మహాభారతం లో ఒక్కో పాత్ర కి ఒక్కో విశిష్టత ఉంది. పాండవులను వివాహమాడిన ద్రౌపది గురించి పరిచయం అవసరం లేదు. కానీ ఆమె గురించిన చాలా విషయాలు మనకు తెలియవు.
అవేంటో.. ఆమె తన ఐదుగురు భర్తలతోను ఎలా కాపురం చేసేదో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో ఈరోజు తెలుసుకుందాం.

అర్జునుడు స్వయంవరం లో ద్రౌపదిని గెలుస్తాడన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు.. తాను గెలిచిన బహుమానాన్ని చూడాలని కోరగా.. కుంతి పరధ్యానం లో ఉండి తల తిప్పకుండానే ఐదుగురిని పంచుకోమని చెబుతుంది. దీనితో.. తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురు ద్రౌపది ని పెళ్లాడుతారు. ఆ తరువాత కుంతి బాధపడుతుంది. జరిగింది జరిగిపోయినా.. ద్రౌపది మాత్రం తన భర్తలతో సఖ్యత గా మెలిగేది.

వారి మధ్య గొడవలు రాకుండా ఉండేది. ఇందుకోసం పాండవులు కూడా ఓ నియమం పెట్టుకున్నారు. ద్రౌపది కొన్ని నెలలపాటు ఒక్కొక్కరి దగ్గరా ఉంటూ వచ్చేది. ఆ సమయం లో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్లకూడదని.. అలా వెళితే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారు. ఓసారి.. ఓ వ్యక్తి అర్జునుడు వద్దకు వచ్చి కొందరు తన పశువుల్ని దొంగిలించారని తనని రక్షించాలని కోరతాడు. అయితే.. అర్జునుని విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది. ఆ సమయం లో ద్రౌపది ధర్మ రాజు వద్ద ఉంటోంది.

నియమం తప్పుతుందని తెలిసినా.. అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్లి విల్లు తీసుకుని సమస్యను పరిష్కరించి ఆ తరువాత అరణ్యవాసం చేస్తాడు. అందుకే.. ద్రౌపది కి ఐదుగురు భర్తలున్నా ఏనాడు వారి మధ్య గొడవలు రాలేదు. ద్రౌపది గురించి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆమె అందరిలా పసిపిల్లలా తల్లి కడుపున పుట్టలేదు. యుక్తవయసు ఉన్న స్త్రీ గా అగ్ని నుంచి పుట్టింది. అందుకే ఆమెని యజ్ఞసేని అని పిలుస్తారట.

ఆమె శ్రీకృష్ణుడిని తప్ప.. తన భర్తలతో సహా ఎవరిని అంతగా నమ్మేది కాదట. ఎందుకంటే.. శ్రీ కృష్ణుడు ఆమెను వస్త్రాపహరణం నుంచి చీరలు ఇచ్చి రక్షిస్తాడు. అప్పటినుంచి ఆమె శ్రీకృష్ణుడిని సోదరుడిగా భావించి ఆరాధిస్తుంది. విరాట రాజు కొలువులో కీచకుల వలన, నిండుసభలో కౌరవులు కూడా ఆమెను అపహాస్యం చేయడం తో ఆమెకు తమ భర్తలపై నమ్మకం పోయిందట.

కానీ.. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్ళేటపుడు ఆమె కన్య గానే వెళ్ళేది. అదెలా అంటే.. ఆమెకో వరం ఉంది. ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లే సమయం లో ఆమె అగ్ని లోంచి నడిచేది. ఆ తరువాత తిరిగి కన్య గా అయ్యాక.. మరో భర్త వద్దకు వెళ్ళేది. ద్రౌపది తన ఇంట్లో సామాన్లను ఎప్పుడు నిండుగా ఉంచుకునేదట. ఎవరు వచ్చినా వండిపెట్టి కడుపునిండా భోజనం పెట్టేది.


