కాలం మారినా, ప్రభుత్వాలు చట్టాలు ఎన్ని చేసినా, సమాజాన్ని వరకట్నం దురాచారం పట్టి పీడిస్తూ, ఎక్కడో ఒక చోట వరకట్న వేధింపులకు వివాహితలు బలి అవుతూనే ఉన్నారు. అయినా అదనపు కట్నం కోసం వేధించేవారిలో మార్పు రావడం లేదు.
తాజాగా గాజులరామారంలో వరకట్న వేధింపులకు మరో ఆడబిడ్డ బలి అయ్యింది. 4 కోట్ల రూపాయలు కట్నంగా ఇచ్చి కుమార్తె పెళ్ళిని ఘనంగా చేసినా, అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడంతో, వివాహిత బల-వన్మ-రణానికి పాల్పడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం గ్రామానికి చెందిన అభిలాష్ అనే యువకుడికి , కవాడిగూడకు చెందిన అమరావతి అనే యువతితో 2019లో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరి వివాహ సమయంలో రెండు కిలోల వెండి వస్తువులు, అర కిలో బంగారం, 10 లక్షల రూపాయల నగదు, 3 కోట్ల రూపాయలు విలువ చేసే హయత్ నగర్లో ఉన్న ఫ్లాటు, కట్నంగా ఇచ్చారు.
వివాహం జరిగిన కొంతకాలం వరకు అభిలాష్ అమరావతితో సజావుగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆమెను వేధింపులకు గురి చేయడం మెుదలుపెట్టాడు. అమరావతిని ఆమె తల్లిదండ్రుల నుండి అదనపు కట్నం తీసుకురావాలని, భర్త అభిలాష్తో సహా అత్తింటి వారు కూడా వేధించడం ప్రారంభించారు. అందుకు ఆమె నిరాకరించడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ పరిణామాలతో విసిగిపోయిన అమరావతి బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు ఉ-రివేసుకుని బల-వన్మరణానికి పాల్పడింది.
ప్రయాణం తీసుకునే ముందు సూ-సై-డ్ లెటర్ రాసి పెట్టింది. అందులో భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన జీవితాన్ని ముగించుకున్నట్లు ఆ లేఖలో రాసింది. తన పిల్లల పెంపకం మరియు శ్రేయస్సు కోసం ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలని అభ్యర్థించింది. అమరావతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అభిలాష్ మరియు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.
Also Read: పిల్లలతో భిక్షాటన చేయించి… 45 రోజుల్లో 2.5లక్షల రూపాయలు సంపాదించిన తల్లి..! చివరికి?