News
మరణించిన భార్య ని వీడలేక..17 సంవత్సరాలు గా శవం పక్కనే నిద్ర.. ఎముకలు పాడవకుండా ఆ భర్త ఏమి చేసాడంటే..?
ఆ భర్త కి భార్య అంటే వల్లమాలిన ప్రేమ. తనను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి కళ్ళ ముందు లేకపోవడాన్ని ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీనితో, ఆమె శవం పక్కనే పెట్టుకుని పడుకుంటున్నాడు. ఇతని స్టోరీ చూపరులను కలచివేస్తోంది. వివరాల్లోకి వెళితే.. వియాత్నం కు చెందిన లీ అనే వ్యక్తి తన భార్య చనిపోయినా మర్చిపోలేక పోతున్నాడు.
అతను తన భార్యను మరచిపోలేక చాలా రోజుల పాటు స్మశానం వద్దకే వెళ్ళేవాడు. చాలా రోజుల పాటు స్మశానం వద్దకు వెళ్లి భార్య సమాధి పక్కనే పడుకునేవాడు. ఓ రోజు వర్షం కురవడం తో.. అతను అక్కడ ఉండలేకపోయాడు. దీనితో, ఆ భర్త ఆ సమాధి పక్కనే ఒక సొరంగాన్ని కూడా తవ్వేసి అందులో ఉండడం మొదలుపెట్టాడు. ఇలా చేసిన చాలా రోజులకు లీ పిల్లలకు ఈ విషయం తెలిసింది.
తమ తండ్రిని వారు ఆ స్థితి లో చూడలేకపోయారు. అతని తండ్రికి నచ్చ చెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చినా.. లీ మామూలు మనిషి కాలేకపోయాడు. తిరిగి స్మశానం వద్దకే వెళ్లి.. సమాధి తవ్వి అస్థికలను బయటకు తీసాడు. వాటిని తెచ్చుకుని ఇంట్లోనే బెడ్ రూమ్ లో పెట్టుకుని నిద్రించేవాడు.
అతని అవస్థ ని చూసిన పిల్లలు చలించిపోయారు. లీ భార్య అస్థికలు కుళ్లిపోయిన స్థితి లో ఉన్నాయి. దీనితో, లీ వాటికి జిగురు, ఇసుక, సిమెంటు, ప్లాస్టర్ ఆఫ్ పారీస్ వంటి పదార్ధాలతో కలిపి ఓ మహిళ బొమ్మను తయారు చేయించాడు. ఆ బొమ్మలోనే తన భార్య ను చూసుకుంటూ.. ఆమె బ్రతికే ఉందనుకుని బతికేస్తున్నాడు.
కూతురు కి కొత్త బట్టలు కొని.. భార్యతో గుడికెళదామనుకున్నాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మిగిలాడు..కంటతడి పెట్టిస్తున్న ఘటన..!
కూతురుకి కొత్త బట్టలు కొని , తెల్లారి భార్య దగ్గరకెళ్ళి కుటుంబం తో కలిసి గుడికి వెల్దామనుకున్నాడు. కానీ అతని కోరిక తీరని కలే అయింది. భార్య దగ్గరకి వెళ్లేలోపే అతను ఈ లోకాన్ని వీడాల్సిన పరిస్థితి దాపురించింది. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన స్థానికులని కలచివేస్తోంది. మృతుడి బాగ్ లోని ఆధార్ కార్డు వివరాల ద్వారా సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వివరాల్లోకెళితే, నెల్లూరు జిల్లా కలువాయి మండలం పుల్లూరు గ్రామ వాసి నరసింహులు (32) బీ టెక్ చదివి శ్రీసిటీలోని ఓ పైపుల కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నారు. నరసింహులు నాలుగేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. అతనికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. భార్య పిల్లలతో కలిసి నరసింహులు సూళ్లూరు పేట సాయి నగర్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే, కొన్ని రోజుల క్రితం భార్య, కూతురుని పుట్టింటికి పంపించాడు. ఉద్యోగం కారణం గా తాను సూళ్లూరు పేటలోని ఉండిపోయాడు.