మేషం:
వృషభం :
మిథున రాశి :
కర్కాటకం:
సింహ రాశి :
కన్య:
తుల:
వృశ్చిక రాశి:
ధనుస్సు:
కుంభం:
మీనం :
Also Read: 






చేయవలసిన పనులు:
చేయకూడని పనులు:
Also Read:
సాధారణంగా ఉగాది, దీపావళి వంటి పండుగల రోజున నూనెతో స్నానం చేయడం అనేది హిందూవులకి ఆచారంగా వస్తోంది. అయితే నూనె స్నానం ఆచరించడం వల్ల ఉపయోగం ఏమిటో? నూనె స్నానం ఉగాది రోజున ఎందుకు చేస్తారో ఇప్పుడు చూద్దాం..
ప్రతి రోజూ స్నానం చేస్తుంటాం. కానీ ఉగాది రోజున ప్రత్యేకంగా నూనెతో స్నానం చేస్తారు. నూనె చర్మానికి రాసుకుని స్నానం చేసినట్లయితే వారిలో ఆధ్యాత్మిక స్పృహ కలుగుతుందని చెప్తారు. అంతే కాకుండా తేజస్సు పెరుగుతుంది.
ప్రతికూలతను పోగొడుతుంది. నూనె స్నానం చేయడం వల్ల ఆ వ్యక్తి శరీరంలోని నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. తద్వారా సానుకూల అనుభూతిని కలుగుతుంది. నూనె రాసుకున్న తరువాత వేడి నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం పై రక్షణ పొర ఏర్పడుతుందంట.
నూనె స్నానం సమయంలో, శరీరంలోకి దైవిక ప్రవాహం ఆకర్షించబడుతుందని, శరీరంలో ఆ తరంగాలు ఉత్పన్నమవుతాయని నమ్ముతారు. నూనె స్నానం వల్ల జీవశక్తి శరీరంలో పెరుగుతుంది. దాంతో మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు.
ఎందుకు ఉపవాసాలు ఉంటారు..
ఈ మాసంలో భక్తులు తమలో ఉన్న చెడు, ద్వేషాన్ని పోగొట్టుకుందుకు ప్రయత్నిస్తారు. ఖురాన్ పఠనం, అల్లా ఆరాధన, నమాజ్, చేస్తారు.ఈ నెలలో మంచి కార్యాలు, దానాలు చేసి పుణ్యం పొందేందుకు పోటీ పడతారు. తమ కోరికలకు కళ్లెం వేసి ఆత్మను శుభ్రం చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏడాది అంతా చేసిన పాపాలను అల్లా క్షమిస్తాడని నమ్ముతారు.
ఎప్పుడు ప్రారంభమయ్యాయి..
Also Read: 










బ్రహ్మ దేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయ సమయంలో జగత్తును సృష్టించాడని చెప్తారు. అనగా కాలగణన, నక్షత్ర, గ్రహ, రుతు, మాస, వర్షాధికులను విధాత ఆ రోజు నుండి వర్తింపజేస్తాడని విశ్వసిస్తారు. వసంత రుతువు ఆనాటి నుండే మొదలు అవుతుంది. అందువల్ల కొత్త జీవితానికి ప్రారంభంగా ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది మరియు యుగాది అనే 2 పదాలు వాడుతుంటారు. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం, ఆది అనగా మొదలు అని అర్దం. నక్షత్ర గమనానికి ఆది అనగా సృష్టి ప్రారంభం అయిన రోజే ఉగాది.
తెలుుగు ప్రజలు మాత్రమే కాకుండా ఈ పండుగను మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళ ప్రజలు ‘పుత్తాండు’ పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, మలయాళీలు ‘విషు’ గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు. ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ రోజున అందరు కొత్త ఉత్సాహంతో, నూతన ఆశలతో తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. ఉగాది నాడు చేసే ప్రసాదాలలో ఉగాది పచ్చడి ముఖ్యమైనది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత:
Also Read: 

