రెబెల్ స్టార్ ప్రభాస్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్న “ఆదిపురుష్” సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ డే షూట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సాయంత్రం గం.4.15ని.ల సమయంలో ముంబైలోని మలాడ్‌లోని ఇనోర్బిట్ మాల్ సమీపంలోని స్టూడియో లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
సెట్ లో లెవెల్ 2 లో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే, సెట్ లో షూటింగ్ కు సంబంధించి కొన్ని పరికరాలు మాత్రం కాలిపోయాయి. ఈ షూటింగ్ లో ప్రభాస్ కానీ, సైఫ్ అలీఖాన్ గాని పాల్గొనలేదు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయం లో అగ్నిమాపక దళానికి సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలానికి వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
View this post on Instagram