ఆ గుట్ట ఎక్కిన వారంతా పసుపు రంగులోకి మారిపోతున్నారు.. అసలు రహస్యం ఏంటంటే?

ఆ గుట్ట ఎక్కిన వారంతా పసుపు రంగులోకి మారిపోతున్నారు.. అసలు రహస్యం ఏంటంటే?

by Anudeep

Ads

సాధారణంగా ఆంజనేయస్వామి దేవాలయాలు చాలా వరకు గుట్టల పైనే ఉంటాయి. అయితే.. ఆ గుట్టకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. అదెక్కడో కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల పరిధిలో ఉండే గుంటపల్లి చెరువుకి దగ్గరలో రాసి గుట్ట అనే ఓ గుట్ట ఉంది. ఇది గుంటపల్లి చెరువుకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.

Video Advertisement

ఈ గుట్టపై అభయాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఈ స్వామిని అక్కడి భక్తులు దాసాంజనేయస్వామి అని పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామిని దర్శించుకోవాలంటే మాత్రం మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రాసి గుట్టను సహనంతో ఎక్కాల్సిందే.

అయితే ఆయనను చూడడానికి వచ్చే భక్తులు కూడా అంతే సహనంతో ఆ గుట్టని ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇలా దర్శించుకున్న భక్తులకు వారి శరీరం పసుపు రంగులో మారిపోతూ ఉంటుందట. ముఖ్యంగా కాళ్ళు, చేతులు ఎక్కువగా పసుపు రంగులోకి మారుతుంటాయట. ఈ విషయాన్నీ ఆ గుట్టపై స్వామిని దర్శించున్న భక్తులు, అక్కడి స్థానికులు చెబుతున్నారు.

అయితే, ఇలా శరీరం పసుపు రంగులోకి మారిపోవడానికి మాత్రం కారణం తెలియరావడం లేదు. అక్కడి రాళ్లు చాలా తేలికగా ఉంటాయట. అక్కడి చిన్నపిల్లలు వీటితో ఆడుకుంటూ ఉంటారట. అలాగే కొందరు పిల్లలు అయితే వీటిని తినేస్తూ ఉంటారట. అందుకే ఆ రాళ్ళని రాసి గుట్ట బలపాలు అని పిలుస్తారట. శ్రావణ మాసం హనుమాన్ జయంతి సమయాల్లో ఇక్కడి హనుమాన్ కు విశేష పూజలు చేస్తారట. ఇది చాలా పురాతనమైన దేవాలయమని, ఇక్కడ స్వామిని దర్శించుకుని ఏమైనా కోరుకుంటే అది కచ్చితంగా నెరవేరుతుందని చెబుతుంటారు. హనుమంతుడు సంజీవని పర్వతం మోసుకెళ్తున్నప్పుడు పొరపాటున ఓ ముక్క జారిపడి అక్కడ గుట్టగా వెలిసిందని చెబుతుంటారు. ఈ గుట్టపైన ఉన్న రాళ్లు జాదూ రంగులో ఉంటాయి. ఇక్కడకు ఎక్కువ సంఖ్యలోనే భక్తులు వస్తుంటారు. అయితే.. సౌకర్యాలు అంతగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటారు.


End of Article

You may also like