సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటారు. ఎక్కడ ఏ అవసరమైనా ముందుకు వచ్చి తన వంతు సహాయం అందిస్తారు. ఎంతో మందికి వైద్య సహాయం అందించారు, అలాగే వెయ్యికి పైగా ఆపరేషన్స్ చేయించారు. అంతే కాకుండా ఊర్లని దత్తత తీసుకుని అక్కడ పరిసరాలను బాగు చేయించారు. ఇవన్నీ మాత్రమే కాకుండా వైద్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు.
కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయం చేశారు మహేష్ బాబు. అలా కొన్ని వేల మంది ఆపరేషన్ కి సహాయం చేశారు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు ఇలా ఎవరికైనా చికిత్స అవసరం అయినప్పుడు, అందులోనూ ముఖ్యంగా గుండెకు సంబంధించిన చికిత్స అవసరం అయినప్పుడు సహాయం చేయడానికి వెనకాల ఒక కారణం ఉందట.
ఈ విషయంపై ఒక సందర్భంలో మహేష్ బాబు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. “నా కొడుకు గౌతమ్ ప్రీమెచ్యూర్ బేబీ. డాక్టర్లు గౌతమ్ కండీషన్ క్రిటికల్ గా ఉంది అని చెప్పారు. నాకు అప్పుడు చాలా టెన్షన్ గా అనిపించింది. అయితే ఆ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఖర్చు నేను భరించగలుగుతాను.
కానీ ఎంతో మంది ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులను తగ్గించడానికి మేము మా వంతు కృషి చేస్తాం” అని అన్నారు మహేష్ బాబు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రాజమౌళితో ఒక సినిమా, అలాగే త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నారు.