తింటే గారెలే తినాలి..వింటే మహా భారతమే వినాలన్నది పురాణ వాక్యం. భారతం లో ని ప్రతి పాత్ర, ప్రతి కథ మనకు ఒక్కో పాఠం నేర్పిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఉండే పరిసరాలపై స్పృహ, ఇతర జీవ జాతులపై భూతదయ ఉండాలి. మహాభారతం లో పాండవుల తండ్రి అయిన పాండురాజు కధే మనకు పాఠం నేర్పుతుంది. కథలోకి వెళ్తే.. పాండురాజు కి ఇద్దరు భార్యలు అన్న సంగతి తెలిసిందే. వారు కుంతి మరియు మాద్రి.

Video Advertisement

panduraju 2

పాండురాజు ఓ రోజు మాద్రి, కుంతి లతో కలిసి అడవి లో తిరుగుతుండగా.. మాద్రి రెండు జింకలను చూస్తుంది. వాటిని చంపి తెచ్చి ఇవ్వమని మాద్రి పాండురాజుని అడుగుతుంది. మాద్రి అడగ్గానే.. పాండురాజు వాటి పై బాణాలను సాధిస్తాడు. ఆ రెండు జింకలలో ఒకటి మరణిస్తుంది. అయితే.. అవి నిజానికి జింకలు కావు. జింకల రూపం లో ఉన్న ఓ మహర్షి మరియు అతని భార్య. అయితే.. చనిపోయిన జింక ఆ మహర్షి భార్య. తన భార్య చనిపోయిందన్న దుఃఖం లో ఆ మహర్షి పాండురాజుకు శాపం ఇస్తాడు. ఏ మహిళతో అయినా సంభోగం జరిపితే మరణిస్తావని శాపం ఇస్తాడు.

panduraju 1

ఈ శాపవశాత్తూ, పాండురాజుకు పిల్లలను కనడానికి అవకాశం ఉండదు. అయితే.. కుంతికి మాత్రం ఒక వరం ఉంటుంది. ఆమె చిన్నతనం లో ఆమె చేసిన సేవలకు గాను దుర్వాస మహర్షి ఆమెకు ఓ వరం ప్రసాదిస్తాడు. ఇష్టదైవాన్ని తలుచుకుని సంతానాన్ని కోరుకుంటే ఆమెకు సంతానం పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్నీ పాండురాజుకు తెలిపి ధర్మరాజు, భీముడు, అర్జునుడు లను సంతానం గా పొందుతుంది. ఆ తరువాత మాద్రి కూడా ఈ మంత్రం ప్రభావం తో నకుల సహదేవులను పొందుతుంది.

panduraju 3

ఐదుగురు పిల్లలతో వారి సంసారం సజావుగా సాగిపోతున్న తరుణం లో.. ఓ సారి పాండురాజు తనకు ఉన్న శాపం గురించి మరిచిపోయి మాద్రితో కలయిక లో పాల్గొంటారు. తత్ఫలితం గా పాండురాజు మరణిస్తాడు. పాండురాజు మరణించాడన్న దుఃఖం లో మాద్రి కూడా ప్రాణాలను విడుస్తుంది. ఇక, పిల్లల బాధ్యతను కుంతీ నెరవేరుస్తుంది. పాండవులందరు కౌరవులతో పాటు అంతఃపురం లోనే పెరుగుతారు. ఆ తరువాత వారి మధ్య జరిగిన సంఘటనలే కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తాయి. ఇదంతా అందరికి తెలిసినదే.