భారత్ లో ఉద్యోగాలు..ఈ హడావిడీలు ఎక్కువైనప్పటి నుంచి యువత ఎక్కువ గా వెస్ట్రన్ కల్చర్ నే ఫాలో అవుతున్నారు. గతం లో ఆదివారం అంటే ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎంతో పవిత్రం గా గడిపేవారు. కానీ, ఇప్పటి కల్చర్ ప్రకారం సండే అంటే హాలిడే. ఆరోజు అందరం లేట్ గా లేస్తాం.. అన్ని పనులను లేట్ చేస్తాం.. చాలా మంది స్నానాన్ని కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారు..

waking up late

కానీ, సనాతన ధర్మం లో ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పబడింది. మనందరికీ తెలుసు.. ఆదివారం అంటే భానువారం. ఆరోజు సూర్యుడికి చెందిన రోజు. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసి, స్నానాదికాలు పూర్తి చేసుకునే వారు. ఆదివారం రోజున సూర్యుడిని ప్రార్ధిస్తూ అర్ఘ్య ప్రదానం చేయడం వలన విశేష ఫలం తో పాటు ఆరోగ్యం లభిస్తుంది.

non veg

కానీ, బ్రిటిష్ వారు మనలని పాలించే సమయం లో భారతీయుల ఆరోగ్య రహస్యాన్ని గుర్తించి.. సరిగ్గా ఆదివారం రోజున సెలవు దినం గా ప్రకటించారు. దీనితో, వారమంతా పని చేసి.. ఆదివారం సెలవు వచ్చేసరికి.. ఆరోజు బద్ధకం రావడం సహజం. దీనితో, ఆలస్యం గా లేవడం మొదలైంది. క్రమం గా మన సంప్రదాయాలను పక్కన పడేసి.. ఆదివారం వస్తే మందు తాగడం, మాంసాహారం తినడం వంటివి ఆనవాయితీగా వచ్చేసాయి.

surya namaskar

కానీ, ఇది చాలా తప్పు. సూర్యుడు ఆరోగ్య కారకుడు అని పురాణాలూ ఘోషిస్తున్నాయి. సూర్యుడి రోజైన ఆదివారం నాడు ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కరించుకోవడం వలన, సూర్య రశ్మి శరీరం పై పడి సర్వరోగాలు నాశనం అవుతాయి.. కానీ, ఆరోజున ఆలస్యం గా నిద్ర లేవడం వల్ల ఉదయాన్నే లేత సూర్య కిరణాలను మిస్ అవుతాము. అలాగే, ఈరోజున మద్యం తాగడం, మాంసం భుజించడం కూడా మంచిది కాదు. ఆదివారం రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.