అయితే, వారాంతం లో భార్య ను చూడడానికి రెండు రోజులు ఆఫీసులో సెలవు పెట్టి ఇంటికి వెళదామనుకున్నాడు. ముందు రోజు రాత్రి భార్యతో కూడా ఫోన్ లో మాట్లాడాడు. పాప కు కొత్త బట్టలు తీసుకున్నానని , పొద్దున్నే ముగ్గురం గుడికి వెళదామని చెప్పాడు.. తెల్లారేసరికి ఊరికి చేరుకుంటానని తెలిపాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతం లో హోలీక్రాస్ సెంటర్ వద్ద ఊరికి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అదే సమయం లో అటు వైపు వేగం గా ఓ వాహనం దూసుకొచ్చి బస్సు స్టాప్ లో నిలుచుని ఉన్న నరసింహులు, అతనితో పాటు మరో వ్యక్తి వైపుకి దూసుకొచ్చింది. వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు. స్థానికులు ఈ ఘటన తో హతాశులయ్యారు. నరసింహులు బాగ్ లో చిన్న పాప వి కొత్త బట్టలు చూసి కలత చెందుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
గర్ల్ ఫ్రెండ్ కోసం బేబీ కామెల్ ను దొంగతనం చేసి జైలు పాలైన ప్రేమికుడు…!
ప్రేమ గుడ్డిది అంటుంటారు. ప్రేమ లో ఉన్నపుడు ఏమి చేస్తూంటామో మనకే తెలియదు. ఒక్కోసారి ఆలోచించకుండా చేసే పనులు అనర్ధాలకు దారి తీస్తాయి. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఇటీవల, దుబాయ్‌కు చెందిన ఒక వ్యక్తి విలువైన బేబీ కామెల్ (ఒంటె) ను దొంగిలించి పుట్టినరోజున తన స్నేహితురాలికి బహుమతిగా ఇచ్చాడు. కానీ అతను చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
స్థానిక జాతీయ వార్తాపత్రిక ప్రకారం, ఈ నెల ప్రారంభంలో బేబీ కామెల్ యజమానులు ఈ దొంగతనం జరిగినట్లు దుబాయ్ పోలీసులకు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలనీ కోరారు. చాలా రోజుల తరువాత, ఒక వ్యక్తి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పొలంలో విచ్చలవిడిగా ఒంటె తిరుగుతోందని అధికారులకు విన్నవించాడు. అయితే, పోలీసులు ఈ విషయమై లోతు గా విచారించిన తరువాత, ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడని పోలీసులకు అర్ధమైంది. ఈ కేసుని మరింత లోతు గా పరిశీలించారు.
ఆ తరువాత పోలీసులకు అర్ధమైంది ఏమిటంటే.. ఆ వ్యక్తి తన పుట్టినరోజున తన స్నేహితురాలికి బహుమతిగా ఇవ్వడానికి అరుదైన జాతికి చెందిన మరియు చాలా ఖరీదైన ఒంటెను దొంగిలించానని ఒప్పుకున్నాడు. అతను ఒంటెను దొంగిలించడానికి తన పొరుగువారి పొలంలోకి వెళ్లినట్లు కూడా ఒప్పుకున్నాడు. అతను మొదట బుకాయించినప్పటికీ.. తరువాత వాదించలేక నిజం ఒప్పేసుకున్నాడు.ఆ తరువాత పోలీసులు ఆ బేబీ కామెల్ ను దాని యజమానులకు అప్పగించేశారు. దొంగతనం చేయడం, తప్పుడు ఆరోపణలు చేసినందుకుగాను సదరు వ్యక్తి, మరియు అతని గర్ల్ ఫ్రెండ్ ను అరెస్ట్ చేసినట్లు యుఎఇ పేపర్ నేషనల్ పేర్కొంది.
ఆర్ధిక సహాయం చేయండి…ప్లీజ్ నన్ను ఆదుకోండి అంటూ ప్రముఖ నటుడు వేడుకోలు.!
ఆరోగ్యం క్షీణించడంతో తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, సహాయం చేయమని కోరారు నటులు పొన్నాంబళం. పొన్నాంబళం ఎన్నో తెలుగు తమిళ చిత్రాల్లో ఎక్కువగా విలన్ పాత్రలలో నటించారు. అయితే పొన్నాంబళం గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పొన్నాంబళం కిడ్నీ మార్పిడి చికిత్సకు సిద్ధమవుతున్నారు.
సాక్షి కథనం ప్రకారం పొన్నాంబళం శుక్రవారం రోజు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తనకి కిడ్నీ ఇవ్వడానికి తన సోదరి కొడుకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఆదాయం లేదు అని అన్నారు. దాంతో తన కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే రజనీకాంత్, శరత్ కుమార్, ధనుష్, రాఘవ లారెన్స్, కె ఎస్ రవికుమార్ వంటి పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం చేసినట్టు తెలిపారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం డబ్బులు అవసరం అని, దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తనకిిి ఆర్థిక సహాయం చేయమని కోరారు పొన్నాంబళం.
ఇది కథ కాదు…నిజంగానే జరిగింది..! మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే తప్పక చదవండి!
ఒక చిన్న అగ్గిపుల్ల ఒక పెద్ద అడివిని దగ్దం చేయగలదు అదే విధంగా మనం చిన్న పిల్లల మనసుల్లో నాటే కొన్ని ఆలోచనలు వాళ్ల జీవితాలనే చిన్నాభిన్నం చేసే ప్రమాదాలున్నాయి అనడానికి ఈ కథే ఉదాహరణ . ఇది కథకాదు నిజంగా జరిగినది.ఈ సమస్య తీవ్రత తెలియాలంటే ఈ కథ చదివితీరాల్సిందే.
ఇది కథ కాదు…నాలుగేళ్ళ కింద మా మేనత్త కూతురి నుండి నాకొక ఫోన్ వచ్చింది
ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను, అటు నుండి ఏడుపు..ఏమైంది సునితక్క ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నాను.
బిడ్డకు జ్వరం వచ్చింది ఫీట్స్ వస్తున్నాయ్ రా అని కంగారు పడుతూ చెప్పింది
వాళ్ళ ఫ్యామిలీ లో ఎవరు ఎడ్యుకేటెడ్ కాదు తన కడుపులో పాప ఉండగానే భర్త కాలం చేసాడు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళింట్లోనే ఉంటూ పొలం పనులకు వెళ్లి బిడ్డను చదివించుకునేది..
పాప 5th క్లాస్ అయ్యాక 6th క్లాస్ గురుకుల పాఠశాలలో సీటు వచ్చింది..
ఫోన్ లో ఆమె మాటలు విన్నాక వెంటనే కరీంనగర్ హాస్పిటల్ తీసుకు రమ్మన్నాను.. రెండు గంటల్లో వాళ్ళు కరీంనగర్ వచ్చి కాల్ చేశారు. అప్పటికే నేను హాస్పిటల్లో మాట్లాడి పెట్టాను.. పాప చాలా నీరసంగా విపరీతమైన జ్వరం తో బాధ పడుతుంది హాస్పిటల్ వచ్చాక రెండు సార్లు ఫీట్స్ వచ్చాయి .డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు MRI తో సహా అన్ని రిపోర్టులు నార్మల్..పాపను ICU లో లో అడ్మిట్ చేసి observation పెట్టారు. మూడు రోజుల్లో గంటకి ఒకసారి ఫిట్స్ వచ్చాయి. మూడు రోజుల తరువాత పాప కళ్ళు ఆల్మోస్ట్ కోమ లోకి వెళ్ళింది..
డాక్టర్ పిలిచి పాప ను హైదరాబాద్ తీసుకెళ్లడం బెటర్ అన్నారు.. కానీ ఎలా వాళ్ళ దగ్గర ఆ మూడు రోజుల బిల్లు కట్టడానికే డబ్బులు లేవు ఆలస్యం చేస్తే పాప బతకడం కష్టం అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా నిర్ణయం మీద డిపెండ్ అయి ఉన్నారు.ఏదైతే అధైయింది పాప ను ఎలా అయినా బతికించాలి అని వెంటనే మా సునీతక్క వాళ్ళ అన్నదమ్ముళ్లతో మాట్లాడాను. మీరు ఏం చేస్తారో ఎవరి కాళ్ళు పట్టుకుంటారో తెలీదు. మీకు ఉన్నది ఒక్క కోడలు బతికించడం మీ చేతుల్లోనే ఉంది ఎలా అయినా డబ్బులు అరెంజ్ చేయమని చెప్పాను..
మా సొంత బావ కి ఫోన్ చేసి పరిస్థితి చెప్పిన ఆయన వెంటనే 60 వేల వరకు సర్దాడు. మా సునితక్క వాళ్ళ తమ్ముళ్లు కూలి పనులు చేసుకుని బతికే వాళ్ళు . వాళ్లు ఎవరికి ఫోన్ చేసిన రూపాయి దొరకలేదు .
