జీవితం లో ఏమి చేసినా, ఎంత సంపాదించినా సుఖం గా ఉండడం కంటే సంతోషం గా ఉండడం ముఖ్యం. అసలు సంతోషం అంటే ఏంటి..? మనసుని ప్రశాంతం గా ఉంచుకోవడం. ఏ బాధ, ఆలోచనలు లేకుండా చిరునవ్వుతో గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోగలగడం. అది ఎప్పుడు సాధ్యపడుతుంది..? గరుడ పురాణం ప్రకారం ఈ మూడు అలవాట్లను వదిలేస్తే ప్రశాంతత దక్కుతుంది. జీవితం సాఫీ గా గడిచిపోతుందట.

1. అప్పు చేయడం:

loan
ఎప్పుడైనా సరే జీవితం లో ఆనందం గా ఉండాలంటే, మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు తోనే సాధ్యం అవుతుంది. కొంతమంది డబ్బులు సరిపెట్టుకోలేక బంధువుల వద్ద, స్నేహితుల వద్ద అప్పులు చేస్తూ ఉంటారు. వాటిని తీర్చలేక, అప్పు ఇచ్చిన వారు ఎదురైనపుడు సంజాయిషీలు ఇచ్చుకోలేక సతమతమవుతూ ఉంటారు. పైకి నవ్వుతు కనపడినా.. ఈ బాధ లోపల నలిపేస్తూ ఉంటుంది. అందుకే, అప్పు చేయకుండా జీవితాన్ని గడపాలి. సంపాదించుకున్న మొత్తం లోనే ఖర్చులు చేసుకోవాలి.

2. స్త్రీలను కించపరచడం:

man disprects
“యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతా” అని శాస్త్రం ఏనాడో చెప్పింది. స్త్రీలను గౌరవించకుండా కించపరిచేవారు కూడా సంతోషం గా గడపలేరట. స్త్రీలను అగౌరవపరిచే పురుషులు ఎవరితోనూ మంచి సంబంధాలను కొనసాగించలేరట. సమాజం లో స్త్రీలను గౌరవించే పురుషులకే గౌరవం దక్కుతుంది. స్త్రీలను కించపరుస్తూ మాట్లాడేవారిని మొదట చూసి నవ్వినా ఆ తరువాత దూరం పెడుతుంటారు.

3. జూదం ఆడడం:

joodam
మహా భారతం లో అంతటి ధర్మ పరాయణుడు ధర్మ రాజే జూదం ఆడడం వలన ఎలాంటి ఇక్కట్లు ఎదుర్కొన్నారో చూసాం. జూదాన్ని వ్యసనం చేసుకున్న వ్యక్తులకు జీవితం లో కష్టాలు తప్పవు. శారీరకంగానే కాదు మానసికం గా కూడా ఒత్తిడి ఎక్కువై సమస్యలతో సతమతమవుతూ ఉంటారట.