రోజు వారి రాశి ఫలాలు తెలుగు లో ఇవాళ అనగా జులై 14 2021 బుధవారం రోజువారీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

rasi phalalu 14.07.2021

rasi phalalu 14.07.2021

మేష రాశి ఫలాలు:

అనుకున్న పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. మరింత మంచి ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం చదవడం వలన ఉత్తమైన శుభ పరిణామాలు చూడొచ్చు. అదృష్ట సంఖ్య :7 , అదృష్ట రంగు: తెలుపు.

వృషభ రాశి ఫలితాలు:

వృత్తి, వ్యాపారం, ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికి లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్ట సంఖ్య: 6 అదృష్ట రంగు : చంద్రిక.

మిథున రాశి ఫలితాలు:

మీరు తలచిన పనులు తప్పక పూర్తి చేస్తారు, ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యం వహించి అందరిచేత ప్రశంసలు పొందుతారు, ఈ రాశి వారు దుర్గ దేవిని ఆరాధించటం వలన మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట సంఖ్య : 4 అదృష్ట రంగు: గోధుమ రంగు, బూడిద రంగు.

rasi phalalu 14.07.2021

rasi phalalu 14.07.2021

కర్కాటక రాశి ఫలితాలు :

మీరు ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు తప్పవు, మీకు సంబంధం లేని విషయాల్లో దూరంగా వ్యవహరించడం మంచిది. భగవంతుని ఆరాధించడం ఆశలు మానొద్దు. అదృష్ట సంఖ్య: 8 అదృష్ట రంగు: నలుపు, నీలం.

సింహ రాశి ఫలితాలు :

అన్ని అనుకూల అంశలే ఉన్నాయి. మీరు ఉంటున్న రంగాల్లో మరింత ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సుబ్రమణ్య స్వామిని ఆరాధించడం, ఆలయాలను సందర్శించడం మంచిది. అదృష్ట సంఖ్య: 6 అదృష్ట రంగు: చంద్రిక.

కన్య రాశి ఫలితాలు:

మీ బంధు మిత్రులనుంచి సహకారం లభిస్తుంది, ఒక శుభవార్త వినే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీరాముణ్ణి ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు, శ్రీ రాముడి ఆలయాన్ని సందర్శిచే ప్రయత్నం చెయ్యండి.

తులా రాశి ఫలితాలు :

అనవసర విషయాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. మీరు చేపట్టిన పన్నులో ఎలాంటి అలసత్వం వద్దు ధైర్యంతో ముందగు వెయ్యండి విజయం సాధిస్తారు. లక్ష్మి దేవిని పూజించడం మీకు మంచిది.

వృశ్చిక రాశి ఫలితాలు:

చాల రోజులనుంచి మీకు ఎదురవుతున్న సమస్య తీరే సూచనలు కనిపిస్తున్నాయి, మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గణపతిని ఆరాధించడం ఉత్తమం.

ధనుస్సు రాశి ఫలితాలు :

ఉద్యోగంలో మీకు ఉన్నతమైన స్థానం చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు స్థిరంగా ఉండటం మంచిది. వ్యాపార వర్గాలవారికి సలహాలు సూచనలు మరీ ముఖ్యం. మీకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి మిమల్ని ఆదుకునే వారు ఉన్నారు. శివాలయాన్ని సందర్శిచడం, శివారాధన చెయ్యడం మీకు మరీ ముఖ్యం.

మకర రాశి ఫలితాలు :

అతి ముఖ్యమైన విషయాల్లో తొందర పాటు నిర్ణయాలు అస్సలు మంచి కాదు. బాగా అలోచించి ముందడుగు వెయ్యడం మంచిది. కొన్ని విషయాల్లో అనుభవజ్ఞులైన వారిని సంప్రదించి ముందుకుపోవడం మరీ మంచిది. శ్రీమహావిష్ణువును ఆరాధించడం మీకు మంచిది.

కుంభం రాశి ఫలితాలు:

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం పుష్కలంగా కనిపిస్తుంది. మీరు అనుకున్న పనులు తప్పక నెరవేరుతాయి. మనోధైర్యంతో ముందడుగు వెయ్యండి. మీ బంధు మిత్రుల నుంచి సహాహాకారం పూర్తిగా లభిస్తుంది. శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ఉత్తమం.

మీనా రాశి ఫలితాలు:

అన్ని ప్రతికూల సూచనలే ఉన్నాయి. మీరు పడ్డ కష్టానికి తప్పక ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం మరీ మంచిది