ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా షర్మిల ఎంగేజ్మెంట్ కు హాజరైన తన అన్న సీఎం జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
అన్న జగన్ పట్టించుకోని, షర్మిల జగన్ రాజకీయ ప్రత్యర్ధి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం చెప్పడం, ఆదరించిన తీరుతో ఇద్దరి మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు. ఇది ఇలా ఉంటే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో సీఎం జగన్, భారతి పూజలు చేయగా, భారతి పూజారులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను అవమానపరిచిందంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు ఆఫీస్ లో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇద్దరు తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సీఎం జగన్ పంచెకట్టుతో, భుజంమీద కండువాతో కనిపించారు. తన సతీమణి భారతితో కలిసి పూజలు చేశారు. గోమాతకు పూజ కూడా చేశారు. ఆ తరువాత భోగి మంటను వెలిగించారు. అయితే పూజలు పూర్తయిన తరువాత పూజారులు ఇచ్చిన తీర్ధ, ప్రసాదాలు ఇచ్చారు.
అయితే కొందరు వైఎస్ భారతి తీర్థాన్ని ఒంపేసిందని, ప్రసాదాన్ని పొట్లం కట్టిందంటూ విమర్శిస్తూ కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు. అయితే ఆమెకు తీర్ధం ఇవ్వగా, తీసుకుంది. ఆ తరువాత తల పై రాసుకుంది. ఇలా అందరు సాధారణంగా చేస్తారు.
తీర్థాన్నికిందపడానివ్వకుండా తలకు రాసుకోవడం అనేది ఎప్పటి నుండో ఉన్న విషయమే. ఆ విధంగానే ఆమె చేసింది. ఇక ప్రసాదాన్ని తీసుకున్న తరువాత పక్కన ఉన్నావారెవరో టిష్యూ ఇవ్వగా, దానితో తన చేతిని తుడుచుకుంది. ప్రసాదాన్ని పొట్లం కట్టడం కానీ పడేయడం కానీ చేయలేదు. ఇదంతా కావాలని చేస్తున్న ప్రచారం అని అంటున్నారు.
watch video :
Also Read: రాజారెడ్డి ఎంగేజ్మెంట్లో షర్మిల తన అన్నని పట్టించుకోలేదా..? విభేదాలు నిజమేనా..?

వైఎస్ షర్మిల తనయుడి ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికలను గత పది రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులను కలిసి అందచేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే షర్మిల అందరికన్నా ముందుగా ఆహ్వాన పత్రికను తన అన్న జగన్ కు అందచేశారు. కానీ దానికి సంబంధించిన ఫోటో లేదా వీడియో ఎక్కడా కనిపించలేదు. అటు వైసీపీ కానీ ఇటు షర్మిల కానీ వాటిని రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా నిశ్చితార్థంకు జగన్ హాజరైన ఫోటోలు, వీడియోలు సీఎంఓ ప్రతినిధులే రిలీజ్ చేశారు. ఇందుకు కారణం ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ గా షర్మిల అవడమే అంటున్నారు.
ఇక కొడుకు నిశ్చితార్థంకు ఆహ్వానించిన షర్మిల, వైఎస్ జగన్, భారతిలను పట్టించుకోలేదని, జగన్ వచ్చి, వెళ్లేంత వరకు అన్నా చెల్లెళ్ళు అంతగా కలవలేదని టాక్. ఫోటో దిగడం కోసం స్వయంగా జగన్ పిలిచినా షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ పట్టించుకోలేదు. దాంతో జగన్, భారతి బొకే ఇచ్చి వెంటనే వేడుక నుండి వెళ్లిపోయారు. ఇదంతా చూసినవారు జగన్ కలవాలని చూసినా షర్మిలే దూరంగా ఉంటున్నారని అక్కడికి వచ్చినవారు అంటున్నారు. జగన్ తన చెల్లిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలని చూసినా ఆమె అన్న వైపు చూడలేదని ఇతర అతిథులు అంటున్నారు.
అయితే ఇదే వేడుకకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ స్వయంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నంత సమయం ఆయనతో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్నతో ఫోటోకు దూరంగా ఉన్న షర్మిల, బ్రదర్ అనిల్, పవన్ కళ్యాణ్ పక్కన ఫోటో దిగడం. రాజకీయంగా జగన్ శత్రువు అయిన పవన్ కళ్యాణ్ కు షర్మిల ఇంతటి ఆదరం చూపడంతో అన్నాచెల్లెళ్ల మధ్య విబేధాలు పెరిగిపోయాయని అంటున్నారు.




షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల పెళ్లి ఫిబ్రవరి 17న జరగనుంది. ఈ క్రమంలో షర్మిల పాలిటిక్స్ కు అతీతంగా పలువురు రాజకీయ నేతలను కలిసి నిశ్చితార్ధంతో పాటు వివాహం, రిసెప్షన్‌కి కూడా ఆహ్వానిస్తున్నారు. ముందుగా అన్న జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించింది. అన్న జగన్ కు ప్రత్యర్థులు అయిన టిడిపి అధినేత చంద్రబాబును షర్మిల కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పడం.
జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం చూస్తుంటే అన్న జగన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం చంద్రబాబుతో భేటీని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.





వై ఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు రాజా రెడ్డి వివాహం ప్రియా అల్లూరితో ఫిబ్రవరి 17న జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లికి ఆహ్వానిస్తూ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
అంతేకాకుండా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలకు స్వయంగా ఆహ్వాన పత్రికలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్ధం హైదరాబాద్ లో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలుస్తోంది. వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా షర్మిల ఆహ్వానించారు. అయితే ఈ నిశ్చితార్ధంకు నారా లోకేష్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఈ ఆహ్వానంను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల కోరిన విషయం తెలిసిందే. దాంతో ఈ వేడుక పై అందరి దృష్టి పడింది. ఎవరెవరు హాజరు అవుతారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.