చాణక్య నీతి: ఈ మూడు పనులు చేసాక కచ్చితంగా స్నానం చేయాలి.. లేకుంటే ఏమవుతుందంటే?

చాణక్య నీతి: ఈ మూడు పనులు చేసాక కచ్చితంగా స్నానం చేయాలి.. లేకుంటే ఏమవుతుందంటే?

by Anudeep

Ads

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు.

Video Advertisement

వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది. అలాగే ఏ మూడు సందర్భాలలో కచ్చితంగా స్నానం చేయాలి అన్న విషయాన్నీ కూడా చాణుక్యుడు వివరించాడు.

పెళ్లి లాంటి ఫంక్షన్స్ కి వెళ్లగలిగితే వెళ్తాము. వెళ్లనున్న పర్లేదు. కానీ, చావు కార్యక్రమాలకు మాత్రం విధిగా హాజరు అవ్వాలి. అక్కడకు వెళ్లి ఇంటికి వచ్చిన తరువాత వెంటనే స్నానం చేయాలి. మరణించిన వారి శరీరంలో బ్యాక్తీరియాని ఎదిరించే శక్తీ ఉండదు. అందుకే వారి వద్దకు వెళ్ళినప్పుడు ఆ బ్యాక్తీరియా కారణంగా చుట్టూ పక్కల వారికి కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే మరణించిన వ్యక్తిని చూసి వచ్చిన వెంటనే స్నానం చేయాలని చెబుతుంటారు.

ఒంటి నిండా నూనె పట్టించుకున్నప్పుడు కూడా స్నానం చేయాలి. ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేసుకోవడం వలన శరీరంలోని కొన్ని వ్యర్ధాలు బయటకి వస్తుంటాయి. ఈ వ్యర్ధాలను శుభ్రం చేయాలంటే చక్కగా స్నానం చేయడమే పరిష్కారం. ఇంకా మూడవది ఏంటంటే.. హెయిర్ కటింగ్ చేయించుకున్న తరువాత కూడా ఇంటికి వచ్చాక స్నానం చేయాలి. ఎందుకంటే హెయిర్ కట్ చేసేటప్పుడు ఆ హెయిర్ శరీరంపై అక్కడక్కడా పడుతుంది. అందుకే సెలూన్ కు వెళ్లి వచ్చిన తరువాత వెంటనే స్నానం చేయాలి.


End of Article

You may also like