కొత్త నిర్ణయాలతో, కొత్త పథకాలతో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణ స్టేట్ టీఎస్ ని, టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నంలో కూడా మార్పులు చేస్తున్నారు. ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణం ఉంటాయి. ఆ గుర్తులని ఇప్పుడు తొలగించబోతున్నారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అయితే, రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి ఏడు సంవత్సరాల క్రితమే చెప్పారు అంటూ ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా. అక్కడ పునాది వేస్తా” అని రేవంత్ రెడ్డి తెలిపారు.

అప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ వీడియో ఏడు సంవత్సరాల క్రితం వీడియో. “రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు చేస్తున్నారు” అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో 2017 లో మే 31వ తేదీన జరిగిన ప్రెస్ మీట్ లోది. అందులోనే రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి మాట్లాడారు. తెలంగాణ చిహ్నాన్ని మార్చే బాధ్యతని రేవంత్ రెడ్డి ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశానికి అందించారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా కొత్తగా కంపోజ్ చేయిస్తున్నారు.
ఆస్కార్ పొందిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ పాటని కంపోజ్ చేశారు. రాష్ట్ర అధికారిక గీత స్వర కల్పన ఇప్పటికే జరిగింది. ఈ విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. “తెలంగాణ వాసి కాని కీరవాణితో పాట స్వర కల్పన చేయించడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేశారు. చాలా మంది, “ఆస్కార్ పొంది భారతదేశానికే గర్వకారణం అయ్యారు. దేశానికి గౌరవం తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తితో పాట స్వర కల్పన చేయించడం అనేది చాలా గొప్ప విషయం” అంటూ కీరవాణికి మద్దతుగా కామెంట్స్ చేశారు. ఈ పాటని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.






ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో రాహుల్ గాంధీ ఒకరు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. ఇంత వయసు వచ్చినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోకపోవడంతో ఆయన పెళ్లి చాలా సార్లు చర్చలు జరిగాయి. ఎందుకు చేసుకోలేదు అంటూ అడుగుతూనే ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు, హీరోయిన్లు సైతం రాహుల్ గాంధీని వివాహం చేసుకుంటాం అని ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇంతగా చర్చకు దారితీసిన పెళ్లి గురించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సమాధానం చెప్పారు. 2022లో సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 137 రోజుల సుదీర్ఘ పాదయాత్రను శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్‌లో ముగించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు ఐదు నెలల్లో 4,080 కిలోమీటర్లు సాగింది.
ఆ సమయంలో రాహుల్ గాంధీ పూర్తిగా ప్రజల్లో ఉంటూ సామాన్యులను కలిసి మంచి చెడ్డలు తెలుసుకున్నారు. ఆ క్రమంలో కాలేజ్ స్టూడెంట్స్‌తో కూడా ముచ్చటించారు. అయితే వారిలో ఒక స్టూడెంట్ పెళ్లి గురించి రాహుల్ గాంధీని అడిగారు. ఆ ప్రశ్నకు ‘తన పనులు మరియు పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయినందువల్ల వివాహం గురించి ఆలోచించలేదని రాహుల్ గాంధీ వెల్లడించారు.




