ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎంత ఫేమస్సో ఆయన భార్యగా అల్లు స్నేహారెడ్డి కూడా అంతే ఫేమస్. ఈమె తన భర్తతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే మెగా ఫ్యామిలీ లో ఏ ఫంక్షన్ జరిగినా ఆమె తప్పక హాజరవుతుంది. ఏ హీరోయిన్లకి తీసిపోని అందంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడుతుంది. ఇప్పటివరకు ఇంటి వ్యవహారాలు, బిజినెస్ వ్యవహారాలు మాత్రమే చూసుకున్న స్నేహ రెడ్డి సడన్గా కెమెరా ముందు కనిపించి పెద్ద షాక్ ఇచ్చింది.

అయితే సిల్వర్ స్క్రీన్ పై కాదు ఫస్ట్ టైం ఒక యాడ్ లో యాక్ట్ చేసింది స్నేహారెడ్డి. కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్ చాకో బోన్ క్రిస్పీ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ యాడ్లో యాక్ట్ చేసింది. అనవసరమైన మేకప్ తో హడావిడి చేయకుండా పింక్ కలర్ డ్రెస్ లో నాచురల్ గా కనిపించింది. యాడ్ కి కావలసిన విధంగా ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ లా నటించింది.
ఇక తమ అభిమాన హీరో భార్యను వెండితెరపై చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ యాడ్ ను అల్లు స్నేహ తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ పిల్లాడి ప్లేస్ లో అల్లు అయాన్ ఉండి ఉంటే బాగుండేది అంటూ నెటిజన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.
https://www.instagram.com/reel/C185zi8vgW6/
బన్నీ ఫ్యాన్స్ అందరూ త్వరలో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వండి చాలా బాగా చేశారు అని కామెంట్స్ పెడుతున్నారు. నిత్యం ఫోటోషూట్ తో అదరగొడుతూ ఉండే స్నేహ రెడ్డిని అభిమానులు ఎప్పటినుంచో వెండితెరపై చూడాలని కోరుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అనేకసార్లు స్నేహ రెడ్డి హీరోయిన్గా రాబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మరి త్వరలోనే వెండితెరపై కూడా కనిపిస్తుందేమో వేచి చూడాలి.






కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జనవరి 14 నుండి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించబోతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుండి మొదలయ్యే ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,500 కిలోమీటర్లు సాగి ముంబైలో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బస్సు మరియు కాలినడకన, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ క్రమంలో వంద లోక్సభ స్థానాలను చూడుతూ ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ యాత్రకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా యాత్రకు సంబంధించిన పోస్టర్ ను స్వయంగా తానే తన వాహనానికి అతికించారు. ఆ పోస్టర్ లో రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, భారత్ జోడో న్యాయ్ యాత్ర అని ఉంది. ఈ పోటోలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
“ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను.”
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఝార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లా, కరమ్తాండ్ కు చెందిన సరస్వతి దేవి కు శ్రీరాముడంటే అమితమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చిన అనంతరం సరస్వతి అయోధ్యను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ తిరిగి రామ మందిరం నిర్మించే వరకూ మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇక అప్పటి నుండి తనకు ఏం కావాలన్నా సైగలతో మాత్రమే అడగటం ప్రారంభించారు. అయితే రోజులో సరస్వతి గంట సేపు మాత్రమే తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవారు.
2020లో ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మించడం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తరువాత సరస్వతి దేవి 24 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత ఆమె మౌనం వీడనుంది. ఇక రామ మందిర ప్రారంభోత్సవంకు ఆమెకు ఆహ్వానం అందింది.
సరస్వతి దేవి సోమవారం నాడే అయోధ్యకు ప్రయాణం అయ్యారు. రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆమె మౌనవ్రతాన్ని వీడుతుందని ఆమె కొడుకు హరే రామ్ అగర్వాల్ వెల్లడించారు. స్థానిక ప్రజలు ఆమెను ‘మౌనీమాత’ అని పిలుస్తారు. 1986లో సరస్వతి దేవి భర్త మరణించిన తర్వాత ఆమె తన జీవితాన్నిరామ స్మరణకే అంకితం చేసిందని, యాత్రలు ఎక్కువగా చేస్తారని హరేరామ్ చెప్పుకొచ్చారు.


అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్టకు శుభముహూర్తం ఆసన్నమైంది. రామ భక్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణం కొన్ని రోజుల్లోరాబోతుంది. అయోధ్య రామ మందిరంను దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రామయ్యకు చాలా మంది భక్తులు భారీగా కానుకలను సమర్పించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రామయ్యకు బంగారు పాదుకలు సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్ర మొదలు పెట్టారు.
శ్రీనివాస శాస్త్రి హైదరాబాద్కు చెందినవారు. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండర్ కూడా. రాముడు అయోధ్య నుండి లంకకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో శ్రీనివాస శాస్త్రి నడుస్తున్నారు. రామేశ్వరంలో మొదలైన ఈ పాదయాత్ర, అరణ్య వాసంలో రాముడు తిరిగిన ప్రాంతాల గుండా వెళ్తున్నారు. దారిలో కంచి, శృంగేరీ, పూరీ, ద్వారకా పీఠాధీశుల ఆశీస్సులు తీసుకుని అయోధ్య వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
64 ఏళ్ళ వయసు ఉన్న శ్రీనివాస శాస్త్రి తలపై బంగారు పాదుకలు పెట్టుకుని అయోధ్యకు ఎనిమిది వేల కిలోమీటర్ల నడుస్తూ, భక్తిని చాటుకుంటున్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు లక్షల ఇటుకలను దానం చేశారు. శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ. తన తండ్రి రామ భక్తుడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చూడాలనేది తన కల అని ఎప్పుడు చెప్పేవారు. తండ్రి కలను నెరవేర్చడం కోసం బంగారు పాదుకలతో పాదయాత్ర చేస్తూ, అయోధ్యకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు.
