మన దేశంలోని సంపదను చాలామంది స్మగ్లర్లు ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఒకప్పుడు భారీగా సొమ్ములు చేసుకున్నారు ఇక ఇప్పుడు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన చట్టాలతో అది చాలావరకు తగ్గింది .అలాంటి వాటిలో ఒకటైన 9వ శతాబ్దానికి చెందిన శివుని ప్రతిమ ఇప్పుడు తిరిగి భారత్ చేరనున్నది.దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.
రాజస్థాన్ రాష్ట్రంలో 9వ శతాబ్దానికి చెందిన శివుని ప్రతిమ 1998 లో దొంగతనం చేసి అమ్మారు.ఇక ఇలా దేశం నుండి దొంగతనం చేయబడ్డ విగ్రహాలను,చరిత్ర మూలాలు కలిగిన వస్తువులను తీసుకురావడానికి లండన్ లోని హై కమిషన్ చాలా తీవ్రంగా శ్రమిస్తుంది.దాని ఫలితంగా కొన్నిటిని భారత హై కమిషన్ ఇప్పటికే రికవర్ చేసుకుంది.ఇక ఈ ప్రతిమను కొన్న వ్యక్తి భారతకు ఆ ప్రతిమను 2005 లో రిటర్న్ చేశారు.
హై కమిషన్ లో ఇన్ని రోజులు డిస్ ప్లే లో ఉంచిని ఈ ప్రతిమను ఇక భారతదేశానికి తీసుకొని రావాలని ప్రభుత్వం నిర్ణయించింది.దానితో ఈ ప్రతిమతో పాటు మరిన్ని దేవతా ప్రతిమలను భారత హై కమిషన్ ఇండియాకు త్వరలోనే తీసుకొని రానున్నవి.