ఇటీవల సంచలనం సృష్టించిన ఉత్తర ప్రదేశ్ జ్యోతి మౌర్య సంఘటన అందరికి తెలిసిందే. తన భార్య కలను నెరవేర్చడం కోసం రేయింబవళ్ళు శ్రమించి, చదివించిన భర్తకు ఆ భార్య గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన తరువాత ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన జ్యోతి మౌర్య తన భర్త అలోక్ మౌర్య ఉద్యోగం వచ్చిన తరువాత మోసం చేసిందనే వార్త వైరల్ అయ్యింది. అయితే తాజాగా జ్యోతి మౌర్య తండ్రి తన అల్లుడే మోసం చేసి తన కుమార్తె జ్యోతి మౌర్యను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన జ్యోతి మౌర్యకు సంబంధించిన రకరకాల పోస్ట్‌లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పిసిఎస్ అధికారి అయిన జ్యోతి మౌర్య ఉద్యోగం వచ్చిన తర్వాత తన భార్య నమ్మకద్రోహం చేసిందని ఆమె భర్త అలోక్ మౌర్య చేశారు. అంతేకాకుండా తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఆమె పిసిఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో తన సహాయాన్ని ఉపయోగించుకుందని అలోక్ ఆరోపించారు.
తాజాగా అలోక్ మౌర్య, జ్యోతి మౌర్యల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ కార్డులో అలోక్ పారిశుధ్య కార్మికుడు అని కాకుండా గ్రామ పంచాయతీ అధికారి అని ఉంది. వైరల్ వెడ్డింగ్ కార్డ్ గురించి చెప్పడానికి జ్యోతి మౌర్య తండ్రి పరాస్ నాథ్ మౌర్య ముందుకు వచ్చారు. పెళ్లి సమయంలో అలోక్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన విషయాన్ని చెప్పలేదని జ్యోతి తండ్రి అన్నారు. దానికి బదులుగా అలోక్ గ్రామ పంచాయతీ అధికారినని చెప్పాడని అన్నారు.
అలోక్ మౌర్య ఇప్పుడు తాను పారిశుద్ధ్య కార్మికుడిని అని అరుస్తున్నాడని, కానీ పెళ్లికి ముందు, అలోక్ మరియు అతని కుటుంబం అబద్ధాలు చెప్పారని ఆయన వెల్లడించారు. తప్పుడు సమాచారం వల్లనే పెళ్లి జరిగిందనీ, అలాంటి పెళ్లి వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అని అన్నారు. జ్యోతి మౌర్య తండ్రి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని చిరాయిగావ్లో నివసిస్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో దారుణం..! ఉదయం రోడ్ మీద వెళుతుండగా..?










హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర అనే మహిళా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేది. ఈక్రమంలో పవిత్ర ఆ కంపెనీ ఓనర్ చేతన్‌గౌడను ప్రేమించింది. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొన్నాళ్ళ వరకు సజావుగా సాగింది. ఇటీవల చేతన్‌గౌడకు మరో మహిళతో సంబంధం ఏర్పడింది. దాంతో పవిత్ర, చేతన్‌గౌడ ల మధ్య గొడవలు జరిగేవి. పవిత్ర పిల్లలు కావాలని అనుకోగా, ఆమె భర్త అందుకు నిరాకరించాడు.
అప్పటి నుండి భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. తాను ఉండగా మరో యువతితో వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకున్నావని పవిత్ర చేతన్‌గౌడను నిలదీసింది. తాను మగాడినని, ఏదైనా చేస్తానని, పవిత్ర తల్లి ముందే పవిత్ర పై దాడి చేశాడు. తీవ్ర మనోవేదన పడ్డ పవిత్ర, తాను భర్తతో గొడవపడిన వీడియోను, తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు రాసిన డెత్‌నోట్‌ను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది.
ఆ స్టేటస్ చూసిన పవిత్ర తల్లి చూసి, వెంటనే కూతురి ఇంటికి వచ్చింది. అయితే పవిత్ర అప్పటికే ఉరి వేసుకుని, మరణించింది. దాంతో పవిత్ర తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చేతన్‌గౌడ, అతని ప్రేయసి పై కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేపట్టారు.
వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంకి చెందిన అనూష మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా పెళ్లి చేసుకోవాలనుకునే యువకులను పెళ్లి పేరుతో మోసం చేస్తుంది. ఒకరితో వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు కాపురం చేసి, ఆపైన ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లడం. ఆ తరువాత మరొకరిని పెళ్లి చేసుకోవడం. ఇలా అనూష ఇప్పటిదాకా నలుగురిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయిన సుద్దాల రేవంత్ అనే బాధితుడు అనూష పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాంతో అనూష బండారం బయటికి వచ్చింది. పెద్దపల్లికి చెందిన రేవంత్‌కు మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా అనూషతో పరిచయం కలిగింది. పరిచయం పెరగడంతో వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లి జరగక ముందే అనూష అవసరం ఉందని అడగడంతో రేవంత్ రెండు లక్షల రూపాయలు ఆన్లైన్ లో పంపించాడు. 2022లో డిసెంబర్ 14న అనూష – రేవంత్ ల పెళ్లి జరిగింది. 70 వేల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం అనూషకు ఇచ్చాడు.
పెళ్లి అయిన తరువాత రేవంత్ తో 2 నెలలు కాపురం చేసిన తరువాత అనూష ఇంట్లోని డబ్బు, బంగారు నగలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అనుషను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఆమెకు ఇదివరకే 3 పెళ్లిళ్లు అయినట్లు తెలియడంతో రేవంత్ షాక్ అయ్యిమోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.








