మనం పండగలప్పుడు.. శుభకార్యాలప్పుడు.. కొందరైతే నిత్యం పూజలు చేసుకుంటూనే ఉంటాము.. ముఖ్యం గా వ్రతాలు చేసే సమయం లో మనం కలశాన్ని ఉపయోగించి.. దానిపైన కొబ్బరికాయను, మామిడాకులు ఉంచి మనం ఎవరికీ ఐతే పూజ చేస్తున్నామో.. వారిని ఆ కలశం లోకి ఆవాహన చేస్తాము..
కలశం లో నీటిని పోసి.. వాటిలో కాయిన్స్, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి స్వామి వారిని ఆహ్వానిస్తాం.. చక్కగా పూజ చేసుకుని ఆ నీటిని తులసి మొక్కలో పోసేస్తాం. అక్కడే వస్తుంది అసలు సమస్య. కలశం పైన ఉంచిన కొబ్బరి కాయను ఏమి చేయాలి..? చాలా మందికి ఈ విషయం తెలియదు. కొందరు అయితే.. తమకు పూజ చేయించిన బ్రాహ్మణుడికి ఇచ్చివేస్తు ఉంటారు.
పూజ అయ్యాక.. మండపారాధన కోసం ఏర్పాటు చేసిన బియ్యం, ఇతర పూజ సామాన్లతో పాటు కొబ్బరికాయను కూడా ఇచ్చివేయడం వలన ఎలాంటి దోషము ఉండదు. కాకపోతే.. ఎవరికీ వారే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు.. ఆ కొబ్బరి కాయను ఎవరు తీసుకోవాలన్నది సమస్య అవుతుంది. అటువంటప్పుడు.. ఆ కొబ్బరికాయను నదీజలాల్లోను, లేదా ప్రవహిస్తున్న నీరు ఉన్న చోట నిమజ్జనం చేసేయవచ్చు. ఏ పురోహితుడికి ఇవ్వడం కుదరనప్పుడు ఇలా జల నిమజ్జనం చేసేయడం మంచిది అని పండితులు చెబుతున్నారు.