వాస్తు విషయం లో మనకి ఎపుడు ఏవో ఒక అనుమానాలు తొలిచేస్తూ ఉంటాయి కదా.. అందుకే మనం ఇంటిని నిర్మించుకునేటప్పుడు కచ్చితం గా ఓ పండితుడి దగ్గరకి వెళ్లి వాస్తు ప్రకారమే ప్లాన్ వేయించుకుని ఇల్లు కట్టుకుంటాం. కొందరైతే, అద్దె ఇంట్లోకి వెళ్లే సమయం లో కూడా కచ్చితం గా వాస్తు బాగుందో లేదో చూసుకుంటారు. ఒకవేళ ఇంట్లోకి మారిన తరువాత ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కూడా వాస్తు వల్లనే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో అని గమనించుకుంటారు. అవసరం అయితే అందుకు తగ్గ మార్పులు చేసుకుంటారు.
అందుకే మన పెద్దలు కూడా మనకు నిత్యం వాస్తు విషయం లో సలహాలు ఇస్తుంటారు. ముఖ్యం గా ఈశాన్యం లో బరువు పెట్టకూడదని చెపుతారు. అయితే, ఇలా ఎందుకు చెబుతున్నారు.. ఈశాన్యం లో బరువు పెడితే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ఈశాన్యం లో బరువు పెట్టడం దరిద్రం అని చెపుతారు కానీ, అంతటి పరిస్థితి ఉండదు. వాస్తవానికి ఈశాన్యం అనేది ఈశ్వరుని దిక్కు. ఆ స్థానం లో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఆ స్థానం లో బరువు ను పెట్టడం వలన అక్కడి దారి మూసుకునిపోతుంది. ఉదాహరణకు బీరువా వంటి పెద్ద పెద్ద వస్తువులను ఆ స్థానం లో పెట్టినపుడు మనం అటు వైపు అవసరం లేకుండా వెళ్ళము.
అదే ఆ ప్లేస్ ను ఖాళి గా వదిలేస్తే, మనం ధ్యానం చేసుకున్నా, ఆ ఈశ్వరుణ్ణి మనస్పూర్తి గా స్మరించుకున్నా మనలో పాజిటివిటీ చేరుతుంది. ఆ స్థానాన్ని ఖాళి గా ఉంచడం కోసమే బరువులు పెట్టొద్దని చెబుతారు. అది ఈశ్వర స్థానం. అక్కడ కూర్చుని ప్రశాంతం గా జపం చేసుకోవడం ఉత్తమం. అలాగే, ఈశాన్య భాగం లో ఎలాంటి మొక్కలు కూడా పెంచకూడదని చెబుతారు. ఈశాన్య భాగం ఈక బరువుని కూడా మొయ్యకుండా చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అలాగే, ఈశాన్యం దిక్పాలకుడు సున్నితమైనవాడని ఆ స్థానం లో బరువు పెరిగితే, ఆయన మనపై బరువు పెంచుతాడని కూడా చెబుతుంటారు. జీవితం లో బరువు పెరగకుండా ఉండాలంటే ఈశాన్యం లో బరువులు పెట్టొద్దని చెబుతారు.
watch video: