సినిమా ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త వారికి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది.2023 సంవత్సరంలో చాలా మంది కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు.అయితే వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.
బలగం వేణు నుంచి రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న శౌర్యువ్ వరకు తొలి సినిమాతోనే డైరెక్టర్ గా వారి సత్తా చాటి అదుర్స్ అనిపించారు.

2023 మొదట్లోనే రైటర్ పద్మభూషణ్ సినిమాతో తొలి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు షణ్ముఖ్ ప్రశాంత్. సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సంవత్సరం సంచలన విజయాల్లో ఒకటి దసరా. న్యాచురల్ స్టార్ నాని హీరోగా డిబటెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దసరా. శ్రీకాంత్ మీద నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
అలగే సుమంత్ ప్రభాస్ అనే కుర్ర దర్శకుడు కూడా తన డైరెక్షన్ లో తీసిన మేమ్ ఫేమస్ తో హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ గా తొలి సినిమా అవ్వడమే కాదు హీరోగా కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడు. ఈ సినిమాతో సుమంత్ ప్రభాస్ కూడా తన సత్తా చాటాడు. ఇక మ్యాడ్ సినిమాతో యూత్ ఫుల్ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ శంకర్. యుత్ మెచ్చేలా సినిమా తీసి మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ అనిపించాడు. ఈ నెలలో రిలీజైన హాయ్ నాన్న సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు నాని. ఆల్రెడీ దసరా తో శ్రీకాంత్ కి తొలి అవకాశం ఇచ్చిన నాని హాయ్ నాన్నతో శౌర్యువ్ సత్తా చాటాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు మరో సెన్సిబుల్ డైరెక్టర్ దొరికాడు.










మదురైకి చెందిన నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. చెన్నైలోనే తన బంధువుల ఇంట్లో నందిని ఉంటోంది. ఆమెకు పదవతరగతి నుండి పాండి మహేశ్వరితో స్నేహం ఉంది. పాండి మహేశ్వరి చెన్నైలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని, తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేస్తున్నారని, లింగమార్పిడి తరువాత కూడా వారి సహజీవనం కొనసాగిందని తాంబరం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వారిద్దరూ గత ఎనిమిది నెలలుగా తోరైపాక్కంలోని ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.
అయితే నందిని రాహుల్ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి, పగ పెంచుకున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం నందిని బర్త్ డే కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాలు తిరిగారు. గుడికి, ఆ తరువాత హోటల్ కి వెళ్ళి భోజనం చేశారు. చివరికి పొన్మార్ రోడ్ సమీపంలో ఫ్లాట్ కి నందిని తీసుకెళ్ళాడు. ప్లాట్‌కి తీసుకెళ్లాడు. సర్ ప్రైజ్చేస్తానని చెప్పి, నందిని కళ్లకు గంతలు కట్టాడు. ఆ తరువాత చేతులు, కాళ్ళు కట్టేసి, బ్లేడ్ తో మణికట్టు, మెడ కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుండి పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు.
గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కథానాయకుడు కళ్యాణ్ రామ్ డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఈ ఏడాది ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 12 మిలియన్ వ్యూస్‌ను దాటి ట్రైలర్ దూసుకెళ్తోంది.



