గత 10 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలందరూ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలు,మండల కేంద్రాలు, ఐసీడీఎస్ ప్రాజెక్టుల వద్ద అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేశారు. ర్యాలీలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలతో ఆందోళనలను హోరెత్తించారు. కార్యాలయాల వద్దే వంటా వార్పు చేసి,రోడ్డు మీదే భోజనాలు చేశారు. చెవిలో పూలు పెట్టుకుని, మోకాళ్లమీద నిలబడి, ఒంటి కాళ్ల మీద నిలబడి ఇలా వినూత్న రీతుల్లో నిరసన తెలిపారు.

అంగన్వాడి స్కూల్ అన్ని మూసేసి రోడ్లమీదకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అంగన్వాడి కార్యకర్తలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాల వారందరూ ముందుకు వచ్చారు.
అయితే తమకు జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాటిట్యూడ్ అందించాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. అయితే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒక అంగన్వాడీ కార్యకర్తకి అమ్మోరు పూనినట్లుగా వేప రొట్టలతో ఊగిపోతుంటే పక్కన ఉన్న కార్యకర్తలు అమ్మవారిని తమ కోరికలు తీర్చాలని అడుగుతున్నారు. ఏమేమి కోర్కెలు అని అడగగా తమకి జీతాలు పెంచాలని 26,000 చేయాలని అడిగారు. ఈసారి కూడా తన కోరికలు తీస్తే ఒక్క అవకాశం అని వచ్చిన నికు రెండోసారి కూడా ఓట్లేసి మరో అవకాశం ఇస్తామంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెబుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ప్రభుత్వం కొన్ని ప్రతిపాదన తీసుకొచ్చిన వాటికి అంగన్వాడీలు ఒప్పుకోవడం లేదు.తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందే అని పట్టుపడుతున్నారు.
watch video :
అంగన్ వాడీ కార్యకర్తలు pic.twitter.com/lqG8Rrn32r
— Milagro Movies (@MilagroMovies) December 20, 2023
ALSO READ : RTC బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం…ఇక మీదట ఇది తప్పనిసరి..లేదంటే టికెట్ తీసుకోవాలి.!


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సులలో మహిళలు తెలంగాణలో ఎక్కడి నుండి మరెక్కడికైనా ఉచితంగా జర్నీ చేయవచ్చు. దీంతో మహిళలు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుని జీవనం సాగించేవారు విలపిస్తున్నారు. ఫ్రీ జర్నీ కావడంతో చిన్న పనికి కూడా మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు.
బస్సులలో డబ్బులు చెల్లించి ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఆందోళన చేశాడు. మగవారికి బస్సులో ఒక్క సీటు కూడా దొరకడం లేదంటూ మండిపడ్డాడు. సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తే మేమేలా ప్రయాణం చేయాలంటూ ప్రశ్నించాడు. అంతే కాకుండా బస్సు వెళ్ళకుండా అడ్డుగా నిలబడి తన నిరసన తెలిపాడు. తాజాగా ఓ యువతి బస్టాండ్ లో ఏడుస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. జగిత్యాలకు చెందిన ఆ యువతి కాలేజ్ లో చదువుతుంది. కాలేజీకి ఆమె బస్సులో వెళ్తుంది.
ఫ్రీ జర్నీ వల్ల తనకు రోజు సీటు దొరకట్లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కాలేజీకి వెళ్ళేటపుడు 40 నిమిషాలు, తిరిగి ఇంటికి వచ్చేప్పుడు 40 నిమిషాలు పడుతుంది. రోజు బస్సులో సీటు దొరకక గంటకు పైన నిలబడాల్సి వస్తుందని వెక్కి వెక్కి ఏడ్చింది. రోజూ టైమ్ కి కాలేజీకి వెళ్లలేకపోతున్నామని చెప్పింది. ‘బస్సులో ఉచిత ప్రయాణం చేసి నాలాంటి వాళ్లు జర్నీ చేయకుండా చేస్తున్నారు. ఇదే మా ఊరికి చివరి బస్సు, కొత్త బస్సు మాకు కావాలి’ అంటూ ఏడ్చింది. ఆ యువతి ఎక్కే బస్సు పూర్తిగా నిండిపోయి మహిళలు కూడా ఫుడ్ బోర్డ్ పై జర్నీ చేస్తున్నారు.
ఎంబీఏ చదివినా, అందుకు తగ్గ జాబ్ రాలేదని బాధపడకుండా మానస అనే మహిళ తనకు లభించిన ఉపాధితో పారిశుద్ధ్య కార్మికురాలిగా వర్క్ చేస్తోంది. హన్మకొండ జిల్లా, వెంకటాపూర్ గ్రామానికి చెందిన మానస, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటపుడు బంధువు అయిన దిలీప్ కుమార్ ను ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త కూడా ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేశారు. 2016లో ఆమె ఎంబీఏను పూర్తి చేశారు. మంచి ఉద్యోగం సాధించి, మంచి జీవితాన్ని పొందాలనుకున్న మానస లైఫ్ లో కొన్ని పరిణామాలు జరిగాయి.
దాంతో ఆమె వెంకటాపూర్ పంచాయితీ ఆఫీస్ లో పారిశుద్ధ్య కార్మికురాలిగా, ఎనిమిది వేల రూపాయల జీతానికి పని చేస్తున్నారు. ఆమె భర్త దిలీప్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలా ఎంబిఎ చేసిన ఆ భార్యభర్తలు ఇద్దరు పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. మానస తండ్రి చనిపవడంతో, తల్లిని ఒంటరిగా వదిలేయలేక, ఆర్థిక పరిస్థితుల వల్ల సొంత గ్రామాన్ని వదల్లేక, ఇక్కడే ఉండిపోయామని మానస వెల్లడించారు. అక్కడే దొరికిన ఉపాధితో సంతోషంగా ఉన్నామని తెలిపారు.
ఇటీవల వచ్చిన పోలీస్ నోటిఫికేషన్ కు కూడా మానస దరఖాస్తు చేసింది. చాలా కష్టపడి పరీక్షలు రాసినప్పటికీ, ఆమె పోలీస్ సెలెక్షన్లలో సెలెక్ట్ కాలేదు. ఒక్క మార్కు తేడాతో ఉద్యోగాన్ని పొందలేకపోయానని మానస తెలిపారు. మానస తమ చదువుకు తగిన ఉద్యోగావకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వార్తను చూసిన నెటిజెన్లు ఎంబీఏ చదివి కూడా పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న మానస పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొన్ని నెలలకే ఏపీ కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు వేగంగా జరిగాయి. ముందు తాత్కాలికమైన సచివాలయం, శాసనసభ రెడీ చేసి, 2017 నుండి ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్ ను సిద్ధం చేశారు. ఇందులో 2019 నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వాటితో పాటు శాశ్వత వసతి కోసం పలు బిల్డింగ్స్ నిర్మించడానికి పనులు కూడా మొదలయ్యాయి. అందులో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు ఎనబై శాతం పనులు పూర్తయ్యాయి.
సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణంలో వెచ్చించారు. అయితే రోడ్లు, భవనాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అమరావతి నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భారీగా వెచ్చించాయి. దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా ఉంటాయని అమరావతి జేఏసీ హైకోర్టుకు తెలిపింది. అమరావతి కోసం కేంద్రం ఇప్పటి వరకూ దాదాపుగా రూ. 1500 కోట్లు రిలీజ్ చేసింది.
“2021 నవంబర్ 23 లెక్కల ప్రకారంగా, అమరావతి అభివృద్ధి కోసం రూ. 8,572 కోట్లు వెచ్చించారు. అందులో మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు, 3 వేల కోట్ల రూపాయలను వడ్డీలు, కౌలు చెల్లింపు, కన్సల్టెన్సీ చార్జీలు,పెన్షన్ల నిమిత్తం ఖర్చయ్యాయి. ఈ నిధులు అమరావతి బాండ్లు, హడ్కో లోన్లు, కన్సార్షియం ద్వారా సేకరించారు. వీటికి వడ్డీల చెల్లించే భారం తమ ప్రభుత్వం భరిస్తోంది” అని ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
1976లో జన్మించిన కల్వకుంట్ల తారక రామారావు యూఎస్ లో ఎంబీఏ చేశారు. ఆ తరువాత అమెరికాలో కొన్నేళ్ల పాటు జాబ్ చేశారు. 2006లో తన జాబ్ కి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ లో చేరి తన తండ్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. జూన్ 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ప్రస్తుతం ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, 2003లో డిసెంబర్ 18న కేటీఆర్, శైలిమల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు హిమాన్షు రావు, అలేఖ్య రావు అనే పిల్లలు ఉన్నారు. సోమవారం నాడు వీరి పెళ్లిరోజు సందర్భంగా, 20 సంవత్సరాల క్రితం నాటి పెళ్లి ఫొటోను, భార్య పిల్లలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్, “నా అందమైన భార్య శైలిమకు 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 2 దశాబ్దాలుగా నాకు మద్దతుగా నిలిచినందుకు మరియు నాకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు, ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు.
మన ప్రయాణం ఇలాగే మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలని కోరుకుంటున్నాను.” అంటూ తన భార్య శైలిమకు పెళ్లి రోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. కేటీఆర్ పోస్ట్ చేసిన కొన్ని గంటలలోనే ఈ ట్వీట్ కు నెటిజెనల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్ట్ కి రిప్లైగా కేటీఆర్ పెళ్లి ఫోటోలతో వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.