ఇక వాళ్ళ భార్యలు ముందుకు వచ్చి మెడలో ఉన్న పుస్తెలు కొదవ బెట్టి ఇస్తాం. పాప ను హాస్పిటల్ తీసుకుని వేళ్ళు అన్న అన్నారు.. చాలా బాదేసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్ లో అంకుర చిల్డ్రన్స్ హాస్పిటల్ తీసుకు వెళ్ళాను .
నాతో పాప అమ్మ ,వాళ్ళ చిన్న మేనత్త కొడుకు వచ్చారు. అంకుర హాస్పిటల్ లో 12 రోజులు ఉన్నాం. ఎన్ని టెస్టులు చేసిన అసలు ఫిట్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాక డాక్టర్లు తల పట్టుకున్నారు.
అంకుర హాస్పిటల్ వెళ్ళాక నాలుగవ రోజు పాప కి స్పృహ వచ్చింది. కానీ ఫీట్స్ మాత్రం ఆగలేదు. ఎం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్ కి ఒక డాక్టర్ వచ్చి బంజారా హిల్స్ లో ఉన్న సిటీ న్యూరో సెంటర్ కి సెకండ్ ఒపీనియన్ కోసం రిఫర్ చేశారు.
డాక్టర్ అన్ని పరీక్షలు చేసాడు. అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ఆయన పాప తో మాట్లాడాలి, మీ అందరు బయటే ఉండమని, పాపను ఆయన క్యాబిన్ లోకి తీసుకు వెళ్లి అరగంట తరువాత నన్ను లోపలికి రమ్మన్నాడు .
నేను వెళ్లి సార్ పాప కి ఏమైంది అన్నాను. ఆయన ఏమి మాట్లాడకుండా పాప నానమ్మ ఎవరు ఇక్కడికి వచ్చిందా? అని అడిగాడు .లేదు సార్ అన్నాను .మంచిది వస్తే మాత్రం నా చేతుల్లో సచ్చేది అన్నాడు .ఎందుకు సార్ ఏమైంది? అని అడిగితే అప్పుడు చెప్పాడు పాపకి ఏం జరిగింది అని..జరిగిన విషయం ఏంటంటే పాప ఆడుకోవడానికి రోజు బయటకు వెళ్తే వాళ్ళ నానమ్మ పాప ను దగ్గర తీసుకుని నువ్ ఆడుకోవడానికి బయటకు వెళ్తే నిను కామన భూతం ఎత్తుక పోతాది. బయట భూతాలు ఉన్నయ్ అని రోజు దెయ్యం కథలు చెప్పెదట .
దానికి తోడు పాప హాస్టల్ లో ఉన్న స్నేహితురాలు రోజు దెయ్యాల గురించి మాట్లాడుతుంటే, పాప నిజంగానే దెయ్యాలు ఉన్నట్టు భ్రమలోకి వెళ్ళిపోయింది. పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఒక ముసలామెకు మంత్రాలు వస్తాయి అని పాప ముందే అందరూ మాట్లాడుకోవడం విని ఆ ముసలామేనే దెయ్యం లా ఉహించుకుం.ది ఆ ముసలామేనే రోజు ఆమె మీదకు వచ్చినట్టు ఉహించుకునేది..అలా ఉహించుకున్న ప్రతి సారి ఫీట్స్ లాగ వచ్చి స్పృహ కోల్పోయేది.. ఆమెకు ఒంట్లో ఏ సమస్య లేదు ఉన్న సమస్య అల్లా ఆమె మనసులో పాతుకు పోయిన భయం. ఆ భయమే ఆమె ప్రాణం మీదకు తెచ్చింది అని డాక్టర్ పాప కు జరిగింది మొత్తం వివరించాడు..
మరి సొల్యూషన్ ఏంటి సార్ అన్నాను. సొల్యూషన్ ఏమి లేదు పాప ను డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి పాప లోని భయాన్ని తీసేస్తే చాలన్నాడు. నేను సరే అని పాప ను హాస్పిటల్ నుండి బయటకు తీసుకు వచ్చి, తిరిగి పాప ను ఒక హోటల్ కి తీసుకెళ్లాను. అక్కడ పాప, నేను ఇద్దరమే ఉన్నాం. పాప సైలెంట్ గా కిందకు చూస్తూ కూర్చుంది. నేను మెల్లగా పాపతో మాట కలిపి ఏమైంది మమ్మి డల్ గా ఉన్నావ్ అని అడిగా పాప నుండి సమాదానం లేదు.
మళ్ళీ అడిగా నో రెస్పాన్స్. భుజం మీద చేయి వేసి ఏమైంది రా ఆకలిగా ఉందా ఏమైనా తింటావా అని అడిగా లేదు అన్నట్టు తల ఊపింది పోనీ ఏమైనా తాగుతావా అని అడిగా పాప సైలెంట్ మళ్ళీ అడిగా నువ్వేం కావలి అన్నా తెస్తా ఏం తాగుతావ్ మమ్మి అని అడిగా పాప సైలెంట్.
నాకు అనుమానం వచ్చి నవ్వుతూ కామెడీగా గా పోనీ రక్తం తాగుతావా అన్నాను. పాప చూపు మారింది. నా అనుమానం బలపడింది నేను మళ్ళీ నవ్వుతూ ఏ రక్తం కావాలిరా కోడి రక్తమా? మేక రక్తమా? అని అడిగా. పాప ఉహు అని తల ఊపింది మరేం కావాలి రా అని అడిగితే పాప మెల్లగా సిగ్గు పడుతూ విచిత్రమైన చూపులు చూస్తూ బాబాయి బాబాయి మరి మల్ల అమ్మకు చెప్పకు నాకు నాకు మనిషి రక్తం తాగాలని ఉంది అని గొణుగుతూ చెప్పింది .అది విని నా రోమాలు నిక్క బొడిచినయ్ కరెక్ట్ గా చెప్పాలి అంటే నాకు కింద తడిసిపోయింది..నేను అయినా కూడా భయం చూపించకుండా సరే మమ్మి ఇంటికి పోయాక తెచ్చి ఇస్తా ముందు టిఫిన్ తిను అని చెప్పి పాప తో ఇక మనసు విప్పి మాట్లాడటం మొదలు పెట్టాను. పాపకు ఏం జరిగిందో పాప కె మొత్తం వివరించి చెప్పిన నీ సిచ్యువేషన్ ఇది ఇందువల్ల నువ్ ఇలా అయ్యావ్ అని చెప్పిన పాప అమాయకంగా మరి బాబాయి నాకేమైన ఆయితదా అని అడిగింది
నేను ఏమి అవదురా, అమ్మ నీ కోసమే బతుకుతుంది. నువ్ బాగుంటే అమ్మ బాగుంటుంది. దెయ్యాలు భూతాలు ఏమి లేవు అని కొన్ని ఉదాహరణలు చెప్పి పాప లోని భయాన్ని తీసేయడానికి ట్రై చేసాను..
నేను తిరుపతి లో కొన్న దండ నా మెడలో నుండి తీసి పాప మెడలో వేసి ఇది ఉంటే ని దగ్గరకు ఏ దయ్యం రాదు ఒకవేళ వచ్చినట్టు నీకు అనిపిస్తే మనసు లోనే ఒక మాట అనుకో ఓ దెయ్యం నువ్ నా దగ్గరకు రాకు చల్ దొబ్బేయ్ అని మనసులోనే తరిమేయ్ అని పాప ను మెల్లగా ట్యూన్ చేసానుపాప నేను చెప్పింది చెప్పినట్టు చేస్తా తల ఊపింది ఆ క్షణం నుండి ఇప్పటి వరకు పాపకు మళ్ళీ ఫీట్స్ రాలేదు ఎప్పటి లాగే నార్మల్ అయింది..కానీ ఆ 12 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఖతం..దెయ్యాలు భూతాలు మంత్రాలు అని పిల్లల ముందు మాట్లాడితే ఏమవుతదో ఆ రోజు అర్థం అయింది. చివరికి పాప సేఫ్.
ఇది శ్రీనివాస్ సర్ల అనే వ్యక్తి తన జీవితంలో ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ లో శేర్ చేసుకున్నారు . ఇప్పుడు అర్దమైంది కదా మనం ఆషామాషిగా చేసే చిన్న చిన్నపొరపాట్లు జీవితకాలం పాటు సరిదిద్దుకోలేని నష్టాన్ని మిగులుస్తాయి . పిల్లల మెదడులో తెలివిని , ధైర్యాన్ని నింపే కథలు చెప్పాలి కాని భయపెట్టేవి కావు. మారుతున్న సమాజంతో పాటు సమాజానికి అనుగుణంగా పిల్లల్ని మానసికంగా , శారీరకంగా సిద్దం చేయాలి తప్ప మొక్కను చెట్టుగ మలచడానికి చూడాలి కాని మోడు వారేలా చేయకూడదు.
అప్పటి వరకు పెళ్ళిసందడి.. అప్పగింతల వేళ తూలి పడ్డ వధువు..ఉన్నట్లుండి ఏమి జరిగిందంటే..?
ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవ్వరమూ చెప్పలేము. అప్పటిదాకా సంతోషం గా గడిపిన క్షణాలు ఒక్కసారిగా విషాదాంతం గా మారిపోవచ్చు. పెళ్లి బాజాల నడుమ సందడి నెలకొన్న వేళ నూతన వధువు మృతి చెందిన వైనం గురువారం ఒడిశా రాష్ట్రానికి చెందిన సోనేపూర్ జిల్లా లో చోటు చేసుకుంది. హఠాత్తుగా ఆమె ఎలా మృతి చెందిందో ఎవ్వరికి అర్ధం కాలేదు. ఇంతకీ ఏమి జరిగిందో తెలుసుకుందాం రండి.
గుప్తేశ్వరి సాహూ అనే అమ్మాయి మేనకా, మురళి సాహు దంపతుల సంతానం. వీరు సోనేపూర్ జిల్లా లో నివాసముంటున్నారు. మురళి సాహు దంపతులు తమ కుమార్తె కు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్ అనే వ్యక్తి తో వివాహం నిశ్చయించారు. ఈ వివాహం వేడుక సందర్భం గా అందరు ఉల్లాసం గా ఉన్నారు. ఈ వేడుక గురువారం రాత్రి జరిగింది. అయితే, మరుసటి రోజు అప్పగింతల సమయం వచ్చింది. అప్పటిదాకా వేడుక హుషారు లోనే ఉన్న పెళ్లి కూతురు అప్పగింతల సమయం లో కన్నీరు ఆపుకోలేకపోయింది.
తల్లి తండ్రులకు దూరం అవుతున్నానన్న బాధలో గుక్క పెట్టి ఏడ్చేసింది. కొంతసేపటికి ఆమె తూలిపడింది. మొదట అందరు ఆమె నీరసం వలన పడిపోయిందని అనుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె గుండెపోటు కారణం గా మృతి చెందిందని తెలిపారు. ఎక్కువ గా ఏడ్చి ఏడ్చి ఉండడం వలన, ఆమె గుండె పై భారం పెరిగి మరణించింది. పెళ్లి జరిగిన కొన్ని గంటల వ్యవధి లోనే ఇలా చోటు చేసుకోవడం తో పెళ్లి కి వచ్చిన బంధువులంతా విషాదం లో మునిగిపోయారు.
శుభలేఖలు కూడా ముద్రించారు…ఇంతలో అమెరికాలో తెలుగమ్మాయి ఆత్మహత్య.! ఏమైందా అని ఆరాతీస్తే.?
అమెరికాలో ఒక తెలుగు యువతి ఆత్మహత్య కి పాల్పడ్డ ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. న్యూస్ 18 కథనం ప్రకారం చిత్తూరులోని పోలీస్ కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. పూతలపట్టు మండలం బందార్లపల్లె గ్రామానికి చెందిన మురళి కొడుకు భరత్ అమెరికా లో ఉద్యోగం చేస్తున్నారు.
వారిద్దరి కుటుంబ సభ్యులు చర్చించుకొని వారికి పెళ్లి ఖాయం చేశారు. మార్చి 3వ తేదీన అంటే గురువారం తెల్లవారు మూడు గంటలకి వారికి వివాహం నిశ్చయించారు. శుభలేఖలు ముద్రించారు. పెళ్లి ఏర్పాట్లు కూడా జరిగాయి. వారం రోజుల క్రితం భరత్ ఈ వివాహానికి నిరాకరించారు. ఈ విషయంపై సుష్మా కి భరత్ కి మధ్య చర్చ జరిగింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. అంతా సర్దుకుంటుంది అనుకున్నారు. కానీ సుష్మా ఆత్మహత్య వార్త విని బాధకి గురయ్యారు.