పెళ్లి అనేది ఒక వ్యక్తి పర్సనల్ ఛాయిస్. అందరికీ ఒక పర్టిక్యులర్ వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనిపించదు. కొంత మందికి పెళ్ళికంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి. కెరీర్ లో ఒక స్టేజ్ కి వచ్చి, వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు.
అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.

# ఈ ఏజ్ గ్రూప్ లో జీవితం పై పూర్తి స్పష్టత వస్తుంది. వీలైనంత వరకు కెరియర్ పై ఫోకస్ చేసి డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు. దాంతో వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టడం కష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

# ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గిపోతుంది. దాంతో వైవాహిక జీవితం చాలా డల్ గా సాగుతుంది అని నిపుణులు అంటున్నారు.

# వేరే విషయాల మీదకి, అంటే ఉద్యోగం, డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోవడంతో ఒకరిపై ఒకరికి శ్రద్ధ పెట్టే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వేరే రిలేషన్ షిప్ వైపు ఫోకస్ వెళ్లే అవకాశాలు ఉంటాయట.

# సమాజం నుండి వచ్చే ఒత్తిడి గురించి మనందరికీ తెలుసు. ఎవరినైనా సరే తొందరగా జడ్జ్ చేయడంలో చాలా మంది ముందుంటారు. దాంతో ఒకవేళ మైండ్ కొంచెం సున్నితంగా ఉన్న వాళ్ళు అయితే సమాజం నుండి వచ్చే ఒత్తిడిని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. దాని వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి.

# భవిష్యత్తు ఎలా ఉండాలి ? జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలి ? అనే విషయంలో పడి ప్రస్తుతం ఉన్న మూమెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి.

ఏదేమైనా సరే ఇందాక పైన చెప్పినట్టుగా పెళ్లి అనేది ఒక వ్యక్తి పర్సనల్ ఛాయిస్. ఒక వ్యక్తికి తన జీవితంలో ఎప్పుడు ఏం చేయాలి అనే విషయంపై క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు వారి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఎవరిని కూడా జడ్జ్ చేయలేము.

#1 భార్యలు తమ భర్త సంపాదించే డబ్బు కన్నా, తమకి సమయం ఇవ్వాలని కోరుకుంటారట. రోజు భర్త తమతో కొంచెం సమయం గడపాలని భార్యలు ఆశిస్తారు. కాబట్టి భర్త బిజీగా ఉన్నప్పటికి ప్రతి రోజు భార్య కోసం కొంత సమయం కేటాయించాలని చెబుతున్నారు.
#2 భర్తలు తమ భార్యాలకి ఆర్ధికంగా స్వేచ్చను ఇవ్వకపోవడం కూడా ఒక సమస్యే. కొందరు భర్తలు తమ భార్య ఉద్యోగం చేస్తున్నప్పటికి ఆమె శాలరీ రాగానే మొత్తం తీసుకొని వాడుకోవడం చేస్తుంటారు. జాబ్ చేసేవారు అడిగి తీసుకో గలుగుతారు. కానీ ఇంట్లో ఉండే వారు తమకు కావలసిన డబ్బుని ఆడగలేక ఇబ్బంది పడుతుంటారు.
#3 కుటుంబానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే విషయంలో భార్యతో చర్చించకపోవడం వాళ్ళ భార్యలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయలలో వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.
#4 సాధారణంగా భర్తలు భార్య తల్లిదండ్రుల పట్ల తమకు ఎలాంటి బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. వారికి కుమారులు ఉంటే వారి బాధ్యతను ఆ కుమారులే తీసుకుంటారు. కానీ కుమార్తె మాత్రమే ఉన్నట్లయితే భార్యకు తన పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత, ప్రేమ ఉంటుంది. వారి కోసం బాధపడుతుంటుంది. కాబట్టి మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకుని అందరిని వదిలి మీతో బ్రతకడానికి వచ్చిన భార్యని బాధపెట్టకుండా సంతోషంగా చూసుకుంటే ఆ ఇల్లు ఆనందంగా మారుతుంది.
సోనాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికి కేతన్ రజ్వీర్ ధైర్యం కోల్పోకుండా, భార్యను ఇంట్లో ఒంటరిగా ఉంచకుండా తనతోనే తీసుకెళ్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. వీరిని చూసినవారు అడిగినపుడు, అతను తన భార్య ఆరోగ్య పరిస్థితిని, సమస్యను చెబుతుంటాడు. కేతన్ కు తన భార్యపై ఉన్న ప్రేమను చూసిన వారు కంటతడి పెట్టకుండా ఉండలేరు.
కేతన్, సోనాల్ 2007లో వివాహం చేసుకున్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. సోనాల్ విపరీతమైన చెస్ట్ పెయిన్ రావడంతో కేతన్ ఆమెను హాస్పటల్ కి తీసుకొని వెళ్ళాడు. అక్కడ సమస్య తెలుసుకోవడం కోసం పరీక్షలు చేయగా సోనమ్‌కు క్యాన్సర్ వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుండి ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇంట్లో సోనమ్ ఒంటరిగా ఉన్న సమయంలో ప్రతికూల ఆలోచనలతో బాధ పడుతుండేది. దాంతో అది ఆమె ఆరోగ్యం పై ప్రభావం చూపించేది. దాంతో కేతన్ ఆమెను తనతో పాటు బైక్‌పై తీసుకెళ్తున్నాడు.






















