రామాయణంలో రావణుడి మరణం గురించి అందరికి తెలుసు…కానీ సీత,రామ,లక్ష్మణులు ఈ లోకాన్ని ఎలా వీడారో తెలుసా.?

రామాయణంలో రావణుడి మరణం గురించి అందరికి తెలుసు…కానీ సీత,రామ,లక్ష్మణులు ఈ లోకాన్ని ఎలా వీడారో తెలుసా.?

by Anudeep

Ads

హిందువులలో రామాయణం తెలియని వారు ఎవరు ఉండరు. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పురాణం. శ్రీ రాముడు మానవుడు ఎలా నడుచుకోవాలో ఈ అవతారం లో నడిచి చూపించాడు. రాక్షసులను సంహరించడం, వనవాసం, సీతను వివాహం చేసుకోవడం, ఆమెను రావణుడు అపహరించడం, ఆమెను వెతకడానికి శ్రీరాముడు ఆంజనేయుడు, సుగ్రీవుల సాయం తీసుకోవడం, సీతమ్మ తల్లి తిరిగి అయోధ్యకు రావడం, ఆ తరువాత మరోసారి సీత అడవుల పాలు కావడం, లవకుశల జననం… ఇలా సాగిపోతుంది రామాయణం.

Video Advertisement

agni parikhsa

అయితే… రావణుడి చెరనుంచి సీతమ్మని రక్షించాక.. శ్రీరాముడు ఆ సీతమ్మ కు అగ్నిపరీక్ష పెడతారు. అయితే.. తనకి పరీక్షా పెట్టినందుకు సీతమ్మ బాధపడ్డా.. ఆ పరీక్షా కు ఒప్పుకుంటుంది. ఆ పరీక్షలో సీతమ్మే గెలుస్తుంది. ఆ తరువాత వారిద్దరూ అయోధ్యకు చేరుకుంటారు. కొన్నాళ్ళకు.. ఓ చాకలి వాని మాటలు విని శ్రీరాముడు హతాశుడవుతాడు. మరోసారి ఆమెను అడవుల్లో వదిలేస్తాడు. ఆమె వాల్మీకి ఆశ్రమం లోనే తలదాచుకుంటుంది.

seeta

ఆ తరువాత ఆమెను అయోధ్యకు తీసుకురావాలని శ్రీరాముడు భావిస్తాడు. ఆ సమయం లో ఆమెకు అగ్ని పరీక్ష పెట్టాలని భావిస్తాడు. అయితే.. ఇది విన్న సీత దేవి దుఃఖించి.. ఈ పరీక్షను తిరస్కరిస్తుంది. తనను తీసుకెళ్లిపోవాలంటూ.. తన తల్లి అయినా భూదేవిని కోరుతుంది. వెంటనే.. భూమి రెండు గా చీలుతుంది. భూదేవి వచ్చి… సీతమ్మను తీసుకెళ్లిపోతుంది. అలా సీతాదేవి తనువు చాలిస్తుంది.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో జుంగిగంజ్ వద్ద సీతామర్హి అనే ప్రాంతం ఉంది. సీతమ్మ ఇక్కడే తనువు చాలించిందని చెబుతుంటారు.

sreerama

ఆ తరువాత శ్రీరాముడు.. లవకుశల కు అన్ని విద్యలను నేర్పిస్తాడు. కొంతకాలం జనరంజకం గా పాలన సాగిస్తాడు. ఓ రోజు యమధర్మరాజు ఋషి వేషం లో శ్రీరాముని వద్దకు వచ్చి గడువు పూర్తి అయిందని చెబుతాడు. ఆ తరువాత శ్రీరాముడు మంచి ముహూర్తాన సరయు నదిలో తనువు చాలించి శ్రీ మహావిష్ణువు గా మారిపోతాడు. ఆ తరువాత లక్ష్మణుడు కూడా అదే నదిలో అవతారం చాలించి.. తన అసలు అవతారం అయిన శేషనాగు అవతారం లోకి మారిపోతాడు. అలా.. సీతాదేవి, శ్రీ రాముడు, లక్ష్మణుడు తమ చివరిఘడియల్లో ఈ లోకాన్ని వీడారు.


End of Article

You may also like