ఎంతో మందికి ఆదర్శం అయిన వ్యక్తుల్లో సుధా మూర్తి ఒకరు. సుధా మూర్తి మంచి రచయిత కూడా అనే విషయం మనందరికీ తెలుసు. మహాశ్వేత, డాలర్ బహు, ద బర్డ్ విత్ గోల్డెన్ వింగ్స్, వైస్ అదర్ వైస్, ద మదర్ ఐ నెవర్ న్యూ తో పాటు ఇంకా ఎన్నో పుస్తకాలను రచించారు సుధా మూర్తి. సుధా మూర్తి రచించిన త్రీ థౌజండ్ స్టిచెస్ అనే పుస్తకం 2017 లో విడుదలైంది.
ఈ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేశారు సుధా మూర్తి. ఈ బుక్ లో తను ఎయిర్ పోర్ట్ లో ఎదుర్కొన్న ఒక సంఘటన గురించి చెప్పారు. ఒకసారి సుధా మూర్తి లండన్ నుండి బెంగళూరు వెళ్లటానికి బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నారు. లండన్ లోని హిత్రూ ఎయిర్ పోర్ట్ లో ఈ సంఘటన జరిగింది. సుధా మూర్తి ఇండో వెస్ట్రన్ స్టైల్ లో డ్రెస్ అయ్యి ఉన్నారు.

బోర్డింగ్ పాస్ తీసుకొని ఏరోప్లేన్ ఎక్కడానికి లైన్ లో నిలబడి ఉన్నప్పుడు సుధా మూర్తి ముందు ఒక ఇండియన్ ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా మోడ్రన్ గా రెడీ అయ్యి ఉన్నారు. సుధా మూర్తి వెనకాల కూడా తన ముందున్న ఆవిడ ఫ్రెండ్ ఉన్నారు. సుధా మూర్తి ముందున్నావిడ సుధా మూర్తిని చూసి బోర్డింగ్ పాస్ చూపించమని అడిగారు. అందుకు సుధా మూర్తి ఎందుకు అని అడగగా, “మీరు ఎక్కాల్సిన క్లాస్ ఇది కాదు. ఎకానమీ క్లాస్. ఇది బిజినెస్ క్లాస్” అని అన్నారు ఆ మహిళ.

అందుకు సుధా మూర్తి “బిజినెస్ క్లాస్ కి, ఎకానమీ క్లాస్ కి తేడా ఏంటి?” అని తెలియనట్టుగా అడిగారు. దీనికి ముందు ఉన్న ఆవిడ బిజినెస్ క్లాస్ అంటే ఏంటో చెప్పి సుధా మూర్తి ని ఎకానమీ క్లాస్ లైన్ లో నిల్చోమని చెప్పారు. కానీ సుధా మూర్తి ఆవిడ మాటలు పట్టించుకోకపోవడంతో ,ఆ ముందున్న ఆవిడ సుధా మూర్తి వెనక ఉన్న ఆవిడతో వీళ్ళు ఇంతే ఎంత చెప్పినా వినరు అని అన్నారు. బోర్డింగ్ పాస్ చూపించే సమయానికి ఆ ఇద్దరు మహిళలు అక్కడే నుంచుని అధికారులు ఏమంటారో అని ఎదురుచూడసాగారు.

కానీ సుధా మూర్తి తన బోర్డింగ్ పాస్ చూపించడంతో వాళ్ళిద్దరూ షాకయ్యారు. తర్వాత లోపలికి వెళ్ళిన సుధామూర్తి ఆ ఇద్దరు మహిళలతో నేను ఊరి మహిళ అయ్యి ఉండవచ్చు కానీ మీరు మాత్రం క్లాస్ వాళ్ళు కాదు. ఒక మనిషికి క్లాస్ అనేది డబ్బులను బట్టి రాదు. చేసే మంచి పనులతో వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఇలా సుధా మూర్తి ఒక్కరికే కాదు. మనిషి కనిపించే విధానాన్ని చూసి అంచనా వేయడం అనేది మనం కూడా చూస్తూనే ఉంటాం.మనమందరం ఈ సమస్యను ఎదుర్కొంటున్నా కూడా మనలో చాలా మంది దీనిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కొంత మంది మాత్రమే వాళ్ళకి తిరిగి ఎదురు చెప్పగలుగుతారు.



























బాబూరావు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత ఏదైనా సాధించాలని హైదరాబాద్‌కు వచ్చారు. అయితే నగరానికి వచ్చిన తొలి రోజుల్లో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై కూడా పడుకున్నాడు. మొదట్లో బట్టల షాప్ లో పనిచేశారు. కొన్ని చిన్న ఉద్యోగాలను చేశాడు. హోటల్ లో పనిచేస్తే కనీసం తినడానికి ఆహారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో కేఫ్‌లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అలా కేఫ్‌లో క్లీనర్‌గా పనిచేయం ప్రారంభించిన బాబూరావు వెయిటర్‌గా ప్రమోషన్ పొందాడు. ఆ తరువాత బిస్కెట్లు, టీ తయారు చేశాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ 1978 నాటికి బాబురావు కేఫ్‌ను నడిపే స్థితి వచ్చాడు. కేఫ్ నడిపే కాంట్రాక్ట్ పై సంతకం చేశారు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ, బాబూరావు కేఫ్ యాజమాన్యానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కష్టపడుతూ 1993 సంవత్సరం నాటికి కేఫ్‌ను సొంతం చేసుకోవడానికి అవసరం అయిన డబ్బును సంపాదించాడు. అప్పటి నుండి బాబూరావు ఓనర్ గా మారి, కేఫ్ ను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు. మూడు అవుట్లెట్ల యజమానిగా మారిన బాబూ రావు తన మూలాలను మర్చిపోలేదు.
ఈ కేఫ్ ద్వారా పేదవారికి సాయం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ షాపులో మిగిలిన బిస్కెట్లను, బ్రెడ్లను పేద వారికి పంచుతుంటారు. ఆయన తండ్రి కోరిక మేరకు 25 ఏళ్ల నుంచి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిలోఫర్ హాస్పిటల్ మరియు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి చుట్టూ ఉన్న పేషంట్లకు, పేదవారికి ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఐదు వందల మందికి అల్పాహారం, మూడు వందల మందికి భోజనం అందిస్తున్నారు.

