భారత దేశంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి వ్యక్తుల స్వభావాలను, లక్షణాలను చెప్పవచ్చు. అలాగే.. వారి జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను కూడా ఊహించవచ్చు. అయితే గ్రహాల అనుకూలతని బట్టి మనకి జరుగుతున్న సమయం మంచిదా కాదా అన్న సంగతి కూడా తెలుస్తుంది.
ఒక్కోసారి మనకి సమయం అనుకూలించదు. చెడ్డ రోజులని ఎదుర్కోవాల్సి వస్తోంది. అటువంటి రోజులలో ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారు? అనే విషయాన్నీ ఇప్పుడు తెలుసుకోండి.
మేష రాశి:
ఈ సమయంలో మేషరాశి వారు చేసే గొప్ప పని ఏమిటంటే, తమను తాము బిజీగా ఉంచుకోవడం. వారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇది వారికి హాని కలిగించే విషయాల నుండి దూరంగా ఉంచుతుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారు ఇటువంటి గడ్డు రోజులలో తమ చుట్టూ వ్యక్తులతో తమ భావాలను పంచుకోవాలని భావిస్తారు. వృషభరాశి వారి జీవితంలో విషయాలు సరిగ్గా లేనప్పుడు వారి స్నేహితులు & కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చూసుకుంటారు.
మిధున రాశి:
మిధున రాశి వారు తమ ఇబ్బందులను ఇతరులకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా వీరిని అడిగినా.. పైకి నవ్వుతు బాగున్నామని అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. వారు తమ భావోద్వేగాలను దాచడాన్ని ఉత్తమంగా విశ్వసిస్తారు. తమ సమస్యలతో తామే పోరాడితే అన్ని సమస్యలు తీరుతాయని వారు భావిస్తారు.
కర్కాటక రాశి:
వీరు కూడా మిధున రాశి వారి లానే తమ ఇబ్బందులను బయటకు చెప్పరు. ఎన్ని సమస్యలు వచ్చినా.. తమలో తామే దాచుకుని కుమిలిపోతుంటారు తప్ప ఇతరులకు చెప్పుకుని స్వాంతన పొందాలని అనుకోరు.
సింహ రాశి:
సింహరాశి వారు ప్రతి చిన్న విషయానికి కోపాన్ని ప్రదర్శిస్తూ చెబుతూ ఉంటారు. చివరకు వారు టివి చూసినా.. అందులో చెప్పే విషయాలను కూడా కోపంగా చెప్పినట్లు చెబుతూ ఉంటారు. వారు బాధపడినప్పుడు కూడా.. ఆ బాధని కోపం రూపంలోనే వ్యక్తపరుస్తారు.
కన్య రాశి:
వీరు గడ్డు రోజులు వచ్చినప్పుడు వారి ప్లాన్స్ ను కాన్సల్ చేసుకోవాలని అనుకుంటారు. సమస్య పట్ల మౌనం వహించడం కానీ.. లేదా బాధని మర్చిపోవడానికి నిద్రపోవడం కానీ చేస్తుంటారు.
తులా రాశి:
తులా రాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. కానీ వారు ఎప్పుడూ తమ భావోద్వేగాలను ప్రదర్శించరు. మీరు ఊహించినప్పటికీ; అప్పుడు వారు తమకు ఎటువంటి సమస్యలు లేనట్లుగా ప్రవర్తిస్తారు లేదా వారి స్వంతంగా పరిష్కరించుకుంటారు.
వృశ్చిక రాశి:
వీరు తమ భావోద్వేగాలను లోపల ఉంచుకోలేరు. వారి చెడ్డ రోజులలో, వారు గంభీరంగా ఉంటారు మరియు ఈ క్షణంలో వారు ఎంత విచారంగా & నిరాశకు గురవుతున్నారో ఇతరులకు తెలియజేస్తారు. వారికి సహాయం కావాలి కానీ వారి కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి అన్న సంగతి మాత్రం వారికి తెలియదు.
ధనుస్సు రాశి:
వీరు కూడా మేష రాశి వారిలా తమ సమస్యని ఎదుర్కోవడం ద్వారానే ప్రశాంతత లభిస్తుందని భావిస్తారు. టీవీ & యూట్యూబ్ వీడియోలను చూడటం… లేదా వారు తమ స్నేహితులతో గడపడం లాంటివి చేస్తుంటారు. అంతే తప్ప తమ బాధ గురించి మాత్రం ఎవరికీ చెప్పుకోరు.
మకర రాశి:
మకర రాశి వారు వారి గడ్డు సమయాల్లో నిశ్శబ్దాన్ని ప్రశాంతతని కోరుకుంటారు. వారి మానసిక స్థితి సరిగ్గా ఉంటే, వారు వచ్చి మాట్లాడతారు. కానీ చాలా వరకు వారు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడతారు.
కుంభ రాశి:
కుంభరాశి వారు భావోద్వేగాలను పంచుకోవడం మంచిది కాదు అని భావిస్తారు. ఎందుకంటే వారు బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. భావోద్వేగాలను పంచుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని వారు భావిస్తారు. సహోద్యోగులతో కూడా తమ ఇబ్బందులను చర్చించకుండా మౌనంగా ఉంటారు.
మీన రాశి:
మీన రాశి వారికి ఇది అంత సులభం కాదు. వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు.. వారి పరిస్థితి నుంచి వారు బయటపడి తిరిగి మాములు అవ్వడానికి వారు కొంత సమయం తీసుకుంటారు.