కోస్తా ఆంధ్రలోని “ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి గురించి మనకి తెలియని చరిత్ర ఏంటంటే..?

కోస్తా ఆంధ్రలోని “ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి గురించి మనకి తెలియని చరిత్ర ఏంటంటే..?

by Anudeep

Ads

కోస్తా ఆంధ్రాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు చాలావున్నాయి అని చెప్పవచ్చు. ఒక్కొక పుణ్యక్షేత్రానికి ఒక్కొ విదమైన స్థలపురాణం ఉంటుంది. మన నామాల స్వామి ఏడుకొండల వేంకటేశుని తరువాత అంతే ప్రాముఖ్యత పొందిన వెంకన్న స్వామి దేవాలయం ఎక్కడా వుంది అంటే..

Video Advertisement

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల. ఈ పుణ్యాక్షేత్రానికి అనేక మంది భక్తులు తరలివచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఈ ద్వారకాతిరుమలనే చిన్న తిరుపతి అనికూడా అంటారు.

Venkateswara swami temple in dwaraka thirumala

ఈ క్షేత్రానికి కూడా ఒక స్థలపురాణం వుంది అని దేవాలయ పురోవితులు చెబుతూవుంటారు. ప్రతి ఆలయంలో మూల విరాట్ గా ఒక్కరే వుంటారు. కానీ ఈ ద్వారకాతిరుమల దేవాలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ గర్భగుడిలో ఇద్దరు మూల విరాట్ లు వుంటారు. ఇదియే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత.

ఇందుకు కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాము. పూర్వం రోజులలో ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేసి వెంకటేశ్వరస్వామిని ప్రసన్నం చేసుకున్నారు. మహర్షి తపస్సుకు మెచ్చి స్వామివారు ఏ వరం కావాలో కోరుకోమని అడగగా జీవితాంతం నీ పాదసేవ చాలు అని అడిగారుట. ఆయన కోరికమేరకు స్వామివారు అక్కడే స్వయంభూగా వెలిశారు.

మహర్షి చాల కాలంగా తపస్సు చేయటం వలన ఆయన చుట్టూ పుట్ట ఏర్పడడంతో స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయి ఉదరం నుంచి దర్శనం ఇచ్చేవారట. ఇలా ఉండటం వలన స్వామివారిని పూజంచేందుకు భక్తులు ఇబ్బంది పడేవారట .

ఇప్పటికీ ఇక్కడ ఉన్న మూలవిరాట్ కి అభిషేకం చేయరు. ఎందుకంటే మహర్షి తపస్సు చేసిన పుట్ట ఇప్పుడు కూడా గర్భగుడిలో అదేవిధంగా ఉంది. అభిషేకం చేయడం వల్ల పుట్ట కరిగిపోయే ప్రమాదం ఉందని పండితులు వెల్లడిస్తున్నారు.

అన్నిటికన్నా ముఖ్యమైన పాద సేవ ఎలా చేయాలనే విషయంపై స్వామి వారిని ఋషులు వేడుకోగా, ఇప్పుడు ఉన్న మూలవిరాట్ కి ఇంకొక మూలవిరాట్ ను జత చేయమని స్వామి వారు చెప్పారట. దానితో ఋషులు పెద్ద తిరుపతి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు జరిపించి విగ్రహాన్ని స్వయంభూగా వెలిసిన స్వామివారికి వెనుక ఒక పెద్ద మూలవిరాట్ ను పాదసేవ చేసే విధంగా స్థాపించారు. అందుచేతనే ఇక్కడ  సంవత్సరానికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు.

ఏ ఆలయంలోనైనా గర్భగుడి లోపలి  దేవతామూర్తులు తూర్పు లేదా పశ్చిమ ముఖముగా ఉంటారు. కాని  ద్వారకా తిరుమలలోని స్వామి వారు దక్షిణముఖంగా ఉంటారు. ఎందుకంటే ద్వారక మహర్షి ఉత్తరముఖంగా కూర్చొని జపం చేయడం వల్ల ఆయన ముందు ప్రత్యక్షమైన వెంకన్న స్వామి వారు దక్షిణం వైపు చూస్తున్నట్లు స్వయంభూగా వెలిశారు.

ఏడుకొండల స్వామిని దర్శించాలి అంటే ముందుగా ఈ చిన్న వెంకన్నను దర్శించాలని అనే నమ్మకం ఇప్పటికీ కొనసాగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులలో. భక్తులు ముందుగా ఈ చిన్న వెంకన్న దగ్గర మొక్కులు తీర్చుకున్న తర్వాతనే ఏడుకొండల వెంకన్న ను దర్శించడానికి వెళతారని పండితులు వెల్లడిస్తున్నారు.

 


End of Article

You may also like