పాండవులు, కౌరవులు దాయాదులు అన్న సంగతి తెలిసిందే. వారు ఒకే వంశానికి చెందిన వారు అయినప్పటికీ వారిని పాండవులు, కౌరవులు అంటూ వేరు వేరు గా సంబోధిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు పిలుస్తారో.. ఈరోజు మనం ఈ కధనం లో తెలుసుకుందాం.
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహా దేవుడు.. వీరు ఐదుగురు పాండురాజు కుమారులు. వీరు ఐదుగురు అన్న దమ్ములు ఉండడం కారణం గా వీరికి పాండవులు అన్న పేరు రాలేదు. పాండు రాజు కుమారులు కాబట్టి వీరికి పాండవులు అన్న పేరు వచ్చింది. అలాగే.. కౌరవులు వందమంది అయినప్పటికీ వారిని సౌరవులు (సౌ= 100) అని కాకుండా కౌరవులు అని పిలుస్తారు. కౌరవులు ధృతరాష్ట్రుని కుమారులు. అందుకే వారిని ధృతరాష్ట్రులు అని కొన్నిచోట్ల పిలుస్తారు.. అలాగే వీరు కురు వంశ వారసులు కాబట్టి కౌరవులు అని పేర్కొనడం జరిగింది.
పాండవులు అయినా.. కౌరవులు అయినా కురు వంశ వారసులే.. కురు క్షేత్ర యుద్ధం ముందు వరకు రాజ్యాధికారం ఎక్కువగా కౌరవుల చేతిలోనే నడిచింది. వాస్తవానికి పాండవులను కూడా కౌరవులు అని పేర్కొనవచ్చు. ఎందుకంటే వారు కూడా కురు వంశ వారసులే కాబట్టి. కానీ కాలక్రమం లో పాండురాజు కుమారులను పాండవులుగా, ధృతరాష్ట్రుని కుమారులని కౌరవులు గా పేర్కొనడం వలన.. మనం కూడా వారిని అలానే చెప్పుకుంటూ వస్తున్నాము.