గత కొన్ని రోజులుగా జబర్దస్త్ ఆర్టిస్ట్ జీవన్ షో కి దూరం గా ఉన్నాడు. అనారోగ్య కారణాల వలన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, చావు దాకా వెళ్లి వచ్చాడు. తాజా ఎపిసోడ్ లో జీవన్ కూడా పార్టిసిపేట్ చేసాడు. ఐతే.. గతం కంటే బాగా చిక్కిపోయి కనిపించాడు. తానూ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో.. జబర్దస్త్ టీం తనకు ఎలా సాయం చేసిందో చెప్పుకుని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.
తాజాగా విడుదలైన ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమో లో జీవన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అనారోగ్యం కారణం గా కొన్నిరోజులు షో కి దూరం అయ్యి, తిరిగి ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తోంది అని రష్మీ అడగగా.. జీవన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెండు సార్లు పరిస్థితి సీరియస్ అయిందని, రెండవ సారి అయితే..డాక్టర్లు ఇక బతకడు అని చెప్పేశారని బాధపడ్డాడు. మా అమ్మ ఐతే అస్సలు ఏడుపు ఆపడం లేదని ఆ గడ్డు రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. చిన్న బాబు ఉన్నాడు మేడం అంటూ కన్నీళ్లపర్యంతమయ్యాడు.
ఆ సమయం లోనే టీం లీడర్లు, జబర్దస్త్ అందరు కలిసి ఆర్ధిక సాయం చేశారని, డాక్టర్లు బతకడు అని చెప్తే.. జబర్దస్త్ వాళ్లే తనని బతికించారని చెప్పుకొచ్చాడు. జీవన్ కథ విని అందరు ఎమోషనల్ అయ్యారు. ” మనవాళ్లలో ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా.. అందరం ఇలానే ఉంటాం..” అంటూ గెటప్ శ్రీను ధైర్యం చెప్పాడు.