జేఈఈ.. ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జాయింట్ ఎంట్రన్స్ ఎక్సామ్) ఆల్ ఇండియా లెవెల్లో దీన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో మనకు ఎంసెట్ ఎలాగో జాతీయ స్థాయిలో ఇది ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష. ఇందులో మంచి ర్యాంక్ సాధించిన వారికి దేశంలోని అత్యుత్తమ ఇంజనీర్ కాలేజీల్లో సీట్ వస్తుంది.
ఈ ప్రవేశ పరీక్ష కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక్కోసారి క్వాలిఫై అవ్వడం కూడా కష్టమే. అలాంటిది జేఈఈ టాపర్ నవ్య హిసారియా నూటికి నూరు మార్కులు వచ్చినప్పటికీ మరోసారి పరీక్ష రాస్తానంటున్నాడు. జేఈఈ మెయిన్ సెషన్-1లో హిసారియా మంచి మార్కులు సాధించినా.. మరోసారి ఈ పరీక్ష రాసేందుకు సిద్ధం అవుతున్నాడు. జేఈఈ మెయిన్ సెషన్- 2లో నిరూపించుకోవడం ద్వారా తన టైమ్ మేనేజిమెంట్ మెరుగుపడుతుందని భావిస్తున్నాడు.
ఇదే విషయాన్ని నవ్య హిసారియా మీడియాతో మాట్లాడుతూ.. జేఈఈ మెయిన్‌కు హాజరుకావడం ద్వారా ఇచ్చిన గడువులోగా పేపర్‌ను ఎలా పూర్తి చేయాలో, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అర్థమవుతుంది అన్నారు. ఇది ఒక వ్యాయామం లాంటిదని అన్నాడు. ఒకవేళ నవ్య హిసారియా రెండవ ప్రయత్నంలో మంచి స్కోర్ సాధించకపోయినా నష్టం ఏం ఉండదు. ఎందుకంటే రెండు స్కోర్లలో ఏది ఉత్తమమైతే దానినే ఫైనల్ చేస్తారు.