భారతీయ వివాహ సంప్రదాయం లో మంగళసూత్రాలు ఉన్న ప్రాముఖ్యత గురించి తెలిసిందే. ఎంతో పవిత్రమైన ఈ సంప్రదాయం ప్రపంచ దేశాలకు ఆదర్శం. కానీ,నేటి యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి భారత వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని కించపరుస్తోంది. ఏ దేశం లోను లేని సంస్కృతి భారతీయుల సొంతం. భారత వివాహాల్లో మంగళసూత్రాలదే ప్రధమ ప్రాధాన్యత. తాళి బొట్టుని కట్టిన తరువాతే వివాహమైనట్లు భావిస్తారు. ఆ తరువాత అగ్ని సాక్షి గా ఏడడుగులు నడిచి వివాహబంధాన్ని ప్రారంభిస్తారు.

అయితే, మారుతున్న మోడరన్ యుగం లో మంగళసూత్రం అలంకారప్రాయమైపోయింది. ఒకప్పుడు మంగళ సూత్రాలను పరమ పవిత్రం గా చూసుకునే వారు. ఎంతో మంగళ కరమైనవి, వివాహిత కు శుభాన్ని చేకూరుస్తుంది కాబట్టే మాంగల్యాన్ని మంగళ సూత్రాలంటారు. ఈ తాళి మెడలో పడగానే ఆమె భర్త సొంతమవుతుంది. అతని అడుగుజాడల్లో, తోడునీడ గా నడుస్తుంది. భర్త ఆరోగ్యం భార్య మంగళ సూత్రాల్లోనే ఉంటుందని చెబుతారు. అతనికి ఎటువంటి ఆపద రాకూడదని, ఆలి అనుక్షణం తపిస్తుంది.

అమ్మవారిని ధ్యానిస్తూ.. నిత్యం మంగళసూత్రాలను కూడా పవిత్రం గా చూసుకుంటుంది. మంగళ సూత్రాలకు ఎటువంటి ఇనుము వస్తువులను తగిలించకూడదు. ఇనుము నెగటివ్ ఎనర్జీ ని గ్రహిస్తుంది. అందుకే పిన్నీసులను కూడా మంగళసూత్రాలకు పెట్టకూడదంటారు.

 

mangala sutram feature image

మంగళ సూత్రాలను పవిత్రం గా కాపాడుకుంటే..అవి మీకు పాజిటివ్ ఎనర్జీ ని అందిస్తాయి. నేడు.. మంగళ సూత్రాలను కూడా నల్లపూసల్లో కలిపేసి ఒకటే గొలుసు గా వేసుకుంటున్నారు. ఇది కూడా సరైన పధ్ధతి కాదు. హిందూ సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి వెనుక కారణాలుంటాయి. ఆచారాలను నమ్మి పాటిస్తే.. కొన్ని ఇబ్బందుల నుంచి మనకు తెలియకుండానే మనం గట్టెక్కుతుంటాము.