మనం మంగళవారం, శుక్రవారం ఇలా కొన్ని రోజులను పవిత్రం గా భావిస్తాం. మంగళవారం రోజు ఏ పని మొదలుపెట్టం. శుక్రవారం రోజు ఎవరికీ డబ్బులు ఇవ్వం.. అలా చేస్తే మన నుంచి సంపద దూరం అయిపోతుందని భావిస్తాం. అలాగే, గురువారం రోజున కూడా కొన్ని పనులను చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

thursday

గురువారం విష్ణువు కు ప్రతిబింబం అయిన బృహస్పతి కి అంకితం ఇవ్వబడిన రోజు. ఆ రోజును పవిత్రం గా భావించాలి. మన పూర్వీకుల కాలం నుంచే కొన్ని నియమాలను, ఆచారాలను మనం పాటిస్తూ వస్తున్నాం. వీటి వెనుక ఎన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాం. ఒకప్పుడు చెప్పులు ఇంట్లోకి వేసుకురావడాన్ని, రాత్రిళ్ళు ఇల్లు శుభ్రం చేయడాన్ని అరిష్టం గా భావించేవారు. కానీ చెప్పులను ఇంట్లోకి తీసుకురావడం వలన ఎన్నో సూక్ష్మ క్రిములు మనతో పాటు ఇంట్లోకి వస్తాయి. అలాగే రాత్రి సమయం లో చీకటి లో ఇల్లు శుభ్రం చేయడం వలన సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలా చెప్పేవారు. అలానే, గురువారం రోజున కూడా ఇల్లు శుభ్రపరచకూడదని నమ్ముతారు. అలా చేయడం దురదృష్టాన్ని ఆహ్వానించడమేనని నమ్ముతారు.

house cleaning

అలాగే, తలస్నానం కూడా చేయకూడదు. గురువారం బృహస్పతి కి ఇష్టమైన రోజు. గురుడు భర్తను ప్రతిబింబిస్తాడు. కాబట్టి ఆరోజు తలస్నానం చేయడం వలన భర్త కు, పిల్లలకు మంచిది కాదని చెబుతారు. అలాగే, జుట్టుని కూడా కత్తిరించకూడదు. జుట్టు, గోర్లు, గడ్డం వంటివి కత్తిరించడం దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అలాగే, బూజలు దూలపడం వంటి పనులను కూడా ముందు రోజే చేసుకోవాలి. అలాగే, పూజ చేసుకునేటప్పుడు కేవలం లక్ష్మి దేవిని మాత్రం పూజించకూడదు. లక్ష్మి దేవి కొలువై ఉండే విష్ణువు ని కూడా కలిపి పూజించాలి. అలా చేస్తే, అదృష్టం మీ వెంటే ఉంటుంది. అద్దాలు, కత్తులు వంటి పదునైన వస్తువులను గురువారం రోజున కొనడం అంత మంచిది కాదు. ఆస్తులు గురువారం రోజున కొనుగోలు చేయడం మంచిది. గురువులను, సాధువులను కించపర్చకూడదు. ఆరోజు ఇంటికి ఎవరైనా సాధువులు వస్తే, వారికి ఎంతోకొంత ఆహరం పెట్టి పంపండి.

 

అలాగే, గురువారం రోజున ఉపవాసం ఉంటె చాలా మంచిది. వీరికి జీవితం లో ఆనందం, సంపద లభిస్తుంది. జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నవారికి తప్పక తాము కోరుకున్నది లభిస్తుంది. వీరు నిత్య సంతోషులుగా ఉంటారు. వీరికి జీవితం లో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. గురువారం గోవులకు పక్షులకు ఆహారం పెట్టడం వలన కూడా మంచి జరుగుతుంది. విష్ణుసహస్ర నామం చదువుకోవడం ఉత్తమం. చూపుడు వేలుపై పుష్యరాగం ఉంగరం ధరించడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది.