జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల మన్ననలు పొందిన అనసూయ గురించి కొత్త పరిచయం అవసరం లేదు అనుకుంట. తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యారు అనసూయ.యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి తర్వాత పలు చిత్రాలలో నటించి నటిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ అనసూయ .రంగస్థలం సినిమాకుగాను 66 వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో ఆమె ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.

సుకుమార్ దర్శకత్వం వహించి రాంచరణ్ తేజ్ హీరో గా నటించిన రంగస్థలం చిత్రంతో రంగమత్తాగా ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తిండిపోతారు అనసూయ .లాక్ డౌన్ కారణంగా తమ పిల్లలతో మరియు భర్త భరద్వాజ్ తో ఇంట్లోనే గడుపుతున్నారు అనసూయ.ఈ లాక్ డౌన్ లో సమయం ఎక్కువ దొరకడంతో ప్రేక్షకులతో ముచ్చటించడానికి ఎక్కువ సమయం దొరికింది యాంకర్ అనసూయ కు.అయితే అనసూయ తన భర్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వివరాల్లోకి వెళ్తే…

ఇటీవల అనసూయ భరద్వాజ్ అభిమానులతో ముచ్చటించారు.అయితే అందులో భాగంగా ఓ నెటిజెన్ మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడిగారు.దానికి అనసూయ ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరిని ఆకుట్టుకుంటుంది. నా భర్త భరద్వాజ్ నా మొదటి ప్రియుడు ,రెండవ ప్రియుడు ,మరియు మూడవ అలా చూస్తే నా భవిష్యత్ ప్రియుడు కూడా తానే అని తెలిపారు.అనసూయ ఇంటర్మీడియేట్ చదువుతున్నపుడు శశాంక్ భరద్వాజ్ ని కలిశారు.భరద్వాజ్ ను పెళ్లి చేసుకోవడానికి అనసూయ 9 సంవత్సరాలు ఎదురు చూసారు.అయితే అనసూయ కు ఇద్దరు కుమారులు. అయితే అనసూయ త్వరలో ఆచార్య ,పుష్ప,వకీల్ సబ్,రంగా మార్హ్తండా చిత్రాల్లో కనిపించనున్నారు అంట.



















