అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ట వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇంకా ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా అయోధ్య రామ మందిరానికి హాజరయ్యారు. రాజకీయ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులని ఈ వేడుకకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అందులో, తెలుగు రాష్ట్ర ప్రముఖులు కూడా ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ వేడుకకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య రామ మందిరానికి వెళ్లారు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న మాత్రం నెలకొంది. అదేంటంటే, వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ వేడుకకి వెళ్ళలేదు. వారికి ఆహ్వానాలు అందలేదు అని అంటున్నారు. అయితే, “అసలు వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ వేడుకకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి?” అని అంటున్నారు. దీనిపై పలు సమాధానాలు వస్తున్నాయి. జగన్ ప్రస్తుతం వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాన్ని ఖరారు చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు.
అయితే మరొక పక్క వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డితో పాటు, మరి కొంత మంది నేతలు, రామ మందిర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు చేయడంతో జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది అని చాలా మంది అనుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ చీఫ్ అయిన రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి కూడా ఆహ్వానాలు అందాయి. అయినా కూడా వాళ్ళు వెళ్లలేదు. జగన్ దంపతులు కూడా రామ మందిరానికి వెళ్లలేదు. “జగన్ క్రిస్టియానిటీ మతాన్ని నమ్ముతారు కాబట్టి, ఈ వేడుకకి వెళ్ళలేదు” అని కొంత మంది అంటున్నారు.
“ఈ ఆహ్వానాలు కేవలం బీజేపీకి మద్దతు తెలిపిన వారికి మాత్రమే అందాయి” అని కూడా అన్నారు. మరి కొంత మంది అయితే, “జగన్ బీజేపీకి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకొని ఈ వేడుకకి వెళ్ళలేదు” అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. అసలు జగన్ కి ఆహ్వానం అందిందా లేదా అనే విషయం కూడా ఇంకా ప్రశ్నగానే ఉంది. ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే వెళ్లలేకపోవడానికి కారణాలు ఇవి అయ్యుండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ALSO READ : రామ్ చరణ్ ని అలా అన్నప్పుడు ఉపాసన లేకపోవడమే వెలితి… ఆహ్వానం అందినా కూడా ఆమె ఎందుకు వెళ్ళలేదు.!