ఒక ప్రశ్నకి ప్రపంచం మొత్తంలో ఎక్కడినుంచైనా సమాధానం దొరికే చోటు కోరా. ఇందులో ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు పోస్ట్ చేస్తే, దానికి ఎంతో మంది తాము ఏం అనుకుంటున్నాం అనేది వ్యక్తపరుస్తారు.
అలా కొంతకాలం క్రితం ఒకరు “మీ పార్టనర్ పై మీకు ఉన్న ఆకర్షణ మీలో ఏ విధంగా మార్పుని తెచ్చింది?” అనే ప్రశ్నని కోరా లో పోస్ట్ చేశారు. అందుకు శ్వేత గార్గ్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
“మాది లవ్ మ్యారేజ్ కాదు. భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగిన అరేంజ్డ్ మ్యారేజ్. నాకు అప్పుడు 19 సంవత్సరాలు. నాకు యాక్టర్ అవ్వాలనే కల ఉండేది. అంత తొందరగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. అందుకే వద్దని చెప్పాను. జూన్ 2013 లో మా అమ్మకి క్యాన్సర్ ఉందని తెలిసింది. మా అమ్మ నేను తనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
నా భర్తకి నాకు పది సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉండడం నాకు అంత బాగా అనిపించలేదు. ఏమవుతుందో? ఎలా ఉంటుందో? అతను నాకంటే చాలా పెద్దవాడు. నేను అసలు ఎలా అడ్జస్ట్ అవుతానో? ఇలాంటి చాలా ప్రశ్నలు నా మెదడులో ఉన్నాయి. నాకు ఇంక వేరే ఆప్షన్ లేదు. డిసెంబర్ 2013 లో మేం పెళ్లి చేసుకున్నాం. అలా మా ఇద్దరి జర్నీ మొదలైంది.
పెళ్లవ్వక ముందు నేను ఇంట్రవర్ట్ ని. నా యాక్టింగ్ మోడలింగ్ అనే డ్రీమ్స్ వల్ల ఇంట్లో గొడవలు అవడంతో నేను మా తల్లిదండ్రులతో అలాగే బ్రదర్ తో మాట్లాడే దాన్ని కాదు. కానీ నా పెళ్లి అయిన నెల తర్వాత వాళ్లు బాగా గుర్తు వచ్చే వాళ్ళు. అప్పుడే నాకు కుటుంబం ఎంత ముఖ్యమో అనే విషయం అర్థం అయ్యింది. ప్రతి సండే నా భర్త నన్ను నా కుటుంబం దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు. నా తల్లిదండ్రులను కూడా తన తల్లిదండ్రులలానే ట్రీట్ చేసేవారు.
నన్ను ఎప్పుడూ ఇంటి పనులు చేయమని బలవంతం చేయలేదు. రోజులు గడిచేకొద్దీ నేను ఇంకా మంచి వ్యక్తిని అవుతున్నాను. నా భర్తని ఇష్టపడటం మొదలు పెట్టాను. కానీ నా కెరీర్ విషయంలో మాత్రం హ్యాపీగా లేను. నాకు ఏదో ఒకటి సాధించాలి అని ఉండేది. ఇప్పుడైతే నా కలలు మారాయి. సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వాలి అని ఉండేది. నాకు నా భర్త పూర్తి సపోర్ట్ ఇచ్చారు. 2014 సెప్టెంబర్ లో నాకు అబ్బాయి పుట్టాడు.
నాకు ఎప్పుడూ యాక్టర్ అవ్వాలని కల ఉండేది అందుకే లుక్స్ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. కానీ ప్రెగ్నెన్సీ తర్వాత నాకు పింపుల్స్ వచ్చాయి. స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి. జుట్టు రాలిపోవడం మొదలైంది. అప్పుడు కూడా నా భర్త నాతో మామూలుగానే ప్రవర్తించేవారు. లుక్స్ గురించి అంత పట్టించుకోవద్దు అని చెప్పేవారు. సంతోషంగా ఉండమని అనేవారు.
ఇప్పుడు నాకు నా భర్త ఇంకా నా కొడుకు జీవితం అయ్యారు. నేను నా భర్తని ఎంతో గౌరవిస్తాను. మేమిద్దరం మా కుటుంబానికి ఒక ఐడియల్ కపుల్. ఒక్కొక్కసారి మనకు ఏది మంచిదో మనకి తెలియదు. కానీ మన తల్లిదండ్రులకు తెలుసు. ఇవాళ నా భర్తని నాకు లైఫ్ పార్టనర్ గా ఎంచుకున్నందుకు నా తల్లిదండ్రులకు నేను థాంక్స్ చెప్తున్నాను. నన్ను హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి నా భర్త మాత్రమే” అని చెప్పారు.
image credits: quora/shweta-garg