2023 వన్డే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 16న సెమీఫైనల్స్, 19 ఫైనల్స్ మ్యాచ్ జరగనున్నాయి. సెమీఫైనల్స్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ని ఓడించాలని అటు భారత జట్టుతో పాటు ఇటు యావత్తు భారత అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
నిన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన విజృంభించి ఆడింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీం 410 పరుగుల భారీ స్కోరు చేసింది.మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్, కే.ఎల్ రాహుల్ అయితే సెంచరీలతో చెలరేగిపోయారు. రోహిత్ శర్మ, కోహ్లీ, శుభమన్ గిల్ అయితే టీం కి మంచి ఆరంభాన్ని అందించారు.
వీళ్ళందరి సమిష్టి కృషితో భారత భారీ స్కోర్ చేయగలిగింది.తర్వాత బ్యాటింగ్ కి దిగిన నెదర్లాండ్స్ కూడా నిలకడగానే ఆడింది. భారత్ కి విజయం లాంచనమని తెలిసిపోయాక రోహిత్ శర్మ బ్యాటర్ ల చేత కూడా బౌలింగ్ చేయించాడు. కోహ్లీ బౌలింగ్ వేసి ఒక వికెట్ తీసుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్, గిల్ కూడా బౌలింగ్ చేశారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బౌలింగ్ చేయగా ఆఖరి వికెట్ అతనికి దక్కింది దీంతో 9 మ్యాచ్ లలోను భారత్ విజయాన్ని నమోదు చేసింది.ఈ సమిష్టి విజయాల పైన కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. వరల్డ్ కప్పుకి ముందు ప్రతి ఒక్కరం ఒక్కో మ్యాచ్ ను గెలుచుకుంటూ వెళ్లాలని ప్రణాళిక రచించినట్లుగా తెలిపాడు. అన్ని మ్యాచ్ లపై ఒకేసారి దృష్టిపెట్టే కంటే ఏ మ్యాచ్ ని ఆ మ్యాచ్ స్పెషల్ గా చూసామని తెలిపారు.
మైదానంలో కూడా దానికి తగ్గట్టు నడుచుకుంటూ టీం విజయం కోసం పోరాడమని తెలియజేశాడు.టీంలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారని ఇది టీం కి శుభ సూచకమని, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా మాలో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. అభిమానులకు మాపైన భారీ అంచనాలు ఉన్న అవన్నీ పక్కనపెట్టి కేవలం ప్రదర్శన మీదే దృష్టి పెట్టామని అన్నారు.ఇక సెమీఫైనల్ మ్యాచ్ మీద తమ దృష్టి ఉందని అన్నారు.భారత్ సెమీఫైనల్ నెగ్గి ఫైనల్ కి చేరి కప్పు కొట్టాలని 150 కోట్ల భారత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రోహిత్ సేన కూడా ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ సాధించాలని పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు చూపెట్టిన ప్రదర్శనమే కొనసాగిస్తే కప్పు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు.
Also Read:టీం ఇండియాకి ఉన్న అతి పెద్ద టెన్షన్ ఇదేనా..? ఈ ఒక్క లోటు తీరితే కప్ కొట్టినట్టే..!