్ లో మెన్స్ట్రువల్ కప్ గురించి పూర్తి గా తెలుసుకుందాం. సాధారణం గా చాలామంది సానిటరీ పాడ్స్ ను వాడడానికి మొగ్గుచూపుతారు. దానికి కారణం మెన్స్ట్రువల్ కప్ ఎలా వాడతారో తెలియకపోవడమే. సానిటరీ పాడ్స్ ని వాడి పడేస్తూ ఉండాలి. దానివలన పర్యావరణానికి కలిగే నష్టం కూడా ఎక్కువే.

menstrual cup 1

సానిటరీ పాడ్స్ లో ఉపయోగించే రసాయనాలు కూడా ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. దానికంటే మెన్స్ట్రువల్ కప్స్ ని వాడడం ఉత్తమం. వీటిల్లో చిన్నవి, పెద్దవి రెండు రకాలు ఉంటాయి. మీడియం, XL సైజు లలో కూడా లభిస్తున్నాయి. వయసు ని పరిగణనలోకి తీసుకుని ఈ కప్స్ ని ఎంచుకోవాలి. 30 సంవత్సరాల లోపు వయసు ఉండి.. మీకు నాచురల్ డెలివరీ కాకపొతే మీరు స్మాల్ లేదా, మీడియం సైజు కప్ ని ఎంచుకోవడం ఉత్తమం.

menstrual cup 3

ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవారు, నాచురల్ డెలివరీ అయిన వారు, 30 కంటే ఎక్కువ వయసు ఉన్నవారికి పెద్ద సైజు కప్ అవసరం అవుతుంది. గర్భాశయం ముఖద్వారానికి ఉన్న పొడవు ని కూడా పరిగణనలోకి తీసుకుని కప్ ను ఎంచుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటె ఒకసారి గైనకాలజిస్ట్ ను సంప్రదించి ఎంచుకోవడం మంచిది.

ఎలా ఉపయోగించాలి..? 

menstrual cup 4

  • ఈ కప్ ను ఉపయోగించడం తెలిస్తే చాలా సౌకర్యవంతం గా ఉంటుంది. ఈ కప్ ని మొదటిసారి పెట్టుకునే సమయం లో ఏమైనా ఇబ్బంది ఎదురైతే లుబ్రికంట్ ను రాయడం మంచిది. ఈ కప్ ను పెట్టుకునే ముందు చేతులను శుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దు.
  • అలాగే.. పెట్టుకునే సమయం లో ఏమైనా ఇబ్బంది ఎదురైతే కప్ కి ముందు భాగం లో ఏమైనా లుబ్రికంట్ ను రాయండి.
  • కప్ కి కింద ఉండే కాడ లాంటి భాగాన్ని కొంచం బయటకు ఉండేలా ఉంచుకుంటే.. తీసేటప్పుడు ఈజీ గా తీయవచ్చు.
  • ఒకసారి పెట్టుకున్నాక.. దానిని గుండ్రం గా తిప్పితే అది సరిగ్గా సెట్ అవుతుంది. ఎటువంటి లీకేజి సమస్య ఉండదు.

menstrual cup 5

ఇవి సరిగ్గా సెట్ చేసుకుంటే అసలు మీకు పీరియడ్ వచ్చినట్లే ఉండదు. బ్లీడింగ్ ని బట్టి వీటిని మార్చాల్సి ఉంటుంది. కొంతమందికి రెండుగంటలకు, కొంతమందికి నాలుగుగంటలకు ఒకసారి మార్చాల్సి వస్తూ ఉంటుంది. నార్మల్ బ్లీడింగ్ అవుతున్నవారు 12 గంటలకు ఒకసారి ఈ కప్ ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కొంచం ఎక్కువ బ్లీడింగ్ అవుతున్న వారు 6 గంటలకు ఒకసారి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కొనుక్కున్న క్వాలిటీ ని బట్టి ఈ కప్ లు 6 నెలల నుంచి కనీసం 10 ఏళ్ల వరకు వస్తాయి.

menstrual cup 6

అయితే.. వీటిని శుభ్రపరిచి పొడిగా ఉన్నపుడే వినియోగించాలి. వీటి ఖరీదు నాణ్యత ని బట్టి రెండు వందల రూపాయల నుంచి మొదలవుతాయి. ఒకటి రెండు కప్ లను దగ్గర ఉంచుకుంటే కొన్నేళ్ల పాటు పీరియడ్స్ కి సంబంధించిన ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ కప్స్ వాడడం వలన, లీకేజి, దుర్వాసన వంటి సమస్యలు ఎదురుకావు. అలాగే ఎలాంటి కఠినమైన పనులనైనా.. ఇబ్బంది లేకుండా చేయవచ్చు